7, అక్టోబర్ 2014, మంగళవారం

పద్యరచన - 699

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. హనుమంతుని గద యిది యని
    జనులందరి నమ్మ బల్కు సాధన మిదియే
    పనిగట్టుకు శ్రీలంకకు
    మన పర్యాటకుల మనము మలపుట కేమో

    రిప్లయితొలగించండి
  2. తెలిసె నొక వార్త యీరోజు , తెలుపు చుంటి
    ద్రవ్వు చుండగ శ్రీలంక దీవి భువిని
    దొరికె హనుమంతు గదయట మురిపెముగను
    రెండు క్రేనులు చాలవు టం డి యెత్త .

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఆంజనేయుని ఆయుధం :

    01)
    ________________________________

    అతి మహాకాయుడౌ స్వామి - యాయుధంబు
    చిక్కె నేడది లంకలో - చిత్రముగను
    చెక్కుచెదరని మేటియౌ;- దక్కినట్టి
    అంజనాపుత్రు గద జూడ - నబ్బురంబు !
    ________________________________

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. some information in the net
    may be true or not i don't know

    This picture circulating heavily on social networking websites claims to show the Hindu God Hanumanji's Gadha (mace) which is supposedly discovered during an excavation in Sri Lanka. Other versions said it is the world's largest Gada of Veer Hanuman at Gujarat. The claims are not facts.
    Lord Hanuman is a famous Hindu deity known for his strength, discipline and dedication. Gada is his weapon that he carries to destroy evil. In the Hindu epic of Ramayana, Lord Hanuman fights with Ravana in Sri Lanka to help his master Lord Rama get back his abducted wife Sita. Perhaps this is the reason why the picture in question is associated with such a claim.

    The Gada shown in picture is real, but as such it does not belong to Lord Hanuman, and is not discovered in Sri Lanka or Gujarat for that matter. It actually shows a 45 feet Gada 'made' for installation with a 125-foot-high Hanuman statue in the outskirts of Indore, India - on the occasion of Hanuman Jayanti (birthday) on 25 April 2013. As quoted in Hindustan Times epaper:
    A 45-foot-long mace (Gada) of Lord Hanuman weighing 21 tonnes being taken out in a procession from Nanda Nagar to Pitra Parvat on the outskirts of Indore on the occasion of Hanuman Jayanti on Thursday for installation with a statue of Hanuman, which is 125-foot-high.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా ! అందరూ గమనించవలసిన ఒక ముఖ్య విషయం !
    ఈ లింకులోచదవండి !


    http://andhracultures.blogspot.in/2014/01/indian-culture_24.html

    రిప్లయితొలగించండి
  7. ఆ గదకు సంబంధించిన యీ video కూడా చూడండి

    https://www.youtube.com/watch?v=7n9nXQy49AI

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    ఆ చిత్రాన్ని ఫేస్‍బుక్ నుండి గ్రహించాను. ఆ చిత్రంక్రింద కొందరు అది హనుమంతుని గద కాదని, కొత్తదానిలా మెరుస్తున్నదని తెలిపారు కూడా.
    దానిని గురించిన వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.
    మొదటి చెప్పాల్సింది చివర చెపుతున్నా... “శుభోదయం!”

    రిప్లయితొలగించండి
  9. గదను బట్టి హనుమ గర్జించె సింహమై
    శత్రు సేన గుండె జారెనంత;
    వీరగాథ వినగ వేడుక గానుండు
    మోజు తరగదెపుడు పుడమియందు.

    రిప్లయితొలగించండి
  10. అదిగో పులియన కొందరు
    నిదిగో వాలంబనంగ నిట్టిదె కాదా
    గద హనుమంతుని దేమిటి?
    యిది లంకను బయట పడుట లేమిటి చెప్మా.

    రిప్లయితొలగించండి
  11. హనుమంతుని గద యన్నను
    వినినంతనె నవ్వు రాదె పిన్నల కైనన్!
    తనకే చావూ లేదని
    వినమే? యాయుధము నెట్లు విడునే తానై!

    రిప్లయితొలగించండి
  12. భూరి గద తోడ మారుతి పోరుసలిపె
    నాపురాణ కాలమునందు నద్భుతముగ
    నాటి ఘనతను ప్రజలకుఁ జాటి చెప్ప
    నట్టి గదను చేయించిరి హనుమ కొరకు

    రిప్లయితొలగించండి
  13. ఎప్పటి త్రేతా యుగమున్!
    నెప్పటి లంకా నగరము! నెప్పటి గదయో!
    నిప్పుడు కనపడె జనులకు
    తుప్పట్టక నుండి నిటుల దొరికితి వెటులో?!!

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    వాస్తవాన్ని పద్యరూపంలో చక్కగా చెప్పారు. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    చక్కని లాజిక్కుతో మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సుందరద్వీపంబు’ అన్నచోట ‘ర’ గురువై గణదోషం.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘యుగమో/ యెప్పటి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  15. సుందర మాయుధ మదిగన
    సుందర నగరంబునందు సుమనస లీలన్ ,
    సుందర కాండయె యిదియన
    ఎందరు గావలెను గదను యెత్తుట కొరకున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి