గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పాటల్ అర్చన’ అని విసంధిగా వ్రాశారు. ‘పాటల్/ గూర్చుచు కొలిచిన వనితలు...’ అందామా? పద్యం చివర ‘చెరువున దేలున్’ అంటే బాగుంటుందేమో?
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, బ్రతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని కనులకు కట్టినట్టు వర్ణించిన మీ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు.
బతుకమ్మను బూజింతురు
రిప్లయితొలగించండిబతుకమ్మయె తమకు దిక్కు భావన తోడన్
సతు లం దరుమూ కుమ్మడి
నతులన్గావించి పెట్టు నైవేద్యములన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
బతుకమ్మ :
01)
____________________________
పువ్వులను బేర్చి గుండ్రము
నవ్వులతో బూజ జేసి - నలుగురి తోడన్
నవ్వలు బాడుచు దిరుగుచు
దవ్వుల చెరువుల నిడెదరు - తానము సలుపన్ !
____________________________
అవ్వ = స్త్రీ
తానము = నిమజ్జనము
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పేర్చిన పూవుల బొత్తిని
రిప్లయితొలగించండితీర్చుచు బతుకమ్మరూపు తిరుగుచు పాటల్
అర్చన జేసిన వనితలు
చేర్చగ నవి నీటిలోన చెరువునకేగెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పాటల్ అర్చన’ అని విసంధిగా వ్రాశారు. ‘పాటల్/ గూర్చుచు కొలిచిన వనితలు...’ అందామా? పద్యం చివర ‘చెరువున దేలున్’ అంటే బాగుంటుందేమో?
మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపేర్చిన పూవుల బొత్తిని
తీర్చుచు బతుకమ్మరూపు తిరుగుచు పాటల్
గూర్చుచు కొలిచిన వనితలు
చేర్చగ నవి నీటిలోన చెరువున దేలున్.
వరుసగ పూవులు బేర్చుచు
రిప్లయితొలగించండిమురియుచు బతుకమ్మ జేసి ముదితలు గొలుచున్
వరముల నిమ్మని వేడుచు
చెరువులలో కలిపి వేసి చేడియ లాడున్
గునుగు తంగేడు పూలెన్నొ యినుమడించ
రిప్లయితొలగించండిగౌరి మాతను జేరిచి గౌరవమున
భర్త, పిల్లల సేమము బడయ గోరి
వనిత లెల్లరు బతుకమ్మ పండుగనుచు
సంబరంబుగఁ జేసెద రంబ పూజ
తాన మాడింత్రు చెరువులో తన్మయమున!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినా సూచనలను ఆమోదించినందుకు సంతోషం!
*
నాగరాజు రవీందర్ గారూ,
‘ఎగిలివారంగ’ (గ్రామ్యమైనా మాండలిక జాతీయంగా గ్రాహ్యమే), ఎనుగు, గునుగు, కట్లపూల ప్రస్తావనతో తెలంగాణా పల్లెల్లోని బతుకమ్మ పండగను సాక్షాత్కరింపజేశారు. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ముదితలు గొలువన్’ అనండి. ‘చెరువులలో విడుతు రపుడు చేడియ లెల్లన్’ అంటే బాగుంటుందేమో?
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
‘తంగేడు’ పూల ప్రస్తావనతో మీ పద్యం సొగసును సంతరించుకుంది. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
రంగు రంగుల పూలతో రాజితముగ
రిప్లయితొలగించండిభక్తితో బతుకమ్మల బలుతెరగుల
తీర్చి చక్కగ నొకచోట పేర్చి కొలచి
పాట పాడుచు బతుకమ్మ యాట లాడి
మడుగులోన జేసేరు నిమజ్జనంబు
మిత్రులందఱకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, నమస్కారములు!
రిప్లయితొలగించండి||సీ||
తంగేడు పూవులఁ దాంబాలమునఁ గుండ్ర
....ముగ నందముగఁ బేర్చి, మురువు సూపు
వివిధమ్ములగు రంగులవి గునుగులఁ బేర్చి,
....మందార, కట్ల, చేమంతుల నిడి,
బంతిపూవులు పోకబంతిపూవులు వింత
....సొబగుల నీనఁగాఁ జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ బండువు సేయంగ
....బ్రతుకమ్మ నడుమ గౌరమ్మనుంచి,
||గీ|
ధగధగలతోడి పట్టుపీతాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు పడతులంత!
||కం||
బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరిచివర నిక్కపు భక్త్యు
న్నతిఁ బాడి పాట, లాడియు,
నతులయి నీటను నిమజ్జనము సేతురయా!
||ఆ.వె.||
ముత్తయిదువు లపుడు పూతురు పసుపును
పుస్తెలకును గౌరి పూజసేసి!
సన్నిహితులు హితులు సఖులంత కష్టసు
ఖములఁ జెప్పికొనఁగఁ గలిసెద రట!
||తే.గీ.||
ఇంటినుండియుఁ దెచ్చిన హితకరమగు
తీపివస్తువులనుఁ బంచి, తినియు, మఱల
సద్దులను మూటగట్టియు సంబరమున
నిండ్లకుం జేరఁ బోదురా యింతులంత!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
బ్రతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని కనులకు కట్టినట్టు వర్ణించిన మీ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు.