13, అక్టోబర్ 2014, సోమవారం

పద్యరచన - 705

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. వరద పొంగి వచ్చి వర్షాల ధాటికి
  ముంచి వేసె గుడిని పూర్తి గాను
  పూర్వ కాల మందు ముందు చూపు గలిగి
  గుడుల గట్టెను గద కొండ పైన

  రిప్లయితొలగించు
 2. వరదలు వచ్చెను జూడుము
  పరవళ్ళను ద్రొక్కు కొనుచు, బాబా గుడినిన్
  వరదల నీరది చుట్టెను
  వరదుని యున్వ దలలేదు వరదులు సుమ్మీ

  రిప్లయితొలగించు

 3. వరద వచ్చెను గుడిచుట్టు బాగు గాను
  గుడికి బోవంగ గలదట పడవ మనకు
  రండు పోదము పడవపై రమ్య ముగను
  ముక్తి తోబాటు గలుగును రక్తి కూడ

  రిప్లయితొలగించు
 4. వర్ష జలము లచట వరదలై పాఱగ
  పూజ్య మందిరమ్ము మునిగి పోయె
  దైవపూజ జేయు దారిని గాంచక
  జాఱిపోయె భక్త జనుల మనసు

  రిప్లయితొలగించు
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘గుడుల గట్టిరి గద..’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 6. విలయపు తాండవమ్మకట! వేదనఁ జెంది జనాళి పర్విడెన్
  కలరవమందు నిళ్ళనట కాడుగ వీడుచు నేటికేడు తా
  మలసిరి, లేదొకో తెరువు, మార్గమ?దొక్కటి బాధఁ దీర్పగా
  సులువుగ వానలందు నిలుఁ జొచ్చెడి నీటిని యాపునట్టుగా!

  రిప్లయితొలగించు
 7. సేవింప పంచ భూతము
  లావేశమ్మున పదమ్ము లంటగ జూడన్
  భూ విలయమ్మదె! ప్రభువా!
  రావా! నీ వారిఁ గావ, లక్ష్మీ రమణా!

  రిప్లయితొలగించు
 8. దేవళము నీట మునిగెన్
  ద్రోవయె లేదాయె దీప ధూపము లుంచన్
  దేవా! విలయంబేమిటి?
  కావగ రావేల జగతి కౌస్తుభధారీ!!

  రిప్లయితొలగించు
 9. వరదా ! వరదా ! యనుచును
  మరిమరి నీ భక్త కోటి మనసున దలవన్
  వరమిచ్చితివా యిట్టుల
  సరి తెలుగున కాదు స్వామి సంస్కృతమయ్యా !

  రిప్లయితొలగించు
 10. శ్రీహనుమచ్చాస్త్రి గారికి,

  మీ చలోక్తి అద్దిరింది.

  రిప్లయితొలగించు
 11. పరమేశ్వరుడు ఈ ప్రాంతానికి వస్తాడని తెలుసుకొని గగానది మొత్తంగా ఇక్కడి వచ్చేసింది పరమేశ్వరుని రాకకై........ ( అనే ఊహ )

  శ్రీగౌరీప్రియ! శంభో!
  వేగన్ మముబ్రోవవచ్చువిషయముగని యా
  భాగీరథీనదంబిట
  ప్రోగైవచ్చినదటంచు రూఢిగ జెపితిన్.

  రిప్లయితొలగించు
 12. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  గంగ నదం కాదు నది. నదమంటే తూర్పునుండి పడమటికి ప్రవహించేది.

  రిప్లయితొలగించు
 13. జలమున మునిగిన దేవుని
  దలచుచు నేదారి లేక తపియించుచు నీ
  జల విలయము నాపుము నిను
  గొలిచెద మంచు జనులెల్ల కోరిరి దేవా!

  రిప్లయితొలగించు
 14. బొడ్డు శంకరయ్య గారూ,
  బహుకాల దర్శనం!
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 15. శ్రీగురుభ్యోనమ:

  వరదై వచ్చిన జలమా
  స్థిరముగ భూతాపమెల్ల దీర్చుము తల్లీ!
  వరమై జీవుల పాలిట
  కురిపించుము నీదు కరుణ కుశలములిడుచున్.

  వేసవికాలపాగమన వేడుక జూచుచు వారి తోడ సా
  వాసము జేయగా మనసు వాంఛలనెన్నియొ చాటుచుండ నీ
  వాస మవశ్యమాయె, గుడివాకిటనైన వసించు బ్రీతితోన్
  దాసులమైతిమమ్మ ఘన దాహము దీర్చగ నీవె దిక్కనన్.

  రిప్లయితొలగించు
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ అభినందనలు.

  వరదా వరదా యనుచున్
  సరదాగా చెప్పినారు సత్కవివర్యా
  మురిపించెను మీ పద్యము
  మరిమరి చదువంగ నాదు మనసే కోరెన్.

  రిప్లయితొలగించు