21, అక్టోబర్ 2014, మంగళవారం

పద్యరచన - 713

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. మారిన కాలము తోడను
  తీరులు మారిన ను గాని తెలివిగ తలపన్
  నారీమణులకు చక్కని
  చీరే యందమ్మనుచును చిన్నది తెలిపెన్

  రిప్లయితొలగించండి
 2. చీర గట్టిన నచ్చటి చిన్న పిల్ల
  వాలు చూపులు గలదియై వాట ముగను
  నగవు మొగమున విలసిల్లి నారిబోలి
  చూడ ముచ్చట గొలిపెను జూడు డార్య !

  రిప్లయితొలగించండి
 3. పట్టు జీర గట్టి వయ్యార మొలికించు
  చిన్న వయసు లోని చిగురు బోణి
  చుట్ట జుట్టి తాను జుట్టును ముడివేసి
  జూచు చుండే మమ్ము సుమము లొల్క
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  పొట్టిదానికి పట్టుచీరా ? :

  01)
  ____________________________

  పొట్టి గౌనున తిరిగెడు - చిట్టి పాప
  కట్టె చీరను వింతగా - నట్టె చూడ
  కట్టు జారునని తలచి - పట్టె నడుము
  గట్టి గా,నిలచునొ ? లేదొ - పట్టు విడువ ?
  పొట్టి పిల్లకు గావలె - పట్టు చీర ?
  ____________________________

  రిప్లయితొలగించండి
 5. పట్టు చీరెను గట్టి తా చిట్టి తల్లి
  చేతులకు రాళ్ళ గాజులు చెంగలింప
  ముచ్చటగు ముడిని తుఱిమి ముదముతోడ
  వాలు చుపులు విసరెను పడతి వోలె
  ఫాన్సి డ్రస్సుల పోటీలో ప్రైజుఁగొనగ

  రిప్లయితొలగించండి
 6. అమ్మాయిలకిది నేర్పిన
  నమ్మా యిలకందమనుచు నమ్మల వేళన్
  అమ్మాయి గట్టె చీరెను
  అమ్మను తాననుకరించి యానందించెన్

  రిప్లయితొలగించండి
 7. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  పద్యరచన చీరగట్టిన బాల
  పాలబుగ్గల పసిడి యందాల బాల
  మొగ్గవై నీవు యత్యంత మొగ్గుజూపి
  చీరగట్టితివీవు వయారముగను
  సిగను ఋషికన్యవోలెను శిరసు పైన
  చెంగు వీపున జారంగ చిర్నగవులు
  పెదవులందున సంధించి వదనమును నొ
  కింత యవనత మ్మొనరించి చెంత నిలిచి
  నడుము పై చేయి వేయుచు నాకు సాటి
  ఎవరు గలరంచు ధాటీగనెదురు కొనగ
  తరలి వచ్చితివా నీవు తరళ నయన

  రిప్లయితొలగించండి
 8. ముంతంత కొప్పు జుట్టిన
  నింతలు కన్నుల బుడతది యింతిగ దీరెన్!
  సుంత నగవులన్ రువ్వగ
  గుంతల బుగ్గలు నునుపున గుబులే రేపెన్!

  రిప్లయితొలగించండి
 9. బాలా యెంత యొయారమే హొయలుగా బాగైన చీరన్ ధరిం-
  చేలా నిన్నుసి గొల్పితేరు చెపుమా శ్రీలన్ వెలార్చే గతిన్?
  స్త్రీ లీ నేలను చీరకట్టు సొబగుల్ సింగారమౌ చిన్నెలన్
  మేలౌ రీతుల నేల జేసితిరి సుమ్మీ నీవు నా కొమ్మవే.

  రిప్లయితొలగించండి
 10. చిన్న వయసు నందు చీర గట్టి నిలచి
  వన్నె లెన్నొజూపె బాల యిచట
  పూవు పుట్టగానె పొందు తావియనగ
  నందగించు నామె ముందు ముందు

  రిప్లయితొలగించండి
 11. చిన్న సవరణతో....

  అమ్మాయిలకిది నేర్పిన
  నమ్మలుగా మారినపుడు నదిసుఖమనుచున్
  అమ్మాయి గట్టె చీరెను
  అమ్మను తాననుకరించి యానందించెన్

  రిప్లయితొలగించండి
 12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  మీ తేటగీతికలో చిత్రంలోని అమ్మాయిని అందంగా వర్ణించారు. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఉసిగొల్పి తేరు’...?
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు గుర్గ్దేవులు పరాకు చిత్తగించారోలేకకోపగింఘారో
  నాపేరు మరచారు

  రిప్లయితొలగించండి
 14. బంగారపుటంచులతో
  శృంగారముగ గనిపించు చీరను మదళీ
  కంగారు లేక గట్టియు
  హంగామాచేయుచున్నయామెకు జోహార్

  రిప్లయితొలగించండి
 15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  పరాకే... మీ పేరు టైప్ చేయడం మరిచాను. మన్నించాలి.
  తేటగీతికలో చిత్రంలోని అమ్మాయిని అందంగా వర్ణించారు. అభినందనలు.

  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘మదళీ’....?

  రిప్లయితొలగించండి
 16. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు,
  ఆంధ్రభారతి నిఘంటువులో బాలిక అను పదానికి
  మదళీ అను సమానార్థం చూసి వాడాను

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ ధన్యవాదాలు. ఉసిగొపిలిపిన దెవరు అనే భావంతో వాడేనండీ.

  రిప్లయితొలగించండి