చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ వినోదాత్మకంగా ఉంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘పదనిస + అనుచు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘పదనిస యని’ అనండి. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. టైపు దోషాలు ఎక్కువగా నున్నాయి. కాస్తా జాగ్రత్త వహించండి. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సరిగమపదని' యను సప్తస్వరంబులు
రిప్లయితొలగించండిరివ్వుమనుచు సాగ దవ్వు గాను
గగురుబొడుచు నొడలు కమ్మని యనుభూతి
మనము నందు గలిగి మధురముగను
సర్వజనులకెల్ల సౌఖ్యప్రదాతగా
రిప్లయితొలగించండిరిత్తబోవకుండునుత్తమముగ
గగనవీధులందు గమియింపగాజేయు
మహిత గానమొకటె మహినిచూడ.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
కనీసం స్నానాల గదిలో నైనా :
01)
_______________________________
సకల జీవ కోటి - సంగీతము విన, ప
రిసరములను మరచి - రెక్క లూపు !
గళము విప్పి పాడి - గలగలా నృత్యంబు
మహిని జేతురు గద - మనుజు లెల్ల !
_______________________________
సరిగమ పద యనుచు సావిత్రి పాడగ
రిప్లయితొలగించండిరివురివు మని సోక చెవుల కుమఱి
గగురు పొడిచి మేను గగనాన విహరించె
మహతి ! నమ్ము నాదు మాట నిజము
సరిగమపదని యను సరళీస్వరమ్ముల
రిప్లయితొలగించండిరిగమపదనిసనుచు నగవు మీర
గమకములను జూపి గానమ్ము జేసిన
మనసు మురిసి పోదె మనకు జెపుమ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులు శ౦కరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండి1.సకల శాస్త్ర కళల చదువుల జవరాలు
రిష్టమెసగ వీణ నిష్టపడుచు
గమకములను మీట గాంధర్వ శాస్త్రమ్ము
మహిని వెలసె నండ్రు మానితముగ
2.సరస యుక్తములుగ స్వర రాగ మేళన
రిషభ శ్రుతిని గళము రింగు మనగ
గమక గాయకుండు ఘంటసాల యొకడు
మహిని లలిత గాన మలర జేసె
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ వినోదాత్మకంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పదనిస + అనుచు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘పదనిస యని’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండి1.సరగు శిలలనైన సర్పాల నిన్ తా
రింపు తలలనూపు లీలనుంచు
గలగలాడుమనగా గతి నేమొ క్రమగతిని
మహితమైన రీతి మార్చు నిదియె
2.సరిగ పాడి నంత సరగున వాన ద
రిత్రి లోన కురియు లీలగాను
గమక మదియె మంచి గావించు చెడ్డనే
మనుజులెల్ల వినిన మంచు విరియ
3 సరస ఘంటసాల చక్కని పాటలు
రిషభస్వరము వినిన రేగు మనసు
గమకమిష్ట మౌచు కమనీయ గతి లోన
మహిట కిన్నెరటుల మాయ జూపు
4. సరస చెడ్డ గతులు శక్తినే పొంది తా
రిపుల నోడ జేయు లీలనుండు
గరిమ రోగములను గనగ బాగును జేయు
మహిమతెల్పు శాస్త్ర మదియె గాదె
సంతసమును గూర్చు చక్కగఁ బాడ స
రిప్లయితొలగించండిరిగమలను తలచుచు, రిత్తవోదు
గట్టి పట్టుతోడఁ గావించ సాధన
మధుర గాయకులుగ మనగ వచ్చు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
టైపు దోషాలు ఎక్కువగా నున్నాయి. కాస్తా జాగ్రత్త వహించండి.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.ఈశ్వరప్ప గారి పూరణసరిగమల నడక నాలుగు పాదాలలో గమనించండి
రిప్లయితొలగించండిసరిగ మనసు లేద సంగీత సార ప
రిగ మనిషికి జేర దిగులు మాన్పు
గమకమందు పల్క గమ్యమ్ము నందకే
మగత మాన్పు లయలు తగు విధాన
సర్వ జీవులెంచు సంగీత సారమ్ము
రిపువు వినిన గాని రీతి మారు
గర్వమన్న దెచట కనుపించ నీయదు
మనుగడందు విందు మహిమ గలది
అక్టోబర్
సంగీతం......
రిప్లయితొలగించండిసన్న పిల్ల వాని చల్లగా లాలించు
రిపువు పగను బాపు లీల తనది
గమక మన్న దాని గానాని కందించ
మదన పితరు డైన మహికి దిగడె!
మిత్రులందఱకు నమస్సుమాంజలులు.
రిప్లయితొలగించండిసరిగమపదనియను సప్తస్వరాలు స
రిత్సమప్రవాహ రీతి రాగ
గమక తాళ మిళిత గాత్రసంగీతమై
మధువులూరుచు మన మనసు దోచు!
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిసరిగనుంచుమనసు పరి చేయును సకలా
రిష్టములను తొలచు కష్టమెల్ల
గరిమ యతిశయించు కరుణ గాంచును దైవ
మవని గానవిద్య యద్భుతంబు
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిసర్వకాలములను సంగీత సమ్రాట్టు
రిత్తఁబుచ్చకయె తరింపఁజేయు
గగనగంగఁ బోలు గాత్రసంగీతమున్
మనుజజాతి కొసఁగి మాన్యుఁ డాయె!
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకల జనులకు హాయిని జతగఁ జేర్చు,
రిప్లయితొలగించండిరిపులనైన రవంత నిల్పి వినజేయు
గరిమ సంగీత కళలకు గలదటంద్రు.
మనము మీర ప్రణామము మదినిఁ జేతు.
సోదరి లక్ష్మీదేవిగారూ, మీ పద్యము బాగుగ నున్నది. కాని యాటవెలఁదికి బదులుగాఁ దేటగీతిని వ్రాసితిరి. మఱలఁ బ్రయత్నింపఁగలరు.
రిప్లయితొలగించండిగమనించనేలేదు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసకల జనుల కిలను సంగీతము రుచించు;
రిపులకైన కొలది కైపు నిచ్చు
గరిమ గలది యొక్క ఘనత సంగీతమ్ము
మనుచునుండు నెపుడు మహిని నిజము.
సకల జనుల కిలను సంగీతము రుచించు;
రిప్లయితొలగించండిరిపులకైన కొలది కైపు నిచ్చు
గరిమ గలది, తనదు ఘనత సంగీతమ్ము
మనుచునుండు నెపుడు మహిని నిజము.
తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలు గురువుగారూ
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే. గీ.
రిప్లయితొలగించండిస/లలితంబైన సంగీత శాస్త్రము, నెవ
రి/కిని యబ్బునో వారికి లెస్సగాను
గ/తులు, శృతులును, లయబద్ద గమకములును
మ/హిని వెలయించు గాయకమణులుగాను!!