12, అక్టోబర్ 2014, ఆదివారం

పద్యరచన - 704

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

 1. హనుమంతుని గుడియందున
  వనౌకసము కూర్చొని తన వాలము పరచెన్
  తినసాగె బ్రసాదంబుల
  తనదీ యాయాంజనేయ తత్త్వంబగుగా

  రిప్లయితొలగించండి
 2. ఆలయంబున జూడగ నాంజ నేయు
  డాతని యెదుట బుధ్ధిగ హనుమ యుండె
  నాహ !యే మది! ప్రత్యక్ష మాయె సామి
  వంద నంబులు సేతును వంద లాది

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  అంజనాదేవి కొమరుడే - యగునొ ?

  01)
  _____________________________

  అర్చకార్పణనైవేద్య - మచట గాంచి
  అడవిగీమది యరచేత - నందుకొనెను
  అక్కజంబిది హనుమ దే - వాలయమున
  అంజనాదేవి కొమరుడే - యగునొ? యేమొ?
  _____________________________

  రిప్లయితొలగించండి
 4. రాక్సాలిడ్ వానికిమీ
  రాక్సాలిడ్ లడ్డునిస్తి రదియయెనాకే
  థాంక్సో మైప్రెడిసిసరూ
  థాంక్సాల్సోమీమనుషుల థాట్ఫుల్నెస్ కున్

  రిప్లయితొలగించండి
 5. ఏ మిది కదళీ ఫలమా!
  'గ్రోమోరులు' వాడిదీని గుణమే మారెన్!
  రామా! లడ్డున కల్తీ!
  మామూలుగ లేదు 'ధర'ని మారుతి వగచెన్!

  రిప్లయితొలగించండి
 6. ఆంజనేయుని గుడిలోన నార్థితోడ
  పూజఁ జేయుచు నాకోతి పూన్కి తోడ
  పంచు కొనుచుండె పూజారి బాధ్యతలను
  గతజనన పాపములనన్ని కడుగు కొనగ

  రిప్లయితొలగించండి
 7. సీతాన్వేషణతత్పరుండయి మహాక్షీణప్రతాపంబుతో
  నేతద్విశ్వమునన్ జరించి యట లంకేశాధి కాంతారమం
  దేతన్మాత్రగనున్న భూజఁ గని యా వృక్షంబుపై నెక్కి మీ
  చేతల్ మాటలచేతమోదమిడితే శ్రీమత్ హనూమత్ప్రభూ.

  మహా + అక్షీణ = మహాక్షీణ
  కాంతారము = వనము

  రిప్లయితొలగించండి
 8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీనివాస భరద్వాజ కిరణ్ గారూ,
  ఆంగ్లపద్యబాహుళ్యంతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమారశాస్త్రి గారు,
  మీ పద్యం బాగుంది.

  ఎల్లర ప్రీతి పాత్రముగ నీభువి యందున రామదాసు, తా
  పిల్లలకెల్ల వేడుకగ వింతగు చేష్టలఁ జూపుచుండు, నే
  డుల్లములుల్లసిల్లగ కటుంకటుమంచును నోటబెట్టె తా
  మెల్లగ నాలయమ్ముఁ జని మెక్కె ప్రసాదము, జీడిపప్పులున్.

  రిప్లయితొలగించండి
 10. తినుమాయనుచును బెడితివి
  పెనుమాయను తలచబోక ప్రియనైవేద్య
  మ్మనుమానము జెందకుమా
  హనుమానుడె వచ్చినాడు హాయిగ తినగా.

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ఇప్పటి దాకా మ్రొక్కిరి
  చప్పున ప్రత్యక్షమైన సాగిల పడరే?
  చెప్పక తప్పదు యిటనే
  యప్పని రూపముగనంగ నందరి తరమే?

  రిప్లయితొలగించండి
 13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘తప్పదు + ఇటనే’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. కావున అక్కడ ‘తప్ప దిచటనే’ అనండి.

  రిప్లయితొలగించండి
 14. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  ఇప్పటి దాకా మ్రొక్కిరి
  చప్పున ప్రత్యక్షమైన సాగిల పడరే?
  చెప్పక తప్పదు సత్యము
  యప్పని రూపముగనంగ నందరి తరమే?

  రిప్లయితొలగించండి
 15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  సవరించిన పద్యంలోనూ ‘సత్యము + అప్పని’ అన్నప్పుడు యడాగమం రాదు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీగురుభ్యోనమ:

  మారుతాత్మజు గొల్వగ మర్కటంబు
  తరలి వచ్చెను తపనతో తరువు వీడి
  ఫల నివేదన జేసెను, భక్తితోన
  పొందె నాప్రసాదంబుల,నందుకొనుచు

  రిప్లయితొలగించండి
 17. శ్రీమతి లక్ష్మిదేవిగారికి వందనములు.

  పద్యాన్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  ఇప్పటి దాకా మ్రొక్కిరి
  చప్పున ప్రత్యక్షమైన సాగిల పడరే?
  చెప్పక తప్పని యొప్పిది
  యప్పని రూపముగనంగ నందరి తరమే?

  రిప్లయితొలగించండి