23, అక్టోబర్ 2014, గురువారం

పద్యరచన - 715

కవిమిత్రులారా,

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పద్యరచన చేయండి.

38 కామెంట్‌లు:

  1. కోపాలను తాపాలను
    దీపావళినాడు మరచి దేదీప్యముగా
    దీపంబుల వెలిగించుడు
    పాపములను చీకటులను పారగ ద్రోలన్

    రిప్లయితొలగించండి

  2. దీపావళి శుభా కాంక్షలు
    ----
    రాక్ష సుండగు నరకుని గక్షతోడ
    సంహ రించిన యాసతి సత్య భామ
    శాంత రూపము వహియించి సంతసమున
    బ్లాగు కవులకు నీయుత ! వరము శతము

    రిప్లయితొలగించండి

  3. దీపాలను వెలిగించిరి
    దీపావళి పేరు పెట్టి దేదీ ప్యముగాన్
    రూపాయలైన వెరవక
    పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    గురువుగారికి, కవిమిత్రులకు,బ్లాగువీక్షకులకు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

    తిమిరమును పారద్రోలుచు
    నమితమ్ముగ శోభ గూర్చు, నానందములన్
    సమకూర్చు దివ్య పర్వము
    మమతల వెలుగుల శుభములు మనసుల కొసగున్

    రిప్లయితొలగించండి
  5. జీవితమందు క్లేశములఁ క్షీణతనొందగఁజేసి దివ్యమౌ
    భావన గల్గఁజేసి పరిభావములెల్ల తొలంగఁజేయుచున్
    ధీవరపుణ్యకీర్తులయి తేజమునందగ జేయునట్టి దీ
    పావళి సర్వసౌఖ్యకరమై యలరించు కవిత్వమూర్తులన్.

    రిప్లయితొలగించండి
  6. 2
    శుభకరమై సుఖశాంతుల
    విభకరమై హర్ష హృదయ విలసితమై యా
    ప్రభు వర సంప్రాప్తంబై
    ప్రభలిడు దీపావళి తమరందరి యిండ్లన్

    రిప్లయితొలగించండి
  7. కాకర వత్తులు కాక్షించు మీ వృద్ధి
    *****చిచ్చు బుడ్లడుగు మీ క్షేమములను
    విష్ణు చక్రంబు మీ విభవంబుఁ గోరును
    *****భూ చక్రములిక మీ ముదమునరయు
    చిఱు టపాసులు వాంఛ సేయు మీకు సిరిని
    *****త్రాళ్లు ప్రార్థించు మీ ధైర్యమెగయ
    చిన్ని మతాబు మీ శ్రేయస్సునర్థించు
    *****ప్రణవమై మిమ్ములఁ బ్రమిద కాచు

    నెమలి యీకను తలదాల్చి, నీరమందు
    పాము తలపైన నర్తించి, పాలు వెన్న
    లారగించి, వెదురు బట్టి, లలన యడుగ
    పారిజాతమిచ్చినవాని పదము రక్ష

    రిప్లయితొలగించండి
  8. నరకుని మరణము నాసుం
    దరివిని మోదంబు నొంది తలపులు మీరన్
    వరువరుసగ దీపాలను
    కరమున వెలిగించె నపుడు కాంతులు గలుగన్

    కాంతు లన్నియు నయ్యప్ప జోతి యగుచు
    నాయు రారోగ్య సంపద లంచితముగ
    బ్లాగు కవులకు నిచ్చుత ! ప్రమద మలర
    శుభము లొసగుదీ పావళి శుభ దినాన

    రిప్లయితొలగించండి
  9. భావి తరమ్ము వారు పరివర్తన జెంది త్యజించగావలెన్
    పావనమైన రోజున టపాసుల గాల్చుట హాని యౌననే
    భావనదాల్చి తగ్గుదల పర్పుట సౌఖ్యము లిచ్చు పృథ్వి దీ
    పావళి నాడు కల్మషము నాపిన వారల ప్రస్తుతించుచున్



    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ‘ లలన యడుగ పారిజాతమిచ్చినవాని పదము రక్ష’ అంటూ మీరు చెప్పిన సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులకు, కవిమిత్రులకూ, వీక్షకులు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

    యేటికి సరిపడునట్లుగ
    నేటికి వెలిగించు శక్తి నిచ్చెడి జ్యోతిన్
    యేటికి భయమున్ బడెదవు
    మేటిగ చీకట్లు ద్రెంచి మెరుపుగ సాగన్.

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులకు,, కవిమిత్రులకు,బ్లాగువీక్షకులకు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. కర్ణభేరిని చీల్చు కరకు శబ్దమ్ముల
    ...........విస్ఫోటనమ్ముల వీడ వలదె?
    కను మిరుమిట్లగు పెను కాంతుల వెలార్చు
    ...........విపరీత పుంజాల విడువ దగదె?
    హానికారక రసాయనముల వెదజల్లు
    ...........మందు గుండును ముందు మాన వలదె?
    వృద్ధుల శిశువుల భీతిల జేసెడి
    ...........నిప్పుతో నాటలు ముప్పు గాదె?

    దివ్వటీలను వెలిగించి దిబ్బు మనుచు
    నందములు చిందు ప్రమిదల విందు జేయు
    నింగి వీడిన తారల భంగి మెరయు
    దీప లక్ష్ములు చాలవే దివ్యముగను ?

    రిప్లయితొలగించండి
  14. పిల్లలు నేడదేమొ మరి వీడిరి యాటల, తోటివాండ్రతో
    నల్లరి మాని పెట్టెలనె యంటుకు కూర్చుని యుంద్రు. నేటిదే
    యెల్లరు మెచ్చుపండగగు, నేలొకొ పల్మఱు హెచ్చరించుటల్,
    డొల్లగ స్వచ్ఛతల్ భువిని డుంకునటంచు నిరోధవాచ్యముల్?

    పెద్దలు కాలుష్యనివారణకు మోటర్లు, ఇంజన్లు, సౌకర్యాలు(ఫ్రిజ్జుల్, ఏసీలు) ఏవీ ఒక్కరోజు కూడా మానరు గానీ పిల్లలు చిచ్చుబుడ్లు మొదలైన వాటికే పెద్ద కాలుష్యమంటూ నిరాశపఱచడాలు అవీ ఎందుకు?
    ఈ కాలంలో పిల్లలు గంతులేసి ఆడే రోజు స్నేహితులతో కలిసి కాల్చే టపాకాయలే. దాన్నీ వద్దనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  15. రావణు వధియించి రాముడు పట్టాభి
    షిక్తుడై రాజ్యాన చెలగు దినము
    మహలక్ష్మి వేడుకన్ మనయిండ్ల కేతెంచి
    పూజలఁగొనునట్టి పుణ్య దినము
    స్వర్గస్తులైనట్టి వ్యక్తులన్ స్మరియించి
    దివిటీలువెలిగించు దివియ దినము
    వాణిజ్య వర్గాలు ఫలములు లెక్కించి
    క్రొత్త దస్త్రములను కోరు దినము

    దేశప్రజలంత వెలిగించి దీపములను
    క్రొత్త వస్త్రముల్ ధరియించి కూర్మి పేర్మి
    తీపివంటల గుడుచుచు తృప్తితోడ
    మందు గుండును కాల్చుచు మను సుదినము

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మిసన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. భువి యద్దంబై దివియే
    సవరించు కొనంగ జూచు సంబర మందన్!
    కవి మిత్రాదుల కెల్లన్
    పవిత్ర దీపావళీ శుభంబులఁ దేవే!

    రిప్లయితొలగించండి
  18. పూజ్యులు గురుదేవులుశంకరయ్యగారికి కవిమిత్రులకు,బ్లాగువీక్షకులకు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
    పద్య రచన
    చక్కటి చిత్రము నందున
    పిక్కటిలగ దీపములను పేర్చిన ముదితా!
    మక్కువ నభి నందనలను
    నొక్క కవియు జెప్పడాయె నుత్సాహముగా
    అందరి తరఫున నేనభి
    నందనలను తెలుపుచుంటి నందుకొనుమునీ
    చందముమెచ్చగ నత్త యు
    బంధు జనము ప్రీతి నొంద వాసిన్ గనుమా

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీ దేవి గారితో స్నేహ పూర్వకంగా

    మెచ్చిన కాకర పూలును
    నచ్చిన ముత్యాల జిందు నయమగు బుడ్లున్
    పెచ్చగు మతాబు లుండగ
    నచ్చో విస్ఫోట రవము లగునే ముదముల్?

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

    దీపావళి :

    01)
    ____________________________

    కష్ట నష్టము లన్నియు - కరగి పోయి
    శుభము లెన్నియొ జరుగగా - శోభనముగ
    జాల ప్రార్థింతు బడి నేల - శూలి యెదుట
    మేలు కలుగగ మీ యింట - మిత్రులార !
    ____________________________

    రిప్లయితొలగించండి
  21. విస్ఫోట రవములు వలదు
    విస్ఫూర్జితమగుచు జిల్గువెల్గుల తో చ
    క్షు స్ఫురణమును (ను) ల్లాసము
    తో స్ఫూర్తినొసగు పటాకు తో తృప్తి కదా!

    గుండెలు పగిలెడు శబ్దము
    లుండంగ వలెననదగునె? యుల్లాసములన్
    దండిగఁ బెంచుచు ముంగిటి
    నిండుగ వెలిగెడు పటాకు నిక్కము మేలౌ.

    మిస్సన్నగారు,
    బాంబులు కోరలేదు.వెల్గుల చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులను వద్దనవద్దని మాత్రమే మనవి.
    మొదటి పద్యములో ఎన్ని తప్పులున్నాయో తెలియలేదు.
    రెండవపద్యములో భావము సరిగ్గా చెప్పినానో లేదో తెలియలేదు.
    చివరికి వచనము నాశ్రయించితిని.

    రిప్లయితొలగించండి
  22. ఆశ్వీజ మాసము అంతమయ్యే వేళ పండుగ శోభతో పరిఢ విల్లు
    మంగళ స్నానాలు మంజుల గీతాలు కట్నాలు కానుకల్ కనుల విందు
    పులిహోర ,బొబ్బట్లు మురిపించు శాఖముల్ భోజన ప్రియులకు బొజ్జ నింపు
    దీప కాంతుల చేత దీపించు భవనాలు "కాకర వత్తుల" కాంతి పుటలు
    మున్ను అల్లుళ్ళ అలుకలు ముచ్చటగను
    "బాపు"బొమ్మల నవ్వుల బాణ సంచ
    "బాంబు"పేల్చెడి సరదాల బావ గార్లు
    తార జువ్వలు వెలిగించు తార లంత
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. దీపావళి నాడు కాకకపోతే యింకెప్పుడు ?
    పిల్లలూ - పేల్చుకోండి

    ఉల్లాస మెగయ నిండుగ
    నుల్లము నుప్పొంగు నటుల - నుత్సాహంబున్
    పిల్లలు గంతులు వేయుచు
    పెళ్ళున టప్పాసు లన్ని - ప్రేల్చగ వలయున్ !

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మీ దేవి గారూ! ధన్యవాదాలు.
    నా అభిప్రాయం కూడా భయంకరమైనవీ, ప్రమాదకరమైనవీ వద్దని మాత్రమే.
    దీపాల శోభను ఎత్తి చూపా నంతే.

    రిప్లయితొలగించండి
  25. కోరుప్రోలు వారి పద్యం లోని భావం హృద్యంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  26. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ఛందోభాషణలో ఏ దోషమూ లేదు. స్వస్తి!
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్నగారు, గురువుగారు,
    సంతోషమండి.మీకూ, మరి అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  28. లక్ష్మీదేవి గారు , మీ ఉత్పలమాలలో ' తోడి వాండ్రతో ' అనండి. తోటి వాండ్రతో అంటే అనిష్టార్థ ద్యోతకమవుతుంది .

    రిప్లయితొలగించండి
  29. సరేనండి,అనేక ధన్యవాదాలు.

    పిల్లలు నేడదేమొ మరి వీడిరి యాటల, తోడివాండ్రతో
    నల్లరి మాని పెట్టెలనె యంటుకు కూర్చుని యుంద్రు. నేటిదే
    యెల్లరు మెచ్చుపండగగు, నేలొకొ పల్మఱు హెచ్చరించుటల్,
    డొల్లగ స్వచ్ఛతల్ భువిని డుంకునటంచు నిరోధవాచ్యముల్?

    రిప్లయితొలగించండి
  30. మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు
    మిస్సన్న గారికి ధన్యవాదములు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  31. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు!
    దీపావళి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  32. పూజ్యగురుదేవులకు, గురుతుల్యులు, మిత్రులు, బ్లాగు వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలతో. .

    రేపటియాశలు నింపుచు
    చూపరులకు విందుచేసి శోభను గూర్చున్
    దీపావళి పర్వంబున
    గోపాలా శాంతినిమ్ము కువలయమందున్!!!

    రిప్లయితొలగించండి
  33. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. మూడవ లైను సవరణతో

    దీపపు కాంతిలేక బలు దీమము లన్నిట నంధకారమే
    క్రాపగ పాడియౌనె? యట క్షామము దీర్చియు వారి చింతలన్
    బాపియు భాగదేయములవశ్యమమర్చగ సన్నుతించెదన్
    గోప కిశోరునార్త జన గోపుని మాపటివేళ హేళినిన్

    రిప్లయితొలగించండి
  35. దీపాల వరుసతో దీపావళి దినము
    దేదీప్యమానమై తేజమిచ్చు
    ముంగిట ముగ్గులు ముద్దుగుమ్మలు వేయ
    వర్ణశోభితమయి వాసినిచ్చు
    ఆకాశదీపమ్ము లల్లంత యెత్తున
    శోభాయమానమై శుభమునిచ్చు
    తిమిరాంధకారమ్ము దీపాల వెలుగులో
    నంతమై ప్రజలకు హాయినిచ్చు

    బాణసంచాను గాల్చక ప్రమిదలోని
    వత్తులను వెలిగించిన ప్రబలు ప్రభలు
    శబ్ద,వాయుకాలుష్యముల్ జరుగకుండ
    సిరుల దీపావళిని యింట జేసుకొనుము!

    రిప్లయితొలగించండి
  36. ప్రమిదల వెలుగులు ప్రసరింప ప్రకటీకృ
    త హరుసమున ముంగిట ప్రమద నడయాడ
    సకల సౌభాగ్యములమరి శాంతి వెలసె
    నరకుని హతమార్చగ నంత నవని వెల్గె

    రిప్లయితొలగించండి