7, అక్టోబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1529 (వేదము లేడని గణించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్.
(ఈ సమస్యను సూచించిన ‘పరాక్రి’ గారికి ధన్యవాదాలు)

30 కామెంట్‌లు:

  1. వేదము వారిని మరియు ద్వి
    వేదుల వారిని కలుపుచు వీరికిని చతు
    ర్వేదుల వారిని గలిపిన
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్!!

    రిప్లయితొలగించండి
  2. నాదమయమమే గద యీ
    వేదము , లేదని గణించె విజ్ఞుం డు సభ
    న్నా దరు వనునది జగమున
    వేదములే మూ లమార్య !విజ్ఞు ల కెల్లన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    జీవనసమరం జేయలేక :

    01)
    ________________________________

    బాధామయమౌ జీవిత
    సాధన సరిజేయలేక - సన్యాసయ్యెన్ !
    వేదన హెచ్చగ నలుకను
    వేదము లేడని గణించె - విజ్ఞుండు సభన్ !
    ________________________________
    వేదము = బ్రహ్మము

    రిప్లయితొలగించండి
  4. జిగురు సత్యనారాయణ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ‘వేదములు ఏడు’ అని సమస్య ఉంటే మీరు ‘వేదము లేదు’ అని పూరించారు. సవరించండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సన్యాసి + అయ్యెన్’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘సన్యాసి యయెన్’ అనండి.

    రిప్లయితొలగించండి

  5. రయ్యన ఋక్ యవన యజుర్
    సరస సామ , ఆధార అథర్వ
    జప రామ,భగ భారత,తేనియ గీత
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్ !!

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    వేదమె గీతా శాస్త్రము
    వేదమె ఘనభారతమ్ము వేదమె జూడన్
    పేదల పాలిటి వైద్యము
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్.

    రిప్లయితొలగించండి
  7. వాదన జేయుచు నొకడనె
    వేదము లేడని, గణించె విజ్ఞుండు సభన్
    వేదములు నాల్గని తెలిపి
    బోధించెను పండితుండు పోడిమి తోడన్!

    రిప్లయితొలగించండి
  8. బోధల నెయ్యవి తెలియవు
    వేదము; లేడని గణించె విజ్ఞుండు సభన్
    చదలను సప్తర్షులనే,
    మదికింపుగ తెలిసికొనుడు మర్మంబనుచున్.

    రిప్లయితొలగించండి
  9. జిలేబీ గారూ,
    నమస్కారం!
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    గీతావేదం, పంచమవేదమైన భారతం, ఆయుర్వేదాలను కలిపి ఏడు వేదాలన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ద్వితీయార్ధంలో విజ్ఞుడు, పండితుడు రెండు కర్తృపదాలు వచ్చాయి. ‘పండితుండు’ అన్నదాన్ని ‘పామరులకు’ అంటే ఎలా ఉంటుంది?
    *
    రెండుచింతలా రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    సప్తర్షులు అన్నప్పుడు ఏడుగురు అనవలసింది కదా... అక్కడ ‘చదల ఋషుల సంఖ్యను మీ/ మదికింపుగ...’ అందామా?

    రిప్లయితొలగించండి
  10. నాగరాజు రవీందర్ గారూ,
    మీ లెక్క సరిపోయింది. పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  11. పూజ్య గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
    1 .ఆదిత్యునిగుర్రములున్,
    యీధరతో కలిపి జగములేడును స్వరముల్,
    సాదువులేడే యవగను
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్!
    2. వేదము లనంత మవగా
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్!!
    వాదించగ మనకేటికి
    సాదముతిని పోదమనిరి సభికులు తాల్మిన్







    రిప్లయితొలగించండి
  12. కె.యెస్. గురుమూర్తి ఆచారి గారి పూరణ
    వేదములు నాలుగైనను
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్
    యాధవళా౦గుని వదనం
    బాధాత ముఖ౦బు విష్ణునాస్యము కలిపెన్

    రిప్లయితొలగించండి
  13. వేదము లెన్నగ నాలుగె!
    కాదా ? యీ రీతి మీరు గట్టిగ నాతో
    వాదింతురు గద తక్కిన
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్.

    (యేడ = యెక్కడ)

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు గురువు గారూ. సవరించిన పూరణ

    వాదన జేయుచు నొకడనె
    వేదము లేడని, గణించు విజ్ఞుండు సభన్
    వేదములు నాల్గని తెలిపి
    బోధించె పామరులకు పోడిమి తోడన్!

    రిప్లయితొలగించండి
  15. మల్లెల వారి పూరణలు

    వేదము నంగము లారును
    బాధల తొలగించ జగతి, వాటిని నేర్వన్
    పోదొలగు, వాని, కలుపగ
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    వేదము, నుపనిషదులు, వే
    గాధలు నితిహాసములను, కావ్యములెలమిన్
    నాదపు స్వరముల వెలుగును
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    వేదము లనంత మరయగ
    భేదపు గణనను విషయపు పేర్మిని నగుగా
    వేదపు సంఖ్యయె. కనుకన్
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    బాధల జీవన మందున
    వేదిగఁ జేసియు, పలుగతి వెడలగఁ జేసే
    భేదములే, వివిధ గతులు.
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    భూధవు లెల్లరు, జనులల
    వేదము తెలిపిన విషయము పెంచగఁ జూడన్
    ఒదవెడు పుణ్యము నొకయెడ
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    వేదములను నాలుగు గను
    వేదవ్యాసుండు తెలిపె. వేదములెన్నో
    పొదలెను విద్యలునౌచున్
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    వేదము నాయువుఁ గూర్చును.
    వేదము ధనువునుఁ గొనివిడు వివిధపు నస్త్రాల్
    వేదిగఁ జేయును, నిటులా
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    వేదము జీవన గతిలో
    భేదముఁ జూపును. వివిధపు విషయాలందున్
    సాధనఁ జేసియు, వానిన్
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    వేదము నాత్మను, శరీర
    శోధన, భూమిని, గ్రహముల సొంపగు రీతుల్
    ఈధర భూతాల తెలుపు
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    రిప్లయితొలగించండి
  16. .కె,ఈశ్వరప్ప గారిపూరణ
    సాధకు నెంచగ గురువనె
    సాధించగ సప్తనిధులు స,రి,గ,మ,ప,డ,నీ,
    నాదమునొక్కొక్కటిగా
    వేదము లేడని గణించె - విజ్ఞుండు సభన్

    రిప్లయితొలగించండి
  17. వేదములు నాల్గు కాదని
    యీ ధరలో బల్కు పల్కు లెకసెక్కెములే!
    శోధనల దొరకనివి యే
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్?

    రిప్లయితొలగించండి
  18. వేదము దల్లియు దండ్రియు
    వేదము భావింప గురువు విశ్వము నందున్ ,
    వేదములు నాల్గు గలుపుచు
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  19. అందరికి నమస్కారములు
    ప్రాసలో "ధ "ఒక్క పాదం లో వేసుకోవచ్చని విన్నాను ప్రాస నియమం తెలుప ప్రార్ధన
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  20. ఆదినఁజెప్పిరి నాలుగు
    వేదములన్ గూర్చి మునులు పిదపను బుధులా
    మోదించగ మూడింటిని
    వేదములేడని గణించె విజ్ఞుండు సభన్

    రిప్లయితొలగించండి
  21. ఒత్తు "ధ" ఒకే పాదం లో వేసుకోవాలి
    మిగతా పదాలలో "ద " వేసుకోవాలి
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  22. వేదముల సంఖ్య గణనన
    వాదములే వినగబడి యె బండితు లందున్
    వాదముల గార వంబున
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్కారములు!

    (వేదము వేంకటరాయశాస్త్రిగారిని "వ్యావహారికభాషావాది"యనిన నొకనితో నొక విజ్ఞుఁడు వాదించిన సందర్భము)

    "వేదము గ్రాంథిక భాషా
    వాదియె! వ్యవహారభాష వలయునటంచున్
    వాదించెడి వ్యవహర్తల
    వేదము లేఁ" డని గణించె విజ్ఞుండు సభన్!

    (వేదము లేఁడని=వేదము(వేంకటరాయశాస్త్రి)..లేఁడు+అని)

    రిప్లయితొలగించండి
  24. నా రెండవ పూరణము:

    వేదనలఁ బాపు నాయు
    ర్వేద ధనుర్వేద భరతవేదమ్ములతో
    వేదములు నాల్గుఁ గలిపియు
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్!

    రిప్లయితొలగించండి
  25. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘గుఱ్ఱములున్ + ఈ ధరతో’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘గుఱ్ఱమ్ములు/ నీధరతో...’ అనండి. ‘అవగను’ అనడం గ్రామ్యమే. అక్కడ ‘‘సాధువు లేడే కాగా’ అనండి.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధవళాంగుడు’ ఎవరో అర్థం కాలేదు. ధాతముఖాలు నాలుగు. మీ లెక్క అర్థం కాలేదు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పది పూరణలు బాగున్నవి. అభినందనలు.
    పదవపూరణలో మొదటి పాదంలో ‘శరీర’ అని బేసిగణంగా జగణాన్ని వేశారు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    స్వవర్గజప్రాస పేరుతో దధలకు ప్రాసమైత్రిని కొందరు లాక్షణికులు అంగీకరించిన మాట నిజమే! కాని మనం సాధ్యమైనంత వరకు దానిని వదలివేయడమే ఉత్తమం. (‘కాదన కిట్టిపాటి యపకారము దక్షకుఁ డేకవిప్రసం/ బోధనఁ జేసి చేసె నృపపుంగవ...’ నన్నయగారి పద్యం)
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    “ఆదిని’ అనండి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, విశేషార్థప్రతిపాదమై చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. గుండు మధుసూదన్ గారూ,
    సప్తవేదముల లెక్క సరిపోయింది. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ చింతారామకృష్ణారావు గురువు గారు గతములో చూపిన దారి లో పూరణకు ప్రయత్నిస్తున్నానండీ:
    "వేదాంతము"కులతిలకుడు
    శ్రీదత్తాత్రేయమూర్తి చేరక యుంటన్
    వేధింపవధానినిటన్
    "వేదము" లేడని గణించె విజ్ఞుండు సభన్

    వే.ద.ము = వేదాంతము దత్తాత్రేయ మూర్తి

    రిప్లయితొలగించండి
  28. వేదములు నాల్గు,పంచమ
    వేదము భారతము,కలిపివేయంగ ధను
    ర్వేదము,నాయుర్వేదము,
    వేదములేడని గణించె విజ్ఞుండు సభన్

    రిప్లయితొలగించండి
  29. వేదములన్నిటిని చదివి
    మోదముతో నాటకములు ముద్రించె నహో...
    ఖేదమె! వేంకట రాయలు
    వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

    "వేదము వేంకటరాయలు శాస్త్రి"

    రిప్లయితొలగించండి