‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, _/\_ * శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ట్రిక్కు’ టైపాటు వల్ల ‘టిరక్కు’ అయింది. * వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘గణిత్ర’ మన్నపదం లేదనుకుంటాను. అక్కడ ‘మక్కువగ గణనయంత్రం/ బిక్కాలపు...’ అందామా? * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * జిలేబీ గారూ, _/\_ * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. ‘ములుకోలును బట్టు రైతు...’ అంటే సరి! * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ శార్దూలం బాగున్నది. అభినందనలు. ‘ఊహల్ కందని వాస్తవమ్ము’ను ‘ఊహాతీతపు వాస్తవమ్ము’ అనండి. అలాగే ‘పీల్చుచో/ నాహా’ అనండి. * శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
నమస్కారం శంకరయ్యగారు. మరెందుకో తెలియదుగానీ, నా కంప్యూటరులో చూసినప్పుడు trick సరిగ్గానే కనబడుతూంది. నా iPhone లో కూడా చూసాను - సరిగ్గానే వుంది. దీనిమీద ఇంకొంచెం రీసర్చి చేస్తాను.
మాస్టారూ, సూపర్ ఫోటో పట్టారుగా! ఆ ముసలాడిలో నన్ను నేను చూసుకోనేంతగా ఇమిడిపోయాను. ఇక పద్యం వ్రాయలేను.
రిప్లయితొలగించండిహుక్కా తాగిన తాతకు
రిప్లయితొలగించండికిక్కే రాలేదటందుకేమోవేరే
టి్రక్కునువెదికెదనని ఫేస్
బుక్కులొనడుగంగనోటుబుక్కునుతీసెన్
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
నేటిరైతు :
01)
__________________________________
హుక్కా బీల్చుచు శ్రద్ధగ
నొక్కుచునున్నాడు రైతు - నూతన విధిగా
మక్కువ గణిత్ర యంత్రము
నిక్కాలపు వర్ష పాత - మెంతో యెరుగన్ !
__________________________________
హుక్కా = పొగ త్రాగు సాధనము.
విధిగా = తప్పనిసరిగా, అవశ్యముగా
గణిత్ర యంత్రము = కంప్యూటర్
ఇక్కాలము = ఈ పొద్దు (నేడు)
పట్టి మంచము మీదను బదిలముగను
రిప్లయితొలగించండితాత కూర్చుండి యచ్చట దడుము కొనుచు
నొక్కు చుండెను లే ప్టా పు నుమఱి చూడు
డార్య !చిత్రము గదయది యా వ యసున
సెలవులు పరిశ్రమలకటు
రిప్లయితొలగించండిసెలవులు సేద్యమున కింక శివ శివ యనుచున్,
సెలవది తెలియగ వచ్చెను
కలియుగ "కం ప్యూ ట" రందు కమ్మని పొగతో
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
'హవా'కిక్కు న మై మరిచి
రిప్లయితొలగించండిలాగించు దమ్మను హుక్కా
'లయపు' టాపు టెక్కున
సాగించు జమ్మను వ్యాఖ్యా !!
చీర్స్
జిలేబి
తలపాగఁ జుట్టి కరమున
రిప్లయితొలగించండిములకోలు నిడెడు రైతు పొలమును వీడెన్
వలఁ బొగ పీల్చుచు వెదుకన్
కలగా మిగలదె గతంబు! గతుకుట కెట్లో?
(వల = అంతర్జాలం)
మిక్కిలి హితుడగు తాతకు
రిప్లయితొలగించండిమక్కువతోలాపుటాపు మనుమడు పంపన్
హుక్కా పీల్చుచు ముదమున
చక్కగ వార్తలను తాత చదువుచు నుండెన్
ఆహా! చిత్రమె నేడు చూడనిది! కాదా మిత్రమా ? యొక్క నా
రిప్లయితొలగించండిడూహల్ కందని వాస్తవమ్ము! మడిలో హుక్కాను తా బీల్చుచో
ఆహా యంచును ల్యాపుటాపు దెస తానై హాయిగా నొక్క రై-
తోహో! సస్య సమగ్ర సూచనల నెంతో నేర్పుగా చూచుటల్!
సంతసముగ పొగ త్రాగుచు
రిప్లయితొలగించండినంతర్జాలమును తాత నారంభించెన్!
నెంతటి వారల కైనను
చింతన కలిగించు నిదియె చిత్రము గాదే!
మిస్సన్నగారూ నమస్సులు. తాతగారిపై మీరు వదలిన శార్దూలము "ఆహా!చిత్రమె"! అద్భుతముగా నున్నది.
రిప్లయితొలగించండిపిల్లలు పెద్దవారు నవ విద్యల నేర్చిన భారతమ్మిదే!
రిప్లయితొలగించండి' యెల్లరకిట్లు దారినిట నేర్పరచెన్ భళి రా' యటంచనన్
చల్లని బుద్ధితో పొరుగు చక్కగనుండగ గోరుకున్నదై
నల్ల యుపగ్రహమ్ములవి యందరకందగఁ జేతునంచనెన్.
తాతలనుచు, వీరికి నిది
రిప్లయితొలగించండియా తెలియునటంచు తలువ నచ్చెరువగురా!
ప్రాతది యగు పొగ గొట్టము
చేతనుఁ బట్టియును క్రొత్త చేతల నేర్చెన్.
ఎన్నికలో వాగ్దానమె
రిప్లయితొలగించండినెన్న కలో నిజమనగ నిటిచ్చెను లాప్ టాప్
మన్నిక జూడగ తాతయె
దన్నుగ పొగ బీల్చి పైన తట్టెను ' ఠాప్ ఠాప్ '
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండి_/\_
*
శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ట్రిక్కు’ టైపాటు వల్ల ‘టిరక్కు’ అయింది.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘గణిత్ర’ మన్నపదం లేదనుకుంటాను. అక్కడ ‘మక్కువగ గణనయంత్రం/ బిక్కాలపు...’ అందామా?
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
_/\_
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘ములుకోలును బట్టు రైతు...’ అంటే సరి!
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ శార్దూలం బాగున్నది. అభినందనలు.
‘ఊహల్ కందని వాస్తవమ్ము’ను ‘ఊహాతీతపు వాస్తవమ్ము’ అనండి. అలాగే ‘పీల్చుచో/ నాహా’ అనండి.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
దీర్ఘాలోచన తత్పరుండయి సముద్రేకప్రతీకాత్ముడై
రిప్లయితొలగించండినిర్ఘాంతంబును జెందె నేడు జలసాన్నిధ్యంబులున్ గానకిం
కర్ఘంబేమియురాదు నీ పొలములోనంచున్ నిరాశాప్తుడై
దీర్ఘాపోశనజేసె చుట్టనికచింతే శూన్యమైపోవగాన్
నమస్కారం శంకరయ్యగారు. మరెందుకో తెలియదుగానీ, నా కంప్యూటరులో చూసినప్పుడు trick సరిగ్గానే కనబడుతూంది. నా iPhone లో కూడా చూసాను - సరిగ్గానే వుంది. దీనిమీద ఇంకొంచెం రీసర్చి చేస్తాను.
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిదుష్కరప్రాస యైన ‘ర్ఘ’తో చక్కని పద్యం వ్రాశారు. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండితలపాగఁ జుట్టి కరమున
ములుకోలును బట్టు రైతు పొలమును వీడెన్!
వలఁ బొగ పీల్చుచు వెదుకన్
కలగా మిగలదె గతంబు! గతుకుట కెట్లో?
(వల = అంతర్జాలం)
ల్యాపు టాపు వంక నాశగ జూచుచు
రిప్లయితొలగించండిహుక్క త్రాగు చుండె బక్క రైతు
అమెరికాన యున్న యబ్బాయి ,యమ్మాయి
స్కైపు లోన జేయు కాలు కొరకు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురువుగారూ మీ సూచనలకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యం:
ఆహా! చిత్రమె నేడు చూడనిది! కాదా మిత్రమా ? యొక్క నా
డూహాతీతపు వాస్తవమ్ము! మడిలో హుక్కాను తా బీల్చుచో
నాహా యంచును ల్యాపుటాపు దెస తానై హాయిగా నొక్క రై-
తోహో! సస్య సమగ్ర సూచనల నెంతో నేర్పుగా చూచుటల్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఅవును ! నాకూ ఆ సందేహం వచ్చింది ! కాని
ఆంధ్రభారతిలో అటులనే యున్నది !
బహుశా అచ్చు తప్పు కానోపు !
*****
కంప్యూటర్ : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
ఇంగ్లీషు విశేష్యము (Computer)
గణిత్ర యంత్రము.
శ్రీపతి శాస్త్రి గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి