27, అక్టోబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం – 1539 (దీప మ్మార్పఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.
(ఆకాశవాణి వారి సమస్య)

35 కామెంట్‌లు:

  1. లోపంబేమో వెలగదు
    దీపము విద్యుత్తు లేక, ధీటుగ చార్జింగ్
    దీపమును నిలుపుచు చమురు
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్!!

    రిప్లయితొలగించండి
  2. లోపల యంతయు చీకటె
    దీ పమ్మా ర్పగ గృహమున, దేజమ్మొ సగెన్
    పాపములు జేయ నరకుడు
    ఆ పాపిని సత్యభామ హత మొన రించెన్

    రిప్లయితొలగించండి
  3. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యం ద్వితీయార్ధంలో అన్వయదోషం ఉంది.

    రిప్లయితొలగించండి
  4. ఆ పగటి కాంతి బీలిచి
    లేపనమున రాత్రి వెలుగు లెస్సగు బొమ్మల్
    చూపుటకు మధ్య పేరిచి
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రేడియం బొమ్మల పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మాస్టారూ! సందేహం. దీపమ్మున్ + ఆర్పగ = దీపమ్మునార్పగ అవ్వాలి కదా

    రిప్లయితొలగించండి
  7. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    దోషం లేదు. దీపమ్మార్పగ, దీపమ్మునార్పగ రెండూ సాధువులే.
    ‘అప్పిచ్చువాడు వైద్యుడు...’ పద్యంలో అప్పునిచ్చువాడు అనవలసి ఉంటుంది కదా..
    ముద్దిచ్చెను- ముద్దు నిచ్చెను, సాయమడిగె- సాయము నడిగె... ఇలా... (ద్వితీయార్థంలో ప్రథమ. ఇలా ఒక విభక్తి అర్థంలో మరొక విభక్తిని వాడే సంప్రదాయం తెలుగులో ఉంది కదా!)

    రిప్లయితొలగించండి
  8. రూపంబులు గనిపించవు
    దీపమ్మార్పగ ; గృహమున తేజమ్మొ సగెన్
    పాపపు చింతల నొదిలిన
    దీపించును మనసులోని దేవగుణమ్మే!!!

    రిప్లయితొలగించండి
  9. మాపున తలుపులు మరి కిటి
    కీ పలకలు మూసి నిద్ర కృత్యము ముగియన్
    నే పొద్దున తలుపు తెరిసి
    దీపమ్మార్పగ గృహమున తేజమ్మెసగెన్

    రిప్లయితొలగించండి
  10. కూపెట్టెను పసి బిడ్డడు
    దీప మ్మార్పగ గృహమున, దేజమ్మెసగెన్
    పాపని ముద్దుల మోమున
    చూపగ చందురుని యొక్క సొంపగు రూపున్

    రిప్లయితొలగించండి
  11. శాపాయుతులై రాక్షస
    రూపముతోగోకులమున రొదసేయంగా
    గోపాలుఁడంత దితికుల
    దీపమునార్పఁగగృహమునఁదేజమ్మెసఁగెన్.

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు
    గోపాలు౦డుయుసత్యయు
    భూపాలుర సుతల జంప బూనిన,ననిలో
    పాపియగు నరకు ప్రాణపు
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్!!

    రిప్లయితొలగించండి
  13. కె ఈశ్వరప్ప గారిపూరణ
    దీపమ్మిడ కార్తికమున
    కొప౦బున గాలి వచ్చి కొండెక్కి౦చన్
    లోపల విద్యుత్ వెలుగుల
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్!!

    2.పాపుడు నరకుడు చావగ
    దీపావళి పండుగందు దీపము లిడగా
    పాపొక్కటి పడవేయగ
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్!

    రిప్లయితొలగించండి
  14. లోపలి దీపము వెల్గిన
    తాపములై దోచె సుతులు దారయు ధనమున్
    చూపుల కింటను లోగల
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

    రిప్లయితొలగించండి
  15. కె.యెస్, గురుమూర్తి ఆచారి గారి పూరణ
    వాపోయితి మును పెంతో
    యేపొక యింతయును లేక, నీనాటికి నా
    లోపల నెగయు దురాశా
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్!!

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
    ఆపరమేశుని కరుణను
    ప్రాపంచిక విలువ లన్ని పారగ ద్రోలన్
    పాపపు కోర్కెల మిలమిల
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్!!

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చింతల వదలిన’ అనండి.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తెరచి’ అనండి.
    *
    అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘గోపాలుండును’ అనండి.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పండుగ + అందు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘పండుగ యని’ అనండి. అలాగే ‘పాప యొకటి’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘యేపొక యిసుమంత లేక...’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. లోపల యంతయు చీకటె
    దీ పమ్మా ర్పగ గృహమున, దేజమ్మొ సగెన్
    పాపా త్ము న్నరకుని పెను
    గో పముతో సత్యభామ కూ ల్చెను బుడమిన్

    రిప్లయితొలగించండి
  19. కోపము తానందె ప్రకృతి
    తాపానను రెచ్చిపోయి, తాప్రజ నేచున్
    తా,పర మందున శాంతిడు
    దీపమ్మార్పగ గృహమున తేజమ్మెసగున్

    ఆ పాపి నరకు నంతము
    దీపింపగఁ జేసెజగతి, తీరగ భయమే
    కోపించి సత్యయాతని
    దీపమ్మార్పగ, గృహమున తేజమ్మెసగున్

    పాపపు చయమది తొలగును
    రేపున పాలిడగ పాప ఱేనికి భక్తిన్
    కోపము తగ్గియు మణులను
    దీపమ్మార్పగ గృహమున, తేజమ్మెసగున్

    తాపాన రాహువర్కుని
    దీపమ్మార్పగ, గృహమున తేజమ్మెసగున్
    తాపొంది కాంతి మరలను
    దీపించును నాకసమున, దినములనెంతో

    శాపంబునిచ్చె గణపతి
    దీపంబునటుల వెలిగెడి ధీపతి చంద్రున్
    కోపంబు తగ్గి తదుపరి
    దీపమ్మార్పగ గృహమున, తేజమ్మెసగున్

    పాపపు, పుణ్యపు ఫలితము
    దీపించును లేక నణచు. తేరియు మరలన్
    రూపించు కాల చక్రము
    దీపమ్మార్పగ, గృహమున తేజమ్మెసగున్

    దీపము వెట్టగ నుదయము
    పాపాలనుఁ దీర్చితాను, భక్తుల జాలిన్
    కోపించ కుండ దైవము
    దీపమ్మార్పగ గృహమున, తేజమ్మెసగున్

    కోపము చెందకు నాగుడ
    మాపయి! మేమిటు దొసగుల మానకఁ జేయన్,
    ఓ పాప ఱేడ! పప్పపు
    దీపమ్మార్పగ, గృహమున తేజమ్మెసగున్

    తాపంబున గురు పుత్రుడు
    తాపాండవ సంతునెల్ల ధర్మము కాకన్
    కోపానఁ జంప, కృష్ణుడు
    దీపమ్మార్పగ గృహమున, తేజమ్మెసగున్

    రూపము నందున లక్ష్మిగ
    పాపపు యోచన మనసున వరలని భార్యే
    చూపుల కంతులు చిందగ
    దీపమ్మార్పగ, గృహమున తేజమ్మెసగున్

    రిప్లయితొలగించండి
  20. సుబ్బారావు గారూ,
    మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పది పూరణలు బాగున్నవి. అభినందనలు.
    నాకు ఒక్క పూరణ వ్రాయడమే గగనమై పోతున్నది. మీరు ఒక్కొక్క సమస్యకు బహుళసంఖ్యలో పద్యాలు వ్రాస్తున్నారంటే ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తున్నాయి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. బాపురె! వెలిగే చొక్కా
    సూపర్గా నుండు ననుచు చుట్టాల్ తేవన్
    మాపున ధరించి చూడగ
    దీపమ్మార్పఁగ గృహమునఁ దేజమ్మొసగెన్!

    రిప్లయితొలగించండి
  22. నిన్నటి నిసిద్ధాక్షరి:
    రావణాసుర సంహార రభస ముగియ
    భక్త భరతుడు పాదుకల్ ప్రక్కఁ బెట్టి
    లచ్చి సీతమ్మ శత్రుఘ్న లక్ష్మణులట
    శమము నొందగ పట్టమ్ము ప్రమద మొసఁగె

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    పాపియు మాఱఁగ నెంచియు
    లోప సహిత హృదయ గృహములోఁ గ్రుచ్చిన విల్
    తూపగు దుశ్చింతాహృ
    ద్దీప మ్మార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్!

    రిప్లయితొలగించండి
  24. ఓపాప! చీకటాయెను
    దీపమ్మార్పగ గృహమున, తేజమ్మెసగెన్
    దీపము వెలిగించగనే
    దీపమె మన బ్రతుకు నావ దిక్చూచి సుమా !

    రిప్లయితొలగించండి
  25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. (నిన్నటి పూరణతో కూడా...) అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నరకుని దీపమాగిన వెంటనే - దీపావళి వెలుగులు :

    01)
    ______________________________

    గోపాలకుడౌ కృష్ణుడు
    కోపోద్రేకమున నరిని - ఘోరము నేయన్
    పాపాత్ముండగు నరకుని
    దీప మ్మార్పఁగ గృహమునఁ - దేజ మ్మెసఁగెన్ !
    ______________________________
    అరి = చక్రాయుధము

    రిప్లయితొలగించండి
  27. పాపకు పుట్టిన దినమని
    దీపపు హారతులనిచ్చితెలిపిరి శుభముల్
    మాపటి వేళకు కొవ్వుల
    దీప మ్మార్ప (గ గృహమున (దేజమ్మేసగెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  28. రేపటి వెలుగులఁ దెచ్చుచు
    పాపడు నింగిని యలదెడు బంగరు వెల్గుల్
    దోపగ నేలొకొ యిది యని
    దీపమ్మార్పఁగ గృహమునఁ దేజమ్మెసఁగెన్.

    రిప్లయితొలగించండి
  29. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. పాపము పాపారాయుడు
    తాపముతో తనువు వీడి తన్మయమొందన్
    కాపల శవజాగరణపు
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్ :)

    రిప్లయితొలగించండి


  31. చైనా వాడి సోలార్పవరు :)


    మా పాలిటివర మాయెన్
    దీపమ్మార్పఁగ గృహమునఁ దేజమ్మెసఁగెన్,
    బో! బాటరి సోలార్పవ
    రై బాగుగ కాంతినొసగె రయ్యన నయ్యా !

    ಜ಼ಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
  32. తహతహ లాడుచు మోడీ
    గృహమున జొచ్చుచు మహిళది ఘీంకారముతో
    బహుజన సమాజ పార్టీ
    దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్

    రిప్లయితొలగించండి