కవిమిత్రులారా!
గోలి - గుండు - మంద - మల్లెల
పైపదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(గోలి హనుమచ్ఛాస్త్రి, గుండు మధుసూదన్, మంద పీతాంబర్, మల్లెల సోమనాథ శాస్త్రి గారలకు ధన్యవాదాలతో)
గోలి - గుండు - మంద - మల్లెల
పైపదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(గోలి హనుమచ్ఛాస్త్రి, గుండు మధుసూదన్, మంద పీతాంబర్, మల్లెల సోమనాథ శాస్త్రి గారలకు ధన్యవాదాలతో)
మాష్టారు నిన్నటి సమస్యా పూరణ సమీక్షించ ప్రార్ధన
రిప్లయితొలగించండిఅదిగో లివగా తెచ్చెను
రిప్లయితొలగించండిగద హనుమంతుండు గుండు గగనపధమునన్
వదలక మందందుందని(మందు +అందు+ఉందని)
మదిలో శ్రీరామభక్తిమల్లెలలరగన్
(లివ=లాఘవము, గుండు = కొండ)
ఘనవర! యదిగో లింగని ధనువు గనుము
రిప్లయితొలగించండిమందసంబున! వరమున మాకు వచ్చె!
యెత్తుమల్లె లంకెను కూర్చి మత్తనయను
పెండ్లి యాడి చల్లంగుండు పేర్మి తోడ!!
ఎత్తుము + అల్లె లంకె కూర్చి = ఎత్తి వింటి నారి తొడిగి
మంద గమనము గలదియై మల్లె లసర
రిప్లయితొలగించండిముగర మున బట్టు కొనసీత ముదము తోడ
గుండు వలెనుండు ధనువును గోలి వోలె
నెత్తె రాముడు రాజులు నీ ర్ష్య బడగ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఉంది’ వ్యావహారికం. ‘మందు గలదనుచు’ అనండి.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వచ్చె/ నెత్తు...’ అనండి.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేడె జరుపుడు రంగోలి నిండె ముదము
రిప్లయితొలగించండిసలుప పట్టాభిషేకంబు చల్లగుండు
చల్లనైనట్టి పాదాల మల్లెలౌచు
నాలమందల మేపినన్ యలుపురాదు
రామభక్తిని పలికెగా గ్రామ్యుడిట్లు
వ్యావహారిక భాషలో కూడా వ్రాయచ్చాండీ?
రిప్లయితొలగించండివ్యావహారికంలో పద్యం వ్రాయకూడదనే 'నియమం' అంటూ యేమీ నాకు తెలిసినంతవరకూ లేదు.
రిప్లయితొలగించండిఐతే, వ్యావహారికభాషలో పద్యాలు వ్రాయదలచుకొన్న వారు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది.
1. సభాయోగ్యమైన భాషనే వాడాలి.
2. గ్రంథభాషనూ వ్యవహారభాషనూ కలగాపులగం చేయరాదు.
3. మాండలికపదాలను వాడే పక్షంలో వివిదప్రాంతాల మాండలికాలను కలగలిపి వాడకూడదు.
4. ఒకప్పుడు సంస్కృతం దేశభాషలమీద పెత్తనం చేసిందనీ అందుకే సంస్కృతపదాడంబరం మన కవిత్వాలలో ఉందని ఒక వాదం ఉంది. ఇప్పుడా స్థానంలో ఎవరు కాదన్నా ఆంగ్లం వచ్చి కూర్చుంది. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే ఆంగ్లపదాలనూ వాడవచ్చును - ఐతే ఆంగ్లవ్యాకరణం చొప్పించే యత్నాలు నప్పవు.
5. గ్రంథభాషలో ఐనా, వ్యావహారికంలో ఐనా, ఒక శైలినీ, ధారాశుధ్ధినీ కలిగి ఉండటం పద్యానికి తప్పని సరి. భావశబలత సంగతి సరేసరి - అది లేనిదే పద్యానికి ఉనికి పూజ్యం.
6. వ్యావహరికంలో వ్రాయ దలచుకున్నప్పుడు అది మీ రెంచుకున్న సందర్భాన్ని గమనించండి. సందర్భానికి న్యాయం చేయటం సరిగా కుదరనప్పుడు సాంప్రదాయికమైన పధ్ధతిలోనే వ్రాయండి.
ఒక ఉదాహరణ కోసం చూడండి శ్యామలీయం బ్లాగులోని నా యీ టపాను ఎవరో రాసిన పద్యం
మీరూ తప్పక వ్యావహారికంలో పద్యాలను ప్రయత్నించ వచ్చును. ఐతే, శంకరయ్యగారి సమ్మతితో మాత్రమే. ఈ బ్లాగులో హెచ్చుగా సంప్రదాయకతకే పెద్దపీట వేస్తున్నాము కదా.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
సీత రామునితో :
01)
_______________________________
చూడు మవిగో లికుచములు - సొచ్చెముగను
రంగు రంగుల గుండులు - రమ్యముగను
చిత్రమృగముల మందలు - చిత్రముగను
మల్లెల పొదల మాటున - మఱుగువడిన
స్వర్ణ మరుకపు చిత్రమౌ - వర్ణములను
_______________________________
లికుచము = గజనిమ్మ, గంగరేగు
సొచ్చెము = పెద్ద
గుండు = శిల
చిత్రమృగము = జింక
మరుకము = లేడి
మల్లెల వరి పూరణలు
రిప్లయితొలగించండి1 .గోలిమూక గొట్టె గొప్పగానసురుల
పెళ్ళు రాలె పళ్ళు మల్లెలటుల
గుండు రాళ్ళు విసరగూలిరి బండలై
యనిని మంద భాగ్య మలరె వారి
2.మంద బుద్ధి యగుచు మానిని తెచ్చెగా
మల్లెలటుల వెలుగు మాన్య సీత
పరగగ కలగుండు పాతును న౦దగా
గోలి మూక వలన గూలె లంక
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిరకతమును గుమ్మరించి బొమికల విసరి
గోలి కాయల వలె వేసి గుండు రాళ్ళు
పైరు చెడగొట్టు మల్లెల పగిది,చెరిచె
గాదిసుతుని యాగమును రక్కసుల మంద
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిగుండు పైన సిగను బొండు మల్లెల రీతి
మందబుద్ది యసుర మైథిలేల
గోరితివి విధి యదిగో లిఖియించెను
రణము నందు చావు రావణుండ!
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిగోలి మందలు తిరిగేటి కోనలందు
గుండు బండల దారులు కూడియుండ
మంద గమనాన సాగిరి మహిత సీత
రామ లక్ష్మణులును మల్లె లతల మధ్య
బొండు మల్లెల వాసన పురిని విప్పు
నయిన,మందభాగ్య ననుచు,నతివ సీత
గుండు రాతిపై కూర్చుండి కుములు చుండి,
గోలి హనుమను గాంచియు కొంత దేరె.
గోలి లుండువనము కోమల కిష్కింధ
కొండ మల్లెలచట కొల్ల వెలుగ
మంద భాగ్యుడనని,మహితు హనుమకును
తనకును కలగుండు తగినరీతి
సీతను కోల్పడి రాముడు
వే తను కలగుండు వడుచు వెదకుచు చేరెన్
పూతపు గోలిల మందల
పూతల మల్లెల లతలను పొల్పగు నేలన్
మల్లెల వాసనల్ విరియ,మానిత బంగరులేడిని జూచియున్
నల్లన గుండురాళ్ళ పయి నావిధి,జానకి మంద బుద్ధియై
పెల్లుగ గోలిమూక గల భీమ మరణ్యము నుండి తెమ్మనన్
యుల్లము నందు నామెపయి నొప్పెడు ప్రేమనునేగె పట్టగా
గోలి=కొండముచ్చు చూ.శబ్దార్ధచంద్రిక.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోలి యొకటి వచ్చి కూర్మితో వనమున
రిప్లయితొలగించండిగుండు పైని సీత కండఁ జేర
మంద హాస మలరె! మానిని మోమున
మల్లె లలన మనసు మగని పైన
ఔనిదిగో లిప్త యైన నాకు యుగమ్ము
రిప్లయితొలగించండి..........నెచ్చెలి! నా చెంత నీవు లేక
బాగుండునే నాకు పండు వెన్నెల లోన
..........భామినీ! నీ యెడబాటు లోన
మల్లెలున్ మొల్లలు మరిమరీ ననుజూచి
...........విరిబోడి! కనుమదే వెక్కిరించు
మందమారుతవీచి మంటలు రేపుచూ
...........నొవ్వ జేసెడి చెలీ! నువ్వు లేక
కొండలన్ కోన లందున కుమిలి కుమిలి
వాగులన్ వంకలందున వగచి వగచి
అవనిజా! యేడ నీవని యరచి యరచి
పొగులు సీతకై రాముడు మిగుల గనుడు.
మల్లెలను బోలు నవ్వుతో మంద గమన
రిప్లయితొలగించండికనుగొను మదిగో లివతోడ కనక మృగము
పట్టితెమ్ము రయమునని పట్టుబట్టి
సుందరాంగుండు దశరథ సూను కోర
వెంబడించెను రాముడు పిల్వకమును
లివ: లాఘవము
పిల్వకము: లేడి
రాధాకృష్ణ రావు గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండి"గోలిం" అని "మల్లెలం" అని ప్రయోగించాను.
నిజానికి అలా ప్రయోగించటం సరి అయినదో కాదో నాకు తెలియదు.
గురువు గారు గాని, పెద్దలెవరైన మీ / నా సందేహాన్ని తీర్చగలరని భావిస్తున్నాను.
మిత్రులకు నమస్కారములు.
రిప్లయితొలగించండి(మహర్షి విశ్వామిత్రుఁడు శ్రీరామునిం దాటకనుఁ బరిమార్చుటకై పురికొల్పుచుఁ బలికిన సందర్భము)
"తాటకి యదిగో! లిప్తయందది కనఁబడి,
మదినిఁ గలగుండు వడఁగాను మాయమగుచు,
మునులు భయమందనఱచుచుఁ గనలుచుండె!
క్షిప్రమే కాండ మల్లె లక్షించి దానిఁ
గూల్చు మోరామచంద్ర! సంకోచ మేల?"
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందలు.
‘మేపినన్ + అలుపు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మేపిన నలుపు...’ అనండి.
*
శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
కవిమిత్రులు శ్యామలీయం గారు చెప్పినట్లు ఈ బ్లాగు సంప్రదాయానికే ప్రాముఖ్యత నిస్తుంది. మీరు మీకు వీలైన పద్దతిలో వ్రాసి పంపండి. సవరించడానికి, సలహా లివ్వడానికి నేను, మిత్రులం ఉనాము కదా!
*
శ్యామలీయం గారూ,
ధన్యవాదాలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
కెంబాయి వారి ద్వారా పంపిన రెండు పూరణలు, మాధురి గారి ద్వారా పంపిన ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రకతము’ అనడం గ్రామ్యమే. అక్కడ ‘రక్తమును గ్రుమ్మరించి శల్యముల విసరి’ అందామా?
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మైథిలి + ఏల’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘మైథిలిఁ గొన’ అనండి.
*
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చూడుము + అది’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘చూడుం/ డది...’ అనండి.
*
గుండా వేంకట సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మరలె’ అనే అర్థంలో ‘మల్లె’ అన్నారా? అయితే అది దోషమే.
*
మిస్సన్న గారూ,
కవితామాధుర్యం మిస్సన్న (miss అన్న) మాట రానీయని చక్కని పూరణ చేశారు. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ రెండు ప్రయోగాలు దత్తపది నియమాలకు వ్యతిరేకమే.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అదిగో లికమును చూడుం
రిప్లయితొలగించండిబది బాగుండును మనకది యందిన వేళన్,
అది వన మందలి కుట్రని
మది గానక గోరెనమ్మ మల్లెల వేళన్ .
కొరుప్రోలు రాధా కృష్ణ రావు 06/10/14
లంకకేగుటకు కొండ మీదికెక్కి నిలుచున్న హనుమను జూచిన కపుల సంభాషణ.
రిప్లయితొలగించండిమందమేమియు కాదులే మంచి చురుకు
గుండు వోలెను కనిపించె కొండ జూడ
లేచె నెగురునుగనదిగో లిప్తలోన
ఘన గరుడుమల్లె లభియించె గదర హనుమ.
మదీయ ద్వితీయ పూరణము:
రిప్లయితొలగించండి(సీతాదేవియొద్ద గోలచేయుచున్న రాక్షసవనితల నుద్దేశించి త్రిజట హనుమంతునిం బొగడుచుఁ బలికిన సందర్భము)
"మన గోలిట్టుల నుండనిండు! మనమా మాన్యం బ్రతారించినన్,
హనుమంతుం డట రామనామజపితోద్యన్మంగళాంగుండునై,
జనకాత్మోద్భవ హర్షమంద నపుడా చందాన రామోర్మికన్
వినుతుల్ సేయుచు వేగ నీన్, గురిసె తీవెల్ మల్లె లవ్వీరుపైన్!!"
మాస్టరు గారూ మమ్ములను సమస్యలో ఇమిడ్చినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికొరుప్రోలు వారూ,
రిప్లయితొలగించండి‘చూడుం/ డదిగో’... టైపాటు వల్ల ‘చూడుం/ బదిగో’ అయినట్టుంది.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
‘వలె’ అన్న అర్థంలో ‘మల్లె’ అన్నారు. అది గ్రామ్యం.
*
గుండు మధుసూదన్ గారూ,
సమర్థశబ్దప్రయోగంతో, ధారాశుద్ధితో మీ రెండవ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచాలా నాళ్ల తరువాత వృత్తం ప్రయత్నిస్తున్నానండీ ఎన్ని తప్పులో తెలియదు.
బంగరు లేడిని తెచ్చుటకు రాముడు వెళ్ళిన తరువాత సీత:
ఇదుగో లిప్తనువచ్చురాముడని తానేమార్చునాత్మన్, సమ
స్తదిశానాధులఁ బ్రస్తుతించు దునుమన్ దాగుండుభీతిన్ వెసన్
మిధిలాధీశునిపుత్రి మందమతి స్వామీ యంచు దుఃఖించుచున్
వ్యధతో మల్లెలచెండు ఓలె యొదిగెన్ వైదేహి ముగ్గందునన్
గురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సౌజన్యంతోనే మంచి పద్యాన్ని వ్రాయగలిగేను.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఆంజనేయస్వామి సముద్రలంఘనకు ఉపక్రమించుచూ శ్రీరామచంద్రస్వామిని మనస్సున ధ్యానించి, చెప్పినట్లుగా
ఇదిగో లిప్తముహూర్తకాలమున నేనీవారిధిన్ దాటెదన్
కదలింతున్ కలగుండు చెందగను లంకన్ కాల్చెదన్ దైత్యులన్
దుదముట్టింతును, మందహాసమున నే ద్రోవన్నెరింగించెదన్
మది రంజిల్లగ మల్లెలన్నిడుదు రామా నిన్ను పూజింపగాన్
రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. వృత్తరచన మీకు కొట్టినపిండే కదా! అభినందనలు.
‘ఓలె’ అనేది మాండలికం, గ్రామ్యం. పోలె సరియైన పదం. సంధివల్ల ‘వోలె’ అవుతుంది. ద్రుతాంతం కూడా. కనుక అక్కడ ‘మల్లెలచెండు వోలె నొదిగెన్’ అనండి.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
లిప్తకాలం, ముహూర్తకాలం ఉన్నాయి కాని ఈ ‘లిప్తముహూర్తకాలం’ ఏమిటి?
గురువుగారూ నావద్ద గల ఒక పాత నిఘంటువులో "ముహూర్తము" అన్న పదమునకు "పండ్రెండు క్షణముల కాలము" అనియు, మరియు బ్రాకెట్టులో వాడుకలో "శుభ లగ్నము" అని ఉన్నది.
రిప్లయితొలగించండి{గోలి హనుమంతులవారికి ముగ్గురు మిత్రులు సహకరించుటచే నేనీ దత్తపదిని గట్టెక్కగలిగినాను}
ధన్యవాదములు.
అదిగో లికమును చూడుం
రిప్లయితొలగించండిడది బాగుండును మనకది యందిన వేళన్,
అది వన మందలి కుట్రని
మది గానక గోరెనమ్మ మల్లెల వేళన్ .
కొరుప్రోలు రాధా కృష్ణ రావు 06/10/14
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిగోలి యొకటి వచ్చి కూర్మితో వనమున
గుండు పైని సీత కండఁ జేర
మంద హాస మలరె! మానిని మోమున
ధైర్యమల్లె లలన తర్కమందు