27, అక్టోబర్ 2014, సోమవారం

పద్యరచన - 719

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

 1. ఉడుతకు చాక్లెట్ నిచ్చెడు
  బుడుతని గాంచి మదిలోన పొంగెను స్మృతులే
  యుడుతా యుడుతా యూచని
  పాడుచు తిరుగాడినట్టి బాల్యము మెదలెన్

  రిప్లయితొలగించండి
 2. బుడుతడొక్కడు తాజేసె నుడుతతోడ
  చిత్ర కరచాలనమ్మును చిత్తమలర
  సాయమది యేమి జేసెనో సరసముగను
  తెలియ వలెను బాలకుని నే కలసినపుడు!!

  రిప్లయితొలగించండి
 3. ఇచ్చు చుండెను నాహార మింపుగాను
  బాలు డ చ్చట యుడుతకు బాగు బాగు
  జంతు వులపట్ల గలయట్టి జాలి కాహ
  యిడుదు జోహార్ల శతమును నీశ ! నేను

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. షేక్ హ్యాండు నిచ్చె బుడతడు
  జాక్ హ్యారీ పోటరతడు చనుచును దోవన్
  షేక్ హ్యాండు నిచ్చె నుడతయు
  టేక్ హ్యాపీ విష్షెసనుచు ట్రీ పైకెక్కెన్.

  రిప్లయితొలగించండి
 6. బుడతడు కరమును గలుపగ
  నుడుత కడకు నడచి కరము నొడుపుగ నివ్వన్
  బుడతని కరమున గలిపెను
  సడిచేయక తన కరమును సంతోషముగా!

  రిప్లయితొలగించండి
 7. కరుణారసహృదయుండై
  చిరుబ్రాయమునందెజంతుసేవానిరతిన్
  దొరయించునట్టిబుడతడు
  భరతావనిప్రజలకొక్కపాఠముజెప్పెన్.

  రిప్లయితొలగించండి
 8. తాతయ్య రాత్రి జెప్పిన
  సీతా రాము కథలోని సేతువు కొరకై
  చేతనిడితివట సాయము
  చేతిని గలుపంగ రావె! జే జే నీకున్!

  రిప్లయితొలగించండి
 9. యింటి పెరటి లోన యింపుగా తిరుగుచు
  బుడత డాడు చుండె నుడత తోడ
  చిఱుత ప్రాయమందె చిన్ని ప్రాణులపైన
  ప్రేమ పెంచు కొనియె వేడ్కతోడ

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ చంద్రమౌళిసూర్యనారాయణ గారూ,

  మూడుపాదాలను లఘువుతోప్రారంభించి నాల్గవపాదాన్ని గురువుతో ప్రారంభించారు

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  నిజమే! నేను గమనించలేదు.
  ఆ పాదాన్ని ‘కడు మోదము నందినాముగద బాల్యమునన్’ అందాం.

  రిప్లయితొలగించండి
 13. నిన్నటి పద్య రచన :
  మొక్కలు మొలవని చోటని
  యొక్కటిగా నున్న చెట్టు నుంచిరి కనుమా!
  చెక్కిలి గుంటై వంపది
  చక్కని రహదారి మోము సార్థక మాయెన్!

  రిప్లయితొలగించండి
 14. ఏ జన్మ బంధమో యిది
  యీ జన్మకు కుదిరె దోస్తి యిరువురి కిటులన్
  మోజుగ నుడుతకు బుడుతడు
  తేజో మయుడంద జేసె తీయని కరమున్.

  రిప్లయితొలగించండి
 15. నా పద్యంలో లోపాన్ని గమనించిన సంపతకుమార్ శాస్త్రి గారికి సవరించిన మాస్టారికి ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 16. సహదేవుడు గారూ,
  నిన్నటి శీర్షికకు మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పశువులతో సహవాసము
  పశుహింసను మాన్పుననెడు పరమార్థమ్ముల్
  దశదిశలను వ్యాపించగ
  శిశువుల భూతదయ పెంపుఁ జేయగ వచ్చున్.

  రిప్లయితొలగించండి
 18. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి