8, అక్టోబర్ 2014, బుధవారం

పద్యరచన - 700

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. చిలుక గోరింక వోలెను గలసి మెలసి
    జీవ నంబును జేయుడు శిష్యు లార !
    ఆయు రారోగ్య సంపద లాభ వుండు
    నిచ్చు గావుత !మీకుగా నినుమ డిగను

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పక్షిజంట :

    01)
    ________________________________

    ముద్దు గొలుపుచు నున్నవి - ముచ్చటైన
    జంట చిలుకలు కొమ్మపై - జతగ నుండి !
    కలసి యుండుడు విడివడ - కనుచు జెప్పు
    జాతి కాదర్శ మీపక్షి - జంటజూడ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  3. రంగుల తోరమ్యమయిన
    హంగులఁ దోచెడు చిలుకల హాయిగ గను, మీ
    భంగిని చిత్తరువందున,
    సంగతులేవి యవి చెప్ప జాలునె? బొమ్మల్!

    రిప్లయితొలగించండి
  4. పలికితి ప్రేమలు చిలుకగ
    ములుకుగ దోచెన ? నొలికిన ముచ్చట లన్నీ
    బలుపని దలుతువ ? చూపుము
    నలిగితి, నలిగితి ననకను నాపై వలపుల్.

    రిప్లయితొలగించండి
  5. చిలుక జంటలు చెట్లపై చేరి సతము
    నూసులాడుచు తాముండు నొప్పుగాను
    పడుచు జంటల కవియిచ్చు పరవశమును
    ముదిమి వయసున కలిగించు మోద మెప్డు

    రిప్లయితొలగించండి
  6. చిలుకల జంటను జూడన్
    పులకలు రేపెడు సరసపు మురిపెం బదియో?
    వలపుల తగాద ముదరగ
    కలగలసెడు మాట లాడు కంగారదియో?

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవిగారూ,
    ఈ భంగి అనేది సంధి జరిగి ఇబ్భంగి అవుతుందేమో చూడండీ.

    రిప్లయితొలగించండి
  8. సరేనండి. మార్చవలెనంటే మారుస్తా.
    గణభంగం కూడా కాదు.

    రిప్లయితొలగించండి
  9. పచ్చని చిలుక ల జంటయె
    వెచ్చగ గూర్చుండె నచట వేడుక తోడన్
    ముచ్చట లాడుచు నున్నవి
    మచ్చిక జేయంగ నవియె మాటలు నేర్చున్!

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    సుబ్బారావు గారికి,
    వసంతకిశోర్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    శైలజ గారికి
    అభినందనలు.
    *
    కామేశ్వర శర్మ గారూ,
    ‘త్రికముమీఁది యసంయుక్తహల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు’ అని బహుళగ్రహణం చేత ‘ఈభంగి, ఇబ్భంగి’ రెండు ప్రయోగాలు సాధువులే.

    రిప్లయితొలగించండి
  11. సలలితముగ నిలపై నా
    కలసిన చిలుకల కులుకులు కనులకునింపై
    విలసిల్లెను పచ్చని వన
    ముల ప్రకృతి కి పరవశముగ భువి పులకించెన్

    రిప్లయితొలగించండి