3, అక్టోబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 695

కవిమిత్రులారా,
దసరా శుభాకాంక్షలు!

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:


 1. విజయ దశమిశుభాకాంక్షలు

  విజయ దశమి నాడు వేకువ ఝామున
  నిదుర లేచి శుచిగ నియమ నిరతి
  బూ జ సేయ నిచ్చు భువనేశ్వరి మాత
  సకల సంప ద లను సంతసమున

  రిప్లయితొలగించు
 2. గురువర్యులకు, పెద్దలకు కవిమిత్రులకు విజయదశమి హార్దిక శుభాకాంక్షలు
  రావణ దహనముతో నే
  కేవలము ముదమును గొనక కించిత్తైనన్
  పావన స్త్రీ మూర్తుల పై
  నేవిధముగనైన హింస నీగించవలెన్

  రిప్లయితొలగించు
 3. మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !

  అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  విజయ దశమి :

  01)
  _____________________________

  రావణుండు జావ - రాముని చేతిలో
  నిర్భయమును బొందె - నిఖిల జగతి !
  నాటి నుండి జనులు - నేటికిన్ దసరాగ(సరదాగ)
  దనుజు మరల గాల్చు - దశమి నాడు !
  _____________________________

  రిప్లయితొలగించు
 4. గురువర్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
  కవిమిత్రులకు, వీక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.

  చందస్సు ఫేస్ బుక్ గ్రూపునందు పరిచయం చేసిన క్రొత్త వృత్తములతో నేను వ్రాసిన దేవీ స్తుతులు.

  విజయ వృత్తము:

  జగాలవన్నియున్ - జనించెను నీకే
  జగంబులన్నియున్ - జపించును నిన్నే
  జపింతు శాంకరీ - జయమ్ములనీవే
  వరమ్ము లీయగా – పరాత్పరి నీవే

  భవాని వృత్తము:

  మాటగన నర్థమే - మధురగతిని - మసలినటుల
  ఘాటగు సు వాసనల్ - కలసి విరుల - కదలినటుల
  తేటగను పండ్లలో - తెలియ రుచులు - దిగిన యటుల
  వాటముగ దుర్గయే - భవుని గలసి - పరగు నిటుల

  సాగరతనయ వృత్తము:
  మనమున్ దలుతున్ మాహేశ్వరీ మా - మానస మునను దీపింప రావా
  అనయమ్ము హృదిన్ స్తోత్రింతు మాతా - యార్తిని మలప దీవింప రావా
  వినయమ్ముననే పూజింతు దేవీ - వేధించు నఘము ఖండించ రావా
  ఘన పూజలతో సేవింతు తల్లీ - కామిత సుధల నందీయ రావా

  రిప్లయితొలగించు
 5. రావణుఁ దునుమాడి రామచంద్రుడు కడు
  సంతసమును దెచ్చె జనపదముల
  దుష్ట శక్తి పైన శిష్టుల విజయమ్ము
  పండుగాయె దేశ ప్రజలకెల్ల

  రిప్లయితొలగించు
 6. గురుదేవులకు, కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు.

  పరసతులఁ బొంద నెంచిన
  శిరములఁ గూల్చెద రుదరముఁ జీల్చెద రనుచున్
  ధరణిని దెలియగ దసరా
  జరుపుచు రావణ దహనము సల్పెద రిటులన్!

  రిప్లయితొలగించు
 7. అసమా నంబగు శక్తి తో గదిలె దుర్గా దేవి రుద్రాణి యై,
  మిసిమిన్ గొల్పుచు సత్యభామ యును స్వామిన్ జేరి యుద్ధంబు లో
  అసిధారా వ్రతముల్ గదా ఇవి య నన్ యా రాక్ష సాంత మ్మునన్
  దసరా పండుగ దీప కాంతులను సంధానించే దీపా వళిన్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించు
 8. రావణా సురుడ య్యె డ రాము చేత
  హతము గాబడ ప్రజలంత హర్ష మొంది
  వాని బొమ్మను జిత్రించి వాడవాడ
  దగ్ధ బరతురు గ విజయ దశమి నాడు

  రిప్లయితొలగించు
 9. ఒక్క మారు కాక నొక్క టొ కటిగను
  దలలు పదియు కాల ధరణి జనులు
  ప్రమద మంది ,మనసు పరవళ్ళు ద్రొక్కగ
  నాడి పాడి రచట హాయి యనుచు .

  రిప్లయితొలగించు
 10. విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
  రోజంతా బంధువులతో పండుగ సంబరాల్లో మునిగి ఉండి మీ పద్యాలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.
  ఈనాటి చిత్రానికి మంచి మంచి పద్యాలను రచించి పంపిన కవిమిత్రులు.....
  సుబ్బారావు గారికి,
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, (విశేషవృత్తాలతో అలరింపజేశారు)
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు