30, ఏప్రిల్ 2015, గురువారం

సమస్యా పూరణము - 1661 (పద్యరచన నల్లేరుపై బండినడక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పద్యరచన నల్లేరుపై బండినడక.

33 కామెంట్‌లు:

  1. పద్యముల వ్రాయ నేర్వంగ వచ్చునిచట
    శంకరాభరణమునందు చక్కగాను
    శంకరయ్యగారిచ్చు సూచనలనగును
    పద్యరచన నల్లేరుపై బండి నడక

    రిప్లయితొలగించండి
  2. పద్య వస్తువు పైనను పట్టు గలిగి
    వ్యాకరణఁపు కిటుకుల ను పట్ట గలిగి
    మనసు నేకాగ్ర గతముగ మార్చి తేని
    పద్య రచన నల్లేరు పై బండి నడక

    రిప్లయితొలగించండి
  3. తే.గీ.పదము గణముగుణయతుల వ్రాయలేదు
    యింపు సొంపారు కవితలు యిచ్చకమున
    కవుల స్నేహసౌభ్రాత్రసౌకర్యమలరె
    పద్యరచన నల్లేరుపై బండినడక.

    రిప్లయితొలగించండి
  4. తెలుగు సాహిత్య మన్నను గలుగు ప్రీతి
    మనసు మమతలు నిండిన మైత్రి వనము
    వివిధ ఛందస్సు లనునేర్పు వేల్పు గురువు
    పద్య రచనన ల్లేరుపై బండి నడక
    కాదు పండిత నిలయమ్ము గాంచు మంటి

    రిప్లయితొలగించండి
  5. చదువక పలు గ్రందమ్ముల సాధ్యమౌనె
    చక్కని కవితలన్ వ్రాయ నిక్కముగను
    ధారణ కలిగిన సతము ధారవచ్చు
    పద్యరచన నల్లేరుపై బండి నడక

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణమ్మన శారద గుడి
    తెలుగు వచ్చిన పలుకుల తీరు మారి
    వాణి కరుణను కైతలు వరద లగును
    పద్యరచన నల్లేరుపై బండినడక.

    రిప్లయితొలగించండి
  7. తే.గీ.యతులు ప్రాసలు గణముల మతులుచెదరి
    కవిత యన్నను గుబులాయె కవుల కిచట
    కంది శంకరాచార్యులు కాపు కాయ
    పద్యరచన నల్లేరుపై బండినడక.

    రిప్లయితొలగించండి
  8. వాణి కరవీణ సరిపోలు పద్య పతికి
    పలుకు తేనెల మాధురీ బాదుషాకు
    పద్య నిర్మాణ చాతురీ ప్రభు వరులకు
    పద్య రచన నల్లేరుపై బండి నడక

    రిప్లయితొలగించండి


  9. వర్ధమానపు కవులేమొ వ్రాసి జూప
    ప్రాస యతులను గణముల దోసములను
    గురువు సరిజేసి తగినట్టి మెరుగులీయ
    పద్యరచన నల్లేరుపై బండినడక.

    రిప్లయితొలగించండి
  10. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భాషపై పట్టు ,పాండితీ ప్రతిభ ,మేధ
    తనర వ్యాకరణాది ఛందస్సు తోడ
    నతుల భావ ,మలంకార ,మమరు వేళ
    పద్యరచన నల్లేరుపై బండి నడక.

    రిప్లయితొలగించండి
  11. ఈ నాటి పద్యాలన్నీ నావంటి ఔత్సాహికులకు పాఠ్యాంశాల్లా
    ఉన్నాయి. కవన గురువులకు నమస్కారాలు

    రిప్లయితొలగించండి
  12. గణములకధిపతగనుండి తానె యతిగ
    యక్షర జనకుండు మరి లయను నడిపెడి
    శంకరుని దయగలుగను సంతసముగ
    పద్యరచన నల్లేరుపై బండినడక

    *మొదటి పంక్తికి స్ఫూర్తి శ్రీ తనికెళ్ళ భరణి గారికి కృతజ్ఞలతో

    రిప్లయితొలగించండి
  13. శంక రార్యుల సూచనల్ సరిగ చూసి
    వ్రాయ మొదలిడ పద్యముల్ వాసి గాను
    పద్య రచన నల్లేరు పై బండి నడక
    వోలె సాగును నిజమిది పోచి రాజ !

    రిప్లయితొలగించండి
  14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పల్లా నరేంద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    “అష్టావధాన కష్టావలంబన మన్న నల్లేరుపై బండినడక మాకు” అన్నది తిరుపతి వేంకట కవులు.

    రిప్లయితొలగించండి
  16. నిన్న మొన్నటివరకున్న నిర్మలుండు
    కంది శంకరు బ్లాగులో విందు జేసి
    దివికి జనినట్టి నేమాని కవివరునకు
    పద్య రచన నల్లేరుపై బండి నడక !!!

    రిప్లయితొలగించండి
  17. పాండవోద్యోగప్రభంజనమ్మును జూపు
    .......... తిరుపతివేంకటేశ్వరులకెన్న
    వాగ్ధార గంగాప్రవాహంబునే మించు
    .......... వీరరాఘవశాస్త్రి తీరుఁగన్న
    నాశుకవనమునందార్భాటమునుజూపు
    .......... కొప్పరపుకవుల గొప్పఁగన్న
    నూరు సమస్యలన్ పూరించి జూపిన
    .......... మోచెర్లవెంకన్న మోజుఁగన్న

    గణయతిప్రాసలలవోకగా వెలుంగు
    ధార ధారాప్రవాహంబు దాటగలుఁగు
    నట్టి కవిపుంగవులకెల్ల నరసి చూడ
    పద్యరచన నల్లేరుపై బండినడక.

    రిప్లయితొలగించండి
  18. భావ సంపద కూడిన పండితునకు
    వాక్కు లందించు వాణియె వరము లిడగ
    కంది వారల ప్రోత్సాహమందు చుండ
    పద్య రచన నల్లేరుపై బండి నడక!

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ,
    నేమాని మహానుభావుని స్మరించి బ్లాగుకు వారి లోటును గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    నిస్సందేహంగా ఇప్పటి వరకు వచ్చిన పూరణలలో మీది అత్యుత్తమం. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. ప్రాస యతులతోనాడెడు ప్రాజ్ఞులకును
    ధార ధారణ కలిగున్న సూరులకును
    భాష వాక్కున గొలువున్న పండితులకు
    భావ భాగ్యమ్ము నలరారుకోవిదులకు
    పద్యరచన నల్లేరుపై బండినడక !!!

    రిప్లయితొలగించండి
  21. నియమ మందుననిష్టూర నిధులు లాగ|
    వచన కవితల గాలాన వనితలాగ
    పద్యరచన నల్లేరుఫై బండి నడక
    వేగ మెంచెడి కాలాన సాగ దాయె|

    రిప్లయితొలగించండి

  22. భాషపై పట్టు సులలిత భావలహరి
    గణయతిప్రాసఛందస్సు గరిమ నెరిగి
    తెనుగు నుడి కారముల నల్లు కొనుట తెలియ
    పద్యరచన నల్లేరుఫై బండి నడక

    రిప్లయితొలగించండి
  23. కె .స్ గురుమూర్తి అచారి గారి పూరణ
    వ్యాకరణ ఛందమెరిగినయపుడె యగును
    పద్యరచన నల్లేరుఫై బండి నడక
    కానిచో యగు పల్లేరు కాలి నడక
    కవిత లల్లుట జన్మసంస్కార మహిమ

    రిప్లయితొలగించండి
  24. నాగరాజు రవీందర్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కలిగి+ఉన్న’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కలిగిన’ అంటే సరిపోతుంది.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నిధులవలెను, వనితవలెను’ అనండి. లాగ అనడం సరికాదు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కానిచో నగు’ అనండి.

    రిప్లయితొలగించండి
  25. అష్టావధానాన నలరించు బండిలో
    ---------ఎక్కినపృచ్చకుల్ చిక్కులుంచ
    నిలుప నిషేధముల్?పలుకుల చక్రాల
    ----------పరుగు సమస్యచే?తరుగజేయు|
    దత్తపదుల రాళ్లు చెత్త చెదారాలు
    -----------అడ్డుదాటును వర్ణనాంశములిడ|
    అప్రస్తుతపు గుంత లందందుగమనించి
    *********పౌరాణికాలతో ప్రక్క దొలగి
    మేడసాని,నాగపణిశర్మిడిన ధార
    ధారణనిలువ|తెలుగునజేరగానె
    పద్యపరిమళ భావంబు పంచుటందు
    పద్య రచన నల్లేరుఫై బండినడక|

    రిప్లయితొలగించండి
  26. అరయ నాల్గుచరణముల నలరు చుండు
    పద్య రచన నల్లేరుఫై బండినడక|
    యౌను,శబ్దలాలిత్య గద్యమ్ము వ్రాయ
    కాలి నడక పల్లేరుపై బోలు గాదె

    రిప్లయితొలగించండి
  27. భాష పై తగు పట్టు భావమ్ము నందు
    సృజన శక్తియు కల్గి విశేష మైన
    జ్ఞానమున్న ఛందస్సు వ్యాకరణమందు పద్య రచన నల్లేరుపై బండినడక

    రిప్లయితొలగించండి
  28. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘శర్మ+ఇడిన’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మూడవపాదంలో ‘జ్ఞా-క’లకు యతి లేదు. ‘జ్ఞ-ంక’లకు యతి చెల్లుతుంది.

    రిప్లయితొలగించండి
  29. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములు...

    ప్రతిభ, వ్యుత్పత్తి, యభ్యాస పటిమ గలిగి,
    వ్యాకరణము,ఛందోఽలంకృతాకరములుఁ
    గలిగి, భాషపైనను నధికారమున్నఁ
    బద్యరచన నల్లేరుపై బండి నడక!

    రిప్లయితొలగించండి
  30. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. ఈనాటి పద్యములన్ని నల్లేరుపై బండి నడకలా సాగాయి. కవి బృందానికి అభినందనలు !
    మాన్యులు శ్రీ శంకరయ్య గారూ విశేష యతి ప్రకారం ‘జ్ఞ’తో క, ఖ, గ, ఘ లకు యతి చెల్లుతుంది కదా !
    పూర్వోక్తోదాహరణల ప్రకారం :
    *జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర*కాశము సేయం
    *కర్మ మధర్మ మ*జ్ఞాన మాగడము
    *జ్ఞానేంద్రియజ్ఞాన*కళ లౌరుసౌరుగా

    ఇత్యాది .

    రిప్లయితొలగించండి
  32. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    ఏమిటో ... ఈమధ్య మతిమరుపు ఎక్కువైపోతున్నది. మొన్నమొన్ననే యతిభేదాలు వివరంగా పోస్ట్ చేశాను. విశేషయతి విషయం గుర్తుకే లేదు!

    రిప్లయితొలగించండి