15, అక్టోబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం – 1533 (గజముఖుండగు మారుతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గజముఖుండగు మారుతి కాయు జనుల.

22 కామెంట్‌లు:

 1. నీలకంఠుని పాదపంకజములకు మనమున సాగిల మ్రొక్కుచూ..

  శివుని తొలి సుతుడెవ్వడు? శివుని రూపు
  సింధునేమి యందెవ్వడు? శివుని మదిన
  కాంచు హరి చేయు పనిఏమి? క్రమముగాను
  గజముఖుండగు - మారుతి - కాయు జనుల


  ---మారుపాక రఘుకిశోర్ శర్మ

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మొన్నెక్కడో నెట్లో చూసాను
  హనుమంతుడి వేషములో నున్న వ్యక్తి
  అమెరికా రోడ్లమీద
  కనబడిన వారినందరినీ పలకరిస్తూ
  నవ్వుతూ నవ్విస్తూ
  కరచాలనం చేస్తూ, కానుకలిస్తూ
  ఉదయము నుండి సాయంత్రము వరకూ తిరగడం !
  కిస్మస్‌తాతవలె !

  అదే పని మారుతి అనే వ్యక్తి వినాయక
  నవరాత్రులకు వినాయకుని వేషంలో చేస్తే :

  01)
  ____________________________

  మారు వేషము నున్నట్టి - మారుతి యట
  గణపతి నవరాత్రంబున - పణము బంచ
  తిరుగు చున్నట్టి తిరునాళ్ళ - తీరు గాంచి
  గజముఖుండగు మారుతి - కాయు జనుల
  ననుచు బొగడిరి యానంద - మంది జనులు !
  ____________________________
  పణము = ధనము(కానుకలు)

  రిప్లయితొలగించండి
 3. హరిదాసు కరివదనుని కథ చెప్పిన పిదప - పవమాన ---:

  02)
  ____________________________
  ----------------------------
  ----------------------------
  బాలు శిరమును గాంచిన - భవ్య వగచి
  శివుని ప్రార్థింప; నేనుగు - శిరము నతికి
  భవుడు దీవించి భార్యతో - పలికె నిటుల
  విఘ్ననాయకు డీతడై - పేరు గాంచు
  గజముఖుండగు ! మారుతి - కాయు జనుల
  రామ నామము స్మరియింప - రంజనముగ
  ననుచు హరిదాసు కరివద - నుని సుచరిత
  జక్కగా జెప్ప జనులంత - సంతసించె !
  ____________________________
  పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు..
  నీనామ రూపములకు నిత్య జయమంగళం..
  శ్రీమధ్రమారమణ గోవిందో హరి.
  సర్వేజనా సుజనాభవంతు.. సర్వే సుజనా సుఖినోభవంతు..

  రిప్లయితొలగించండి
 4. మారుపాక రఘుకిశోర్ గారూ,
  సర్వం శివమయం చేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘మదిని’ అనండి.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. రఘుకిశోర్ గారి బాటలో - సర్వం హరిమయం చేస్తే :

  03)
  ____________________________

  హరికి మేనల్లు డెవ్వండు ? - హరికి నిలను
  భార్య జాడను దెల్పిన - వాడెవండు ?
  శివుని స్మరియించు హరి యేమి - చేయు చుండు ?
  క్రమముగా సమాధానము - ల్గాంచి చదువ
  గజముఖుండగు - మారుతి - కాయు జనుల
  ____________________________

  రిప్లయితొలగించండి
 6. అడ్డగించిన బాలుని హతముజేసి
  భవుడు కరివదన మిడగ భవ్య సుతుడు
  గజముఖుండగు, మారుతి కాయు జనుల
  రామనామమ్ము దలచిన లక్షణముగ!

  రిప్లయితొలగించండి
 7. శ్రీగురుభ్యోనమ:

  చిత్తూరు జిల్లాలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, అర్ధగిరి ఆంజనేయస్వామి ఒకరికొకరు 20కిమీ దూరంలో భక్తుల ననుగ్రహించుచున్నారు. ఆంజనేయస్వామి సంజీవపర్వతమును తీసుకొని వెళ్ళునపుడు కొంతభాగము ఈ ప్రాంతమున పడి అర్ధగిరిగా ప్రసిద్ధి చెందినదని చరిత్ర.

  కాణిపాకాన గణపతి కరుణ జూప
  గజముఖుండగు, హనుమ కాయ జనుల
  నర్ధగిరిపైన వెలసిరి,హారతులను
  బట్టి నిరతము గొలచిరి భక్తజనులు.

  రిప్లయితొలగించండి
 8. బాలుని వధించె విభుడని భవ్య కుముల
  భవుడు జీవమిచ్చి తెలిపె బాలకుడు వి
  నాయకుడను పేరను విఘ్న నాయకుడగు,
  గజముఖుండగు, మారుతి కాయు జనుల
  రామ నామము జపియించ రమ్యముగను

  రిప్లయితొలగించండి
 9. విఘ్నములఁ బాపు దైవము భీష్మ సుతుఁడు
  గజ ముఖుండగు, మారుతి కాయు జనుల
  పంచ ముఖముల సారించి ప్రభల పాప,
  విష హరణములఁ గావించి విజ్ఞత నిడి
  సిరులఁ గురిపించి విజయమ్ము దొరకఁ జేయు!

  రిప్లయితొలగించండి
 10. వసంత కిశోర్ గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ పూరణలో నాల్గవ పాదం లేకున్నా అన్వయానికి ఇబ్బంది లేదు.
  *
  శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘హనుమ’ అన్నారు. దానివల్ల గణదోషం. మారుతి అనబోయి పొరపడినట్టున్నారు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ కెంబాయి తిమ్మజీరావు గారి పూరణ (విశాఖపట్నం)

  గగనమందున నెగురగ గరుడుడవగ
  వంశమలరింప వనముల వానరమవ
  చీల్చి చెండాడ రక్కసుల్ సింహమగుచు
  గజముఖుండగు మారుతి కాయు జనుల


  తుఫానులో ఇరుక్కున్నందున వారు పూరణను నా ఐడి తో పోస్ట్ చేస్తున్నాను

  రిప్లయితొలగించండి
 13. గురువుగారికి నమస్కారములు.

  నిన్నటి శ్రీ మధుసూదన్ గారి పద్యములో ఒక చిన్న సందేహము. "ర" కార నిషేధములో "ఋ" కారము ప్రయోగింపబడవచ్చునా ??

  తృణత, పృషత్, కృత అని ఉంది కదా.

  ఋ కారానికి మనము యతిమైత్రి విషయములో ఇ, ఏ కారములతో చూస్తాము కాబట్టి, అచ్చునకు హల్లునకు ఉన్న భేదము వలన దోషముండదంటారా ??

  రిప్లయితొలగించండి
 14. శివుని యంశను బుట్టియు, సేవ్యుడగుచు
  పంచ ముఖముల వెలిగేటి పావనుండు
  నగుట, నందున గజముఖ మౌట నొకటి
  గజముఖుండగు మారుతి కాయు జనుల

  వాయు నందనుడౌచును బలము తోడ
  జవము కూడను నందియు జయము నందు
  కనగ నెనిమిది సిద్ధులు కలిగి యుంట
  గజముఖుండగు మారుతి కాయు జనుల
  (గజము= ఎనిమిది)

  విఘ్న వారణు డౌచను వినుత రక్ష
  గజముఖుండగు-మారుతి కాయు జనుల
  రామ నామంబు పలికేటి రమ్య గుణుల
  ఇద్దరాగతి కాతురు నిలను నెపుడు

  పంచ ముఖు, డష్ట ముఖుడుగ వరలు వాడు
  బ్రహ్మ, శివులదౌ తేజాన, వాయుసుతుడు
  హనుమ, తానాంజనేయుగ, హయముఖుండు
  గజముఖుండగు, మారుతి కాయు జనుల

  భక్తుడౌచును బలమును బాగ పొంది
  భక్త జనులనుఁ గాచేటి భక్తుడతడు
  రామ నామంబు విన్నంత రాజితముగ
  గజముఖుండగు, మారుతి కాయు జనుల

  రిప్లయితొలగించండి
 15. శంకరార్యా !
  వరాహ,గరుడ,వానర,సింహ,హయ ముఖములే గద
  పంచముఖాంజనేయునకు !
  గజముఖ మెందైన గలదా ?

  రిప్లయితొలగించండి
 16. రమణ గారూ,
  ధన్యవాదాలు.
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  తుఫానులో ఇరుక్కొని కూడా సమస్యాపూరణ చేసి పంపాలన్న మీ ఆసక్తి ప్రశంసనీయం.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  రకారానికి ఋత్వానికి సంబంధం లేదు. గుండు వారి పూరణలో ఏ లోపమూ లేదు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ అయిదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ఆంజనేయుని పంచముఖాలలో గజముఖం లేదు.
  *
  వసంత కిశోర్ గారూ,
  పై వ్యాఖ్యను గమనించండి.

  రిప్లయితొలగించండి
 17. విఘ్నముల బాపి మన మొర వినెడి వాడు
  గజముఖుండగు, మారుతి కాయు జనుల
  క్షుద్ర శక్తుల నుండి, యశుభములన్ని
  తొలగ భక్తితో నిరువుర కొలువ వలెను

  రిప్లయితొలగించండి
 18. వస్త్ర సముదాయ మొక్కటి పట్టణమున
  రక్ష ణార్ధము నియమించె రక్షకునిగ
  ముసుగు ధరియించె ఏనుగు ముఖము ననగ
  గజముఖుండగు "మారుతి" కాయు జనుల
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 19. గురువు గారు సరిచేసిన నిన్నటి పద్యాన్ని చూడగలరు అట్లే వివరణ కూడా చూడ గలరు
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 20. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారూ ధన్యవాదములు.
  తప్పును సవరించినదులకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి