17, అక్టోబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1534 (గంగను మున్గి పాపముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. గంగను మున్గ,పాపముల క్షాళన జేయును గా యటంచు నా
    గంగకు పోయి మున్కలిడి కామిత మొప్పగ పూజసేయ నా
    గంగయె నిండె పూర్వజన కాలుష సంతతి దుర్విదగ్ధతన్
    గంగను మున్గి పాపముల గట్టుకవచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  2. గంగను నింపి నారు గద కల్మష మందిన "పాలి థి "న్నుచే ,
    భంగిక గొన్న వార లటు వంచన జేయుచు కాసు లేరుచున్,
    జంగమ దేవదేవునిని చక్కగ జూడగ కాశి కేగి ని
    ర్గంగ ను మున్గి పాపముల గట్టుక వచ్చి తి మయ్యొ దైవమా !
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. బెంగలు లేక నెప్పుడును బ్రీతిగజూడక నాలుబిడ్డలన్
    జంగమదేవ! నిన్నుగని సన్నుతిజేయక గేలిజేసితిన్
    భంగును త్రాగి నేనిటుల పామరుడై నిల పాడుదైత్యమన్
    గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  4. గంగయె పాపహారిణని కాంచి పురాణములందు నెంతయున్
    మ్రింగును నాదు పాపమని, మించిన తోషము తోడనేగి, వే
    గంగను మున్గగా నదియె కల్మష యుక్తపు నీరుగల్గ, నా
    గంగను మున్గి పాపముల గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    గంగయె భ్రష్టమయ్యెగద, గంతులు వేయగ శంభునెత్తి పై
    అంగన యామె జారి జట, లాహిమ సానువులందు కల్మషాల్
    చెంగున పొందె, కశ్మలము చేరెను భూమిని, కాంచగాను నా
    గంగను మున్గి పాపముల గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    గంగయె యెల్ల పాపముల కానక యుండగ చేయు నీయిలన్
    గంగను కానమెందునను కల్మష యుక్తము కానిదిప్పుడున్
    గంగను గంగ మేలునన, కాశికి నేగియు, భక్తి తోడ, నా
    గంగను మున్గి పాపముల గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
    (గంగ= నీరు, గంగ= గంగా నది)

    పొంగిన కల్మషాలవియ పొవిడ నాపగ లా, రసాయినా
    సంగము నౌట నీరమది సర్వము తావిషయుక్తమైనదా
    గంగను నీట నావిషము కానము నంచును నెంచి, వేగమా
    గంగను మున్గి పాపముల గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  5. గంగను స్నానమాడినను కల్మషమైన మనస్సు శుద్ధమౌ
    గంగ జలమ్ము ద్రావినను గ్రమ్మవు రోగము లంతమౌన నా సంగతు లన్నెరింగియును సత్యమె యంచును కల్తియైన ఆ
    గంగను మున్గి పాపముల గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  6. నింగినిఁ దాకుచున్న కమనీయవిలాసపుభావనమ్ములున్
    బంగరు జీవితమ్ము రసభావహితోక్తులబంధురమ్ముగా
    పొంగిన ప్రేమ,పంచెదనుపో యని వచ్చితి రాజకీయ పుం
    గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కళింగయుద్ధము తదుపరి యశోకుని పశ్చాత్తాపము :

    01)
    ________________________________

    పొంగిన గర్వము న్మిగుల - పోటరి నంచిటు రెచ్చిపోయి ప
    ల్భంగుల సైన్యము న్నడపి - పాతక మంచని యెంచకుండ ని
    ర్భంగముగా నమాయకుల - రక్తము జిందగ శంబరంబునన్
    భంగమొనర్చితి; న్పశుల, - పాపల, వృద్ధుల, శోణితంబనే
    గంగను మున్గి పాపములఁ - గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
    ________________________________
    భంగము = విధము
    భంగము = కారణము
    శంబరము = యుద్ధము
    భంగము =ఖండము
    శోణితము = రక్తము

    రిప్లయితొలగించండి
  8. మ్రింగును పాపమంచు కడుమేలగు నంచును కాశికేగి యా
    గంగనుమున్గి కంటిమట కాలజలంబు శరీరరోగ పున్
    భంగిని, తెచ్చితిన్ జలము బాధలు పెంచగ త్రాగువారికిన్
    గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
    శరీర+అరోగము

    రిప్లయితొలగించండి

  9. కొంగజపంబుద్రుంపి తగ కోర్కులు పుట్టగజేసిచూడ్కులన్
    కొంగున గట్టిత్రిప్పుకొని గుట్టుగ మాన్పితి బ్రహ్మచర్యమున్
    యంగజు కేళికై, ముని నితాంతమనోజ్ఞ సరాగవాహినిన్
    గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  10. పొంగినవెల్ల యేరులిట, పుట్టెడు దుఃఖము తెచ్చెనే! నదీ
    సంగమమందు స్నానముల సంబరమంచు చనంగ వానలా
    నింగిని నేలనుం గలిపెనే! జతగాండ్రును నెట్లుపోయిరో,
    గంగను మున్గి, పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    తోటి ప్రయాణీకుల , స్నేహితుల శవాలను కొండకోనల కు విడిచిపెట్టి రావలసి వచ్చిన పరిస్థితుల్లో ఉన్న నరుని బాధ.

    రిప్లయితొలగించండి
  11. గుంగిలి జీవితంబునను గోర్కెలుఁ దీరక దిక్కుఁ దోోచోకన్
    గృంగి కృశించి పోవుచును ఖిన్నులమై మది భారమౌచు సా
    గంగను మున్గి పాపములఁ గట్టుకు వచ్చితి మయ్యొ దైవమా
    బొంగురు గొంతుకన్ బలుకఁ బోల్చవె మమ్ముల ముక్తి నీయగన్

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సుమాంజలులు.

    గంగనుఁ గాంచు కోర్కి పెరుఁగం గనుమారినిఁ జేరి, మేము వే
    గం గనుమబ్బు దారినెదుగం గనువిన్కలి బుస్సుమంచు రేఁ
    గం గనుఁగొంచు దానిని దగం గనుమూయఁగఁ జంపి, పాపమన్
    గంగను మున్గి, పాపములఁ గట్టుక వచ్చితి, మయ్యొ దైవమా!

    కనుమారి=లోయ
    కనుమబ్బు=క్రొంజీఁకటి
    కనువిన్కలి=చక్షుశ్శ్రవము(పాము)

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమః

    బంగరు భూమి భారతము పావనితీర్థము పారుచుండగా
    మంగళమాయె జీవులకు మానవ జాతులు స్వార్థచిత్తులై
    దొంగలవోలె సంపదలు దోచిరి, దుష్ట దురూహబుద్ధిదుర్
    గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    దుష్ట దురూహబుద్ధిదుర్గంగ = దుష్టమైన చెడ్డ ఊహలు కలిగిన బుద్ధి యనెడు కలుషిత నీరు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారి పూరణలో "శరీర+అరోగ" అన్నచోట "శరీరరోగ" అని సంధి జరగదు.కాబట్టి శరీరయరోగ లేదా శరీరారోగ అనాలి అప్పుడు గణభంగం.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులకొక గమనిక:

    శ్రీ కంది శంకరయ్యగారి యంతర్జాలము పనిచేయకపోవుటచే వ్యాఖ్యలను సమీక్షించలేకపోవుచుంటినని యింతకుమునుపే వారు చరవాణిద్వారమునం దెలిపియున్నారు.

    నాకునుం గొన్ని యనివార్యకార్యములున్నకతమున నేనును సమీక్షింపలేకుంటిని. మన్నించఁగలరు.

    మిత్రులు పరస్పరము తమ పూరణముల గుణదోషవిచారణముం జేసికొనఁగలరు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీమతి మందాకిని(లక్ష్మిదేవి) గారి పద్యము చాలా బాగున్నది. ఆభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

    దొంగలు, షడ్రిపుల్ కలిసి దోపిడి జేసిరి నాదు చిత్తమం
    దంగన సంగమం మ్మొకటె యాశయమంచును మోహవార్ధి ము
    న్గంగును మున్గి పాపముల గట్టుక వచ్చితి నయ్యొ దైవమాI
    భంగము జేయ నా తపము పాడియె నీకని కౌశికుండనెన్

    కేంబాయి వేంకట తిమ్మాజీ రావు

    రిప్లయితొలగించండి
  18. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

    దొంగలు, షడ్రిపుల్ కలిసి దోపిడి జేసిరి నాదు చిత్తమం
    దంగన సంగమం మ్మొకటె యాశయమంచును మోహవార్ధి ము
    న్గంగును మున్గి పాపముల గట్టుక వచ్చితి నయ్యొ దైవమాI
    భంగము జేయ నా తపము పాడియె నీకని కౌశికుండనెన్

    కేంబాయి వేంకట తిమ్మాజీ రావు

    రిప్లయితొలగించండి
  19. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

    దొంగలు, షడ్రిపుల్ కలిసి దోపిడి జేసిరి నాదు చిత్తమం
    దంగన సంగమం మ్మొకటె యాశయమంచును మోహవార్ధి ము
    న్గంగును మున్గి పాపముల గట్టుక వచ్చితి నయ్యొ దైవమాI
    భంగము జేయ నా తపము పాడియె నీకని కౌశికుండనెన్

    కేంబాయి వేంకట తిమ్మాజీ రావు

    రిప్లయితొలగించండి
  20. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

    గంగను కాలకాలుడు శిగన్ ధరియించెను ప్రేమ మీర యా
    గంగను ప్రాణ దాతవని క్షాణికి దెచ్చె భగీరధుండు యా
    గంగను కష్మలమ్మవగ కల్మశముల్ కలియంగ జేయగా
    గంగను మున్గి పాపముల గట్టుక వచ్చితి మయ్యొ దైవమా

    కెంబాయి శ్రీనివాస రావు

    రిప్లయితొలగించండి
  21. నాల్గవ పాదం కొద్ది మార్పుతో :
    గుంగిలి జీవితంబునను గోర్కెలుఁ దీరక దిక్కుఁ దోోచోకన్
    గృంగి కృశించి పోవుచును ఖిన్నులమై మది భారమౌచు సా
    గంగను మున్గి పాపములఁ గట్టుకు వచ్చితి మయ్యొ దైవమా
    బొంగురు గొంతుకన్ గొలువఁ బోల్చవె మమ్ముల ముక్తి నీయగన్

    రిప్లయితొలగించండి
  22. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రోజంతా నా నెట్ పనిచేయక పూరణలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
    సమస్యకు మంచి మంచి పూరణలను అందించిన మిత్రులు.....
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
    శైలజ గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    వసంత కిశోర్ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారికి,
    కెంబాయి శ్రీనివాస్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. బంగరు బొమ్మయౌ వధువు పన్నుగ కోరిక తీర్చుమోయనన్
    గంగమతల్లిదౌ నగరి కాశికి చేరగ ముద్దుముద్దుగా
    పొంగిన కాల్వలన్ మురికి పొందుగ చేరగ నెంచుచుంటి నీ
    "గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!"

    రిప్లయితొలగించండి
  24. గంగను మున్గి పాపములు గంపల తోడుత పారబోయుటన్
    సంగమునందు జేరుచును సంబర మొందుచు కుంభమేళలో
    చెంగున దూక నాయకులు చెంతను రాహులు తోడునుండ నా
    గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి