8, అక్టోబర్ 2014, బుధవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 105


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
ఉ.        తా (క్షితి నిట్లు దుష్టులను దంచి తగం బురుషోత్తముండు శ్రీ
దక్షుఁ బరీ)తభూతి ఘనతాయుతు నింద్రుని దైత్యబాధ సం
ర(క్షితు సాఁకె; రాజుగను రాజితుఁ డయ్యె యుధిష్ఠిరుండు క్షే
మక్షణుఁడున్) విభీషణుఁడు మంగళుఁడై రఘురాము నానతిన్. (౧౨౦)

భారతము-
కం.       క్షితి నిట్లు దుష్టులను దం
చి తగం బురుషోత్తముండు శ్రీదక్షుఁ బరీ
క్షితు సాఁకె; రాజుగను రా
జితుఁ డయ్యె యుధిష్ఠిరుండు క్షేమక్షణుఁడున్. (౧౨౦)

టీక- పురుషోత్తముఁడు = (రా) రాముఁడు, (భా) కృష్ణుఁడు; పరీత = (రా) చుట్టుకొనబడిన; యుధిష్ఠిరుండు = (రా) యుద్ధమందు స్థిరమగువాఁడు; క్షణుఁడు = (రెంటికి) ఉత్సాహముగలవాఁడు; దంచి = నాశనము చేసి; భూతి = ఐశ్వర్యము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి