1, అక్టోబర్ 2014, బుధవారం

పద్యరచన - 693

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. సహనము గలిగిన ప్రాణులు
  బహువిధముల లాభపడును ప్రతిపని యందున్
  కుహనంబునకై వేచెడి
  హిహకము గలుగు కడ జూడుమీ చిత్రమునన్

  రిప్లయితొలగించండి
 2. కలుగున మెలిగెడి యెలుకయె
  ఫలహారమనెడి తలపున వలవలె నిలెచెన్
  తొలగదు కదలదు మెదలదు
  సలాము జేసెదను పిల్లి సహనంబునకున్!!

  రిప్లయితొలగించండి
 3. పిల్లి యొక్కటి కూర్చుండె మెల్ల గాను
  నెదురు జూచుచు నాహార మేదియైన
  వచ్చు నేమోన నుకొనుచు గచ్చు మీద
  నెంత తెలివై న దో!పిల్లి చింత జేయ .

  రిప్లయితొలగించండి
 4. సహనమె సంపద లొసగున్
  కుహనముకై వేచు చీలి కుదురును గనుడీ!
  సహనమె బలమగు జనులకు
  సహనమె గెలుపొందు ధరను సందియమేలా!

  రిప్లయితొలగించండి
 5. కలుగున దూరినదనుచును
  ఎలుకను పట్టంగ నోర్పు నిటు నిలచితివే
  కలుగును దానికి దారులు
  పలువిధములు లోన నింక పదవే పిల్లీ !

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. ‘హిహకము’ శబ్దప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వచ్చునేమో యనుకొనుచు’ అనండి.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కుహనమునకు’ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యంలోని భావం వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. సహనము కావలె ప్రాణికి
  సహనమె శ్రీరామరక్ష సహనమె సిరియౌ
  సహనమె సర్వము నిచ్చును
  సహనము కోల్పోయినపుడు సంకట మొదవున్.

  రిప్లయితొలగించండి
 8. ఎలుకల కొరకై యాపిల్లి కలుగు వద్ద
  నెదురు చూచుచు నుండెను కుదురు గాను
  ఓర్పుతోడను తనదైన నేర్పుతోడ
  పట్టి తినుచుండు నెలుకలఁబరమ తృపి

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గుంత కాడ నక్క! కంత కాడన్ బిల్లి!
  చెంతఁ జేరఁ గోరు చిలిపి చెలుఁడు!
  గద్దె నెక్కఁ జూచు ఘటికుండెవండైన!
  వేచి చూచు టన్న వింత గాదు!

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నిలకడకు నిదర్శనం పిల్లిని గని- నేర్చుకోవలసినది చాలా యున్నది :

  01)
  ____________________________________

  ఎలుకను బట్టగ కన్నపు
  వెలుపల నట పొంచియున్న - పిల్లిని గనినన్
  నిలకడ గల్గిన గాదొకొ
  నెలమిని జీవిత సమరము - నిజముగ గెలువన్ !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి