పండ్ల బేరము రాకతొ భామ యచటనిక్క ముగదూ చు చుండెదా నిమ్మ పండ్లుచూడ ముచ్చట గానుండె చూడు బాల !షుగరు వారికి మంచిది సుమ్ము కొనుము
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరింపనున్నవి !మెచ్చదగిన చిత్రితము :01)____________________________కూరగాయల సరితూచి - నోరిమి గనుకోరువారికి నిడునట్టి - కోమలాంగికూరగాయల కొనగోరి - కూరుచున్నకువలయాక్షిని; చిత్రించ - కోవిదతనుముచ్చి జూపెను; తిలకించి - మెచ్చుడయ్య !____________________________కోవిదత = skill in any thingచిత్రకారుడు = ముచ్చి
కొనుట కొఱకునై వచ్చిన కోమలాంగితూచు వస్తువు నేమిటో తొంగి చూడకూరగాయలు తక్కెడ గూ రలమ్మిదూచు చుండెను సరిగనే తూక మచట
సుబ్బారావు గారూ,మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.*వసంత కిశోర్ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
కూరలమ్మ! రండి కూర్మితో కొనరండిస్వాస్థ్యవర్థనంబు సంతతంబుచేయుచుండునట్టి శ్రీప్రదంబులు చూడుడక్కలార! వచ్చి యందుకొనుడు. 1.కాయగూరలమ్మ! కాలయాపనయేలక్రయము చేయ రండు రయము మీరతోటనుండి యిపుడె మేటివై యున్నట్టివాటి నంది యిదుగొ వచ్చినాను. 2.రామములగపండు రమ్యాతి రమ్యంపువర్ణమూనియుండె వైభవముగఒక్కదాని దిన్న మిక్కుటంబుగజేయురక్తవృద్ధి నిజము రండు రండు. ౩.కోసు పువ్వు రూపు చూసినంతనె మీకుసంతసంబు గలుగు సత్యమిద్దిచేకొనుండు రండు శాకంబు చేసినన్చవులుపుట్టు నమ్మ! వివిధగతుల. 4.ఆకుకూర చూడు డనుపమమైనట్టిస్వచ్ఛమైనరూపసౌష్ఠవంబుపొందియున్న దిట్టి సుందరశాకంబువదల రాదు రండు వనితలార! 5.దోసకాయయనగ దుర్లభంబైనట్టిహాయి నొసగు శాక మవనిలోననందుకొనుడు రండు సందియంబందకచౌకబేర మమ్మ జాగదేల? 6.మీకు సేవ జేయ శాకంబులంగూర్చిసతత మెంతయేని శ్రమకు నోర్చిఉపవనంబు జేరి యువిదలారా! రండుతెచ్చియుంటి జనులు మెచ్చునట్లు. 7.లలితహృదయలార! లాభంబులాశించుదానగాదు, తోటలోన దిరిగిసేకరించి తెత్తు నేకాలమాత్మలోపరుల సేవ జేయు భావమూని. 8.మోసమింతలేదు ముదమారగామీరుకొనుటకిపుడె రండు కూర్మిమీరదివ్యమైవెలుంగు దేశీయ శాకముల్జాగుచేయవద్దు సాగిరండు. 9.
కాయలు కూరలు కావలె కాయమ్మునుబెంచ కొనుము కావలసినవే కాయలు కొనలేమమ్మా కాయుటలేదమ్మ డబ్బు కాయలవలెనే.
వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడటంచుపండ్లు కూరల నమ్ముచు పరమ సాధ్వివీధి లోనను గూర్చుండి పేర్మి తోడసాయమను కుటుంబమునకు జేయు చుండె
కన్నుల విందగు కూరలుసున్నితముగ నమ్ముచున్న సుందరి గనరే!చిన్నది గూర్చుండె కొనగచెన్నుగ నిది దీర్చినట్టి శిల్పికి జేజే!
సగ దీర్చి నింటి లోపలతగు ఫలముల నమ్మి కలిమిఁ దాలిమి తోడన్మగనికి సాయమ్ముగ నిడుసుగుణమ్మను మెచ్చి జూచె శోభమ్మ యటన్!
ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులందరికీ అభినందనలు,ధన్యవాదాలు.ప్రయాణపు బడలికతో పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
పండ్ల బేరము రాకతొ భామ యచట
రిప్లయితొలగించండినిక్క ముగదూ చు చుండెదా నిమ్మ పండ్లు
చూడ ముచ్చట గానుండె చూడు బాల !
షుగరు వారికి మంచిది సుమ్ము కొనుము
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింపనున్నవి !
మెచ్చదగిన చిత్రితము :
01)
____________________________
కూరగాయల సరితూచి - నోరిమి గను
కోరువారికి నిడునట్టి - కోమలాంగి
కూరగాయల కొనగోరి - కూరుచున్న
కువలయాక్షిని; చిత్రించ - కోవిదతను
ముచ్చి జూపెను; తిలకించి - మెచ్చుడయ్య !
____________________________
కోవిదత = skill in any thing
చిత్రకారుడు = ముచ్చి
కొనుట కొఱకునై వచ్చిన కోమలాంగి
రిప్లయితొలగించండితూచు వస్తువు నేమిటో తొంగి చూడ
కూరగాయలు తక్కెడ గూ రలమ్మి
దూచు చుండెను సరిగనే తూక మచట
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కూరలమ్మ! రండి కూర్మితో కొనరండి
రిప్లయితొలగించండిస్వాస్థ్యవర్థనంబు సంతతంబు
చేయుచుండునట్టి శ్రీప్రదంబులు చూడు
డక్కలార! వచ్చి యందుకొనుడు. 1.
కాయగూరలమ్మ! కాలయాపనయేల
క్రయము చేయ రండు రయము మీర
తోటనుండి యిపుడె మేటివై యున్నట్టి
వాటి నంది యిదుగొ వచ్చినాను. 2.
రామములగపండు రమ్యాతి రమ్యంపు
వర్ణమూనియుండె వైభవముగ
ఒక్కదాని దిన్న మిక్కుటంబుగజేయు
రక్తవృద్ధి నిజము రండు రండు. ౩.
కోసు పువ్వు రూపు చూసినంతనె మీకు
సంతసంబు గలుగు సత్యమిద్ది
చేకొనుండు రండు శాకంబు చేసినన్
చవులుపుట్టు నమ్మ! వివిధగతుల. 4.
ఆకుకూర చూడు డనుపమమైనట్టి
స్వచ్ఛమైనరూపసౌష్ఠవంబు
పొందియున్న దిట్టి సుందరశాకంబు
వదల రాదు రండు వనితలార! 5.
దోసకాయయనగ దుర్లభంబైనట్టి
హాయి నొసగు శాక మవనిలోన
నందుకొనుడు రండు సందియంబందక
చౌకబేర మమ్మ జాగదేల? 6.
మీకు సేవ జేయ శాకంబులంగూర్చి
సతత మెంతయేని శ్రమకు నోర్చి
ఉపవనంబు జేరి యువిదలారా! రండు
తెచ్చియుంటి జనులు మెచ్చునట్లు. 7.
లలితహృదయలార! లాభంబులాశించు
దానగాదు, తోటలోన దిరిగి
సేకరించి తెత్తు నేకాలమాత్మలో
పరుల సేవ జేయు భావమూని. 8.
మోసమింతలేదు ముదమారగామీరు
కొనుటకిపుడె రండు కూర్మిమీర
దివ్యమైవెలుంగు దేశీయ శాకముల్
జాగుచేయవద్దు సాగిరండు. 9.
కాయలు కూరలు కావలె
రిప్లయితొలగించండికాయమ్మునుబెంచ కొనుము కావలసినవే
కాయలు కొనలేమమ్మా
కాయుటలేదమ్మ డబ్బు కాయలవలెనే.
వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడటంచు
రిప్లయితొలగించండిపండ్లు కూరల నమ్ముచు పరమ సాధ్వి
వీధి లోనను గూర్చుండి పేర్మి తోడ
సాయమను కుటుంబమునకు జేయు చుండె
కన్నుల విందగు కూరలు
రిప్లయితొలగించండిసున్నితముగ నమ్ముచున్న సుందరి గనరే!
చిన్నది గూర్చుండె కొనగ
చెన్నుగ నిది దీర్చినట్టి శిల్పికి జేజే!
సగ దీర్చి నింటి లోపల
రిప్లయితొలగించండితగు ఫలముల నమ్మి కలిమిఁ దాలిమి తోడన్
మగనికి సాయమ్ముగ నిడు
సుగుణమ్మను మెచ్చి జూచె శోభమ్మ యటన్!
ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులందరికీ అభినందనలు,ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిప్రయాణపు బడలికతో పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.