పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కంఠధ్వని’ అన్నచోట గణదోషం. ‘ఆర్తకంఠఘోష నారాటపడు..’ అందామా? ‘ఆడిపోయు/ నల్ప...’ అనండి. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘వేళను’ అనండి. ‘లేదు + ఆర్తుని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘లేదె యార్తుని’ అందామా? * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు మనవి... ఈమధ్య కొందరి పద్యాలలో టైపు దోషాలు ఉంటున్నాయి. బహుశా వారు లేఖినిలో పైన బాక్సులో ఇంగ్లీషులో టైపు చేసి క్రింది బాక్సులోని తెలుగును పరిశీలించకుండా కాపీ - పేస్ట్ చేస్తుండవచ్చు. దయచేసి మీరు కాపీ చేసే ముందు ఒకసారి పరిశీలించవలసిందిగా మనవి.
ఆర్త రక్షణ మయ్యది యవస రంబు
రిప్లయితొలగించండిమహిని బుట్టిన బ్రతి యొక్క మాన వునకు
సాటి మనుజుని మనిషిగా సాకు నతడు
పుణ్య పురుషుల యందున గణ్యు డగును
తగిన వారి నెన్నుకొని
రిప్లయితొలగించండితమకు తామే ఆర్తరక్షకు లైనారు ప్రజలు !
దేశానికి దరిద్రం వదిలింది !
01)
________________________
ఆర్తకంఠధ్వని - నారాటపడు ప్రజ
నాదుకొనెడి వారి - నాడి పోయు
యల్ప బుద్ధివారి - కధికార మిడకుండ
నార్తరక్షణొందె - నఖిల జనులు !
________________________
ఆర్తకంఠధ్వని = ఏడుపు
సిరితో తూగెడు వేళని
రిప్లయితొలగించండిహరియైనను దలవలేదు యార్తుని గావన్
బరిమార్చె చక్రి మకరిని
కరివరదుండై శరణము కదిలించంగన్
ఆర్తునిఁ గావగఁ బొందిన
రిప్లయితొలగించండికీర్తిఁ గలిగినట్టి దేవ! కృష్ణా! యీ లో
కార్తినిఁ గనుమా, కావగ
స్ఫూర్తిని రమ్మా! యణచగ శోకాగ్నులనున్.
తండ్రిని వధియించి తనయుని గాచిన
రిప్లయితొలగించండి...........యా మహా విష్ణువు దార్త రక్ష
మకరిని ఖండించి మత్తేభమును గాచి
..........నట్టిది శ్రీహరి యార్త రక్ష
మానము రక్షించి మానిని గాచిన
..........యట్టిది మాధవు నార్త రక్ష
గోవర్ధనము నెత్తి గోపకాళిని గాచి
..........నట్టిది గోవిందు నార్త రక్ష
అన్యమెరుగక మదిలోన ననవరతము
నన్ను స్మరియించు వారి ననన్య కరుణ
నేలు కొందును నిజమని యింపు మీర
పలుకు దేవుని ప్రార్థింతు పరమ భక్తి.
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కంఠధ్వని’ అన్నచోట గణదోషం. ‘ఆర్తకంఠఘోష నారాటపడు..’ అందామా? ‘ఆడిపోయు/ నల్ప...’ అనండి.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వేళను’ అనండి. ‘లేదు + ఆర్తుని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘లేదె యార్తుని’ అందామా?
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
శరణుఁ గోరినట్టి శత్రువునైనను
రిప్లయితొలగించండిసాకునట్టి మేటి జాతిమనది
యార్త రక్షణమ్ము నాచారముగఁ జేసి
విశదపరచె పూర్వ వేదములును
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిసిరితో తూగెడు వేళను
హరియైనను దలవలేదె! యార్తుని గావన్
బరిమార్చె చక్రి మకరిని
కరివరదుండై, శరణము కదిలించంగన్
ఆర్త రక్షణంబు కర్తవ్యముగనెంచి
రిప్లయితొలగించండిప్రతిన బూనవలెను పౌరులెల్ల
సాటి ప్ రాణులకును సాయపడుటకన్న
మానవునికి మోక్ష మార్గమేది
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆపద గొని చెంత కరుదెంచి వచ్చిన
రిప్లయితొలగించండివారి నాదు కొన్న మానవులను
దైవసములుగాను తలచుచుందురు కాన
ఆర్త రక్షణమ్ము కీర్తి దెచ్చు!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపద్యరచన:ఆర్త రక్షణ
అడవిలో నిండు గర్భిణీ హరిణి యొకటి
ప్రసవ వేదన పడుచుండె.వర్ష పాత
మవగ నతి కష్టమున లేవ, వ్యాధు డొకడు
కంట బడెను శరమును వింట దాల్చి
వెనుకదూరాన కనుపించె వె౦బడి౦ప
చిరుత యొక్కటి.ప్రక్కల నరసి జూడ
లోయ యొక వైపు,భీతి గొల్పుచునదియును
గానుపించెను నేదారి గానరామి
నేమిసేతును దైవమా నీవె దిక్క
టంచు కన్నులు మూసి ప్రార్థించె లేడి
అంతలో మెరసె నత్యంత వింత కాంతి
పిడుగు పాటాయె తోడ్తోడ వెడగు పడగ
గురిని తప్పిన శరమున చిరుత జచ్చె
పరుగు తీసెను వ్యాధుడు భయముజె౦ది
ప్రసవమాయెను హరిణికి బాధ మరచి
ప్రేమ మీరగ పసికూన వీపు నాకె
ఆర్తరక్షణ సేయంగ హరి యమరగ
మూగజేవుల యాపదల్ మొక్కవోవు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ ఖండిక బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో "శరమును" అన్నచోట గణదోషం. "శరమ్మును" అనండి.
పదకొండవ పాదంలో "అంతలో' అన్నచోట గణదోషం. `అంతట" అనండి.
కవిమిత్రులకు మనవి...
రిప్లయితొలగించండిఈమధ్య కొందరి పద్యాలలో టైపు దోషాలు ఉంటున్నాయి. బహుశా వారు లేఖినిలో పైన బాక్సులో ఇంగ్లీషులో టైపు చేసి క్రింది బాక్సులోని తెలుగును పరిశీలించకుండా కాపీ - పేస్ట్ చేస్తుండవచ్చు. దయచేసి మీరు కాపీ చేసే ముందు ఒకసారి పరిశీలించవలసిందిగా మనవి.