5, అక్టోబర్ 2014, ఆదివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 102


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      చని (వెస భూమి శ్రీ గదల సద్వసుధాజనదూరుఁ డేచి, పా
యని ధృతిఁ బో)ర నేసెను మహాస్త్రము లాకపు లుల్క, వానికిన్
వన (టెసగంగ గంతుగొనె వాయుసుతోరుహతుండునై సుయో
ధనబలుఁడున్) ఖలుం డధికధైర్యసమేతుఁడు ఖడ్గరోముఁడున్. (౧౧౭)

భారతము-
కం.       వెస భూమి శ్రీగద లస
ద్వసుధాజనదూరుఁ డేచి, పాయని ధృతిఁ బో
టెసగంగ గంతుగొనె వా
యుసుతోరుహతుండునై సుయోధనబలుఁడున్. (౧౧౭)

టీక- (రా) కదల = కదలగా; (భా) గద = గదయను నాయుధముతో; (రా) వాయుసుతు = హనుమంతునిచే, ఉరుహతుండునై; (భా) వాయుసుతు = భీమునిచే, ఊరుహతుండునై = తొడలు విఱగ కొట్టబడినవాఁడై; సుయోధన = (రా) మంచియోధుఁడు; ఏచి = విజృంభించి; ఉల్క = భయపడునట్లు; గంతుకొనె = చచ్చెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి