వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వృశ్చికరాశి వారి కుర్చీ అంటూ మీరు చెప్పిన పద్యం బాగున్నది. అభినందనలు. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండుచింతలవారి పద్యంలోని లోపాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
అందమైన కుర్చీ- చూస్తే నేలమీద - కొంటే ఆకాశంలో(ధర) - విహరించొచ్చు :
01)
_________________________________
పశ్చిమదేశపు వాసులె
వృశ్చిక రూపమున దీర్చె - బెళుకుల కుర్చీ !
నిశ్చయముగ దీని విలువ
పశ్చాత్తాపంబు నిచ్చు - పదపడి కొనినన్ !
_________________________________
తేలు కొండి వలెను మెలగెడు వారలు
రిప్లయితొలగించండిలోక మందు గలరు లోక నాధ !
యేమి పనియు లేక నితరుల బాధింతు
రదియ సుమ్ము వారి లక్ష ణంబు
కళలనారితేరి కలలోన కనలేని
రిప్లయితొలగించండివిద్యఁ జూపువారు వింతవింత
లైన యాసనముల నద్భుతముగఁజేసి
యమ్ముచుంద్రు, పుడమి యందునిట్లు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తేలు లాటి కుర్చి తేలికయౌ కుర్చి
రిప్లయితొలగించండితెలియ జెప్ప నిటుల విలువ పెరుగు
తేలు రాశి వారు తెచ్చి కూర్చున్నచో
తేలి పోవు బాధ తేలు సుఖము
తేలును బోలును గద్దెయె
రిప్లయితొలగించండికాలిని గుట్టు విపరీత కర్మల నడువన్!
పాలనలో ప్రజల మరువ,
శీలమునన్ మచ్చ పడిన శిరమునె గుట్టున్!
ద్వితీయ పాద మార్పుతో
రిప్లయితొలగించండితేలును బోలును గద్దెయె
కేలిని గుట్టునదె దురిత కేళికి దిగినన్!
పాలనలో ప్రజల మరువ,
శీలమునన్ మచ్చ పడిన శిరమునె గుట్టున్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివృశ్చికరాశి వారి కుర్చీ అంటూ మీరు చెప్పిన పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తేలు పీఠ మందు వాలుగా శయనింప
రిప్లయితొలగించండిపుచ్చ శయను డంద్రు పుడమి జనులు
వింత కోర్కె లడర వివిధ రూపాలలో
విక్రయించు చుండ్రి విపణి లోన
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిరెండుచింతల రామకృష్ణ మూర్తి గారి పూరణలొ మొదటి పాదం
తేలుకొండిని బోలు వాలుకుర్చిని జూడ
ఒక అక్షరం ఎక్కువ గా నున్నది.
తేలు కొండి బోలు వాలు కుర్చినిజూడ
రిప్లయితొలగించండితలను పొడుచు ననెడు గిలియె కలుగు
నిద్ర తేలుమాట నీటి మూటగ మార
వదలి పోవునట్టి వాంఛ కలుగు
దోషం సూచించిన అన్నపురెడ్డి వారికి కృతజ్ఞతలు
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిలెక్కకుమిక్కిలి గా గల
రిప్లయితొలగించండిరిక్కడ వడ్రంగ నిపుణులీభరత భువిన్
చక్కని యళిఁ బోలునటుల
చెక్కను కుర్చీగ జేసి చెక్కెను గనుమా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండుచింతలవారి పద్యంలోని లోపాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిచిత్రాసనమును జూడుము
ఛత్రమ్ముగ తేలుకొండి చయ్యన లేచె
న్నాత్రంబేలొకొ? కొనుటకు
మిత్రమ, యోచింపుమయ్య మేలున్ గీడున్.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేలుకొండియె ఆసనమ్మని తెల్సికొమ్మధికారిని
రిప్లయితొలగించండికాలుసేతులు కట్టివైతురు కార్యముల్ జరిపించనున్
పాలనమ్మొనరింపగావలె పద్మమొగ్గల మందునన్
వీలుగాదు ప్రభుత్వమందున వీరస్వర్గమెదిక్కగున్
కేంబాయి తిమ్మాజి రావు
తేలుకొండియె ఆసనమ్మని తెల్సికొమ్మధికారిని
రిప్లయితొలగించండికాలుసేతులు కట్టివైతురు కార్యముల్ జరిపించనున్
పాలనమ్మొనరింపగావలె పద్మమొగ్గల మందునన్
వీలుగాదు ప్రభుత్వమందున వీరస్వర్గమెదిక్కగున్
కేంబాయి తిమ్మాజి రావు