13, అక్టోబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం – 1532 (అంబను బెండ్లాడె భీష్ముఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.

27 కామెంట్‌లు:

  1. మాష్టారు షెడ్యుల్ తప్పింది ... ఈరోజు దత్తపది రావాలి

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    కుమారసంభవము కొఱకై :

    01)
    ____________________________

    గండడగు కుమారునితో
    చెండాడగ తారకుడను - జేజేగొంగన్
    కొండకొమరియగు శ్రీ జగ
    దంబను బెండ్లాడె భీష్ముఁ - డతిమోహమునన్ !
    ____________________________
    కుమారుఁడు = కొడుకు; బాలుఁడు; స్కందుఁడు
    జేజేగొంగ = రాక్షసుడు
    అంబ = పార్వతి
    భీష్ముఁడు = శివుఁడు

    రిప్లయితొలగించండి
  3. అంబరచర వాంఛితమో!
    అంబుజ శర ఘాతమహిమొ! అమ్మ తపమ్మో!
    సంబర మూలంబేమో!
    అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్!!

    రిప్లయితొలగించండి
  4. సాంబయ కొమరుడు భీష్ముడు
    అంబటి రాంబాబు దుహిత యంబను జూచీ
    కంబాళ చెరువు గుడిలో
    నం బను బెండ్లాడె భీష్ము డతి మో హమునన్

    రిప్లయితొలగించండి
  5. అంబరము మారు మ్రోగగ
    సంబరములు మిన్ను ముట్ట, సా దర ముం గా
    న్నంబుధులు వెల్లి విరియగ
    నంబను బెండ్లాడె భీష్ము డతి మో హమునన్

    రిప్లయితొలగించండి
  6. భీష్మశపథము :

    02)
    _______________________________

    వెండియు తండ్రికి గూర్చగ
    నంబను; బెండ్లాడె భీష్ముఁ - డతిమోహమునన్
    చండప్రతిఙ్ఞ నంతట
    "నిండు నజానిగ బ్రతికెద - నిష్కర్షముగా "
    _______________________________
    అంబ = తల్లి
    పెండ్లియాడు = వరించు

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    దత్తపది నిన్ననే ఇచ్చాను కదా! వరుస తప్పలేదు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    (ఇంకా అమెరికాలోనే ఉన్నారా?)
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘చూచీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘అంబను వలచెన్’ అనండి.
    రెండవ పూరణలో ‘సాదరముగ స/ర్వాంబుధులు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. అంబుజనాభుడు నలువ యు
    నంబరమున దివిజు లంత నవలోకించన్
    సంబరముగ గిరితనయౌ
    నంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్!!

    రిప్లయితొలగించండి
  9. గురుదేవులకు నమస్కారములు.పెద్దలు శ్రీ వసంత్ కిశోర్
    గారి పద్యాల్లో ప్రాస మరచి నట్లు న్నారు.

    రిప్లయితొలగించండి
  10. శంభుని మోహితుఁ జేయఁగ
    స్తంభించె జగంబు , మన్మధ దహనమాయెన్,
    సంభవ మొందగ కొమరుడు
    నంబను బెండ్లాడె భీష్ముఁడతిమోహమునన్!

    రిప్లయితొలగించండి
  11. సాంబుడు తపముకు మెచ్చియు
    అంబకు పెండ్లాడె- భీష్ముడతి మోహమునన్
    వెంబడితే, నంబను, నా
    యంబాలికలంబికలను ననుజుని కొరకై

    సాంబయ చేగొనె నెవరిని?--1
    అంబ శిఖండిగ జననము నందె నెవరికై?--2
    శుంభ నిశుంభులు చెడిరెటు?--3
    అంబను పెండ్లాడె--1, భీష్ము--2, డతిమోహమునన్--3

    రిప్లయితొలగించండి
  12. అంబను కాదనె నాదిని
    యంబను క్రీగంట జూచె నాపయి వశుడై
    యంబను విడువంజాలక
    యంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.

    రిప్లయితొలగించండి
  13. జృంభించి తపము చెఱచగ
    శంభరభంజనునిఁదునిమె శంభుడు, పిదప
    న్నంబుజ నయనను, గిరిసుత
    నంబను పెండ్లాడె భీష్ముడతి మోహమునన్

    రిప్లయితొలగించండి
  14. sir ! namaskaramulu.nenu inkanu
    Amerikalone unnanu,28th February na hyderabad vastanu.

    రిప్లయితొలగించండి
  15. శ్రీగురుభ్యోనమ:

    కొంతమంది ఆత్రగాళ్ళు(including myself) పుస్తకాలను గాని ఏదేని విషయములను పూర్తిగా చదవక అక్కడక్కడ చదివి అంతా తెలిసిపొయిందనుకుంటూ, మిడిమిడి జ్ఞానముతో మాట్లాడుతూంటారు. అలాంటి వారిలో

    డంబమున మూర్ఖుడొక్కడు
    సంబరముగ భారతమును స్వల్పమె చదివెన్
    తంబుర మీటుచు పల్కెను
    అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.

    రిప్లయితొలగించండి
  16. కిశోర్జీ ! మీ రెండు పూరణలలోనూ ప్రాస ?.....పొరబ "డ్డా " రు.

    రిప్లయితొలగించండి
  17. సాంబని పేరే భీష్ముం
    డంబయె నగజాతగాగ నామెయె గొలువన్
    సంబర మందగ భువి జగ
    దంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.

    రిప్లయితొలగించండి
  18. తుంబురతంబురనాదము
    లంబరవీధీవిహారమధిరోహించన్
    సంబరముల నొసఁగెడు దు
    ర్గాంబను పెండ్లాడె భీష్ముఁడతిమోహమునన్.

    భీషంఉఁడు = పరమేశ్వరుఁడు.

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులకు నమస్కృతులు.

    బిందుపూర్వక "బ" కారమునకు బిందుపూర్వక "భ" కారమునకు ప్రాస కుదరదనుకొంటాను.
    ఉదా : అంబ - శంభుడు

    రిప్లయితొలగించండి
  20. శైలజ గారూ,
    అంబాభీష్ములను పార్వతీపరమేశ్వరులుగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    గోలి వారూ,
    నిజమే! వసంత కిశోర్ గారి పద్యాల్లో ప్రాస తప్పింది. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    స్వవర్గజప్రాసలో ద,ధ లు సమ్మతమే కాని బ,భలకు ప్రాసను లాక్షణికులు చెప్పలేదు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు కూడా లాక్షణికులు చెప్పని బభ ప్రాసను ప్రయోగించారు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు చెప్పినది నిజమే! బ,భలకు ప్రాస చెల్లదు.

    రిప్లయితొలగించండి
  21. పూజ్య గురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచన ప్రకారము మొదటి పాదమును మార్చి, రెండవ పాదంలోని టైపు తప్పునుసరిచేశాను. (శంబరభంజనుడు). తమరి అభిప్రాయాన్నితెలియజేయండి.

    అంబకమున తపము చెఱచ
    శంబరభంజనునిఁదునిమె శంభుడు, పిదప
    న్నం బుజనయనను, గిరిసుత
    నంబను పెండ్లాడె భీష్ముడతి మోహమునన్

    రిప్లయితొలగించండి
  22. అన్నపరెడ్డి వారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ముంబయిలో భీష్ముడొకడు
    సంబరపడి పెండ్లియాడ సతిని వెదకగా
    అంబ యను వధువు దొరకగ
    అంబను బెండ్లాడె భీష్ము డతి మోహమునన్!

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా ! ధన్యవాదములు !

    ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష నెరపిన
    అంబ - భీష్ములకు పెళ్ళెలా చెయ్యాలా ?
    అనే తీవ్రమైన ఆలోచనతో
    భీష్ముడు లో డ కారము అంబ పక్కన జేరిపోయినట్టుంది !

    సమస్య సాధించేసానని సంబరపడ్డానే గాని
    పొరపాటు గమనించుకోలేకపోయాను !

    పొరపాటును తెలియ జేసిన మిత్రులు
    సహదేవుడు గారికీ
    శాస్త్రిగారికీ ధన్యవాదములు !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి