1, అక్టోబర్ 2014, బుధవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 98


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      దణి ఘననాదుఁడున్ (మిగిలెఁ దాననిశత్రుల మించి; చంపె) ల
క్ష్మణుఁడును వానినిన్; (వినియెఁ జానగుపుత్రుఁడు బిద్దె నంచు) దు
ర్గుణుఁడగు నింద్రజిద్(గురుఁడు; గూడె నతండును గోడు; వాని)దౌ
రణకృతి సైన్యముం (బొలిపె రాముఁడు సైన్యవిభుండు హెచ్చు)కాన్. (౧౧౩)

భారతము-
గీ.         మిగిలెఁ దాననిశత్రుల మించి చంపె;
వినియెఁ జానగుపుత్రుఁడు బిద్దె నంచు
గురుఁడు; గూడె నతండును గోడు; వాని
బొలిపె రాముఁడు సైన్యవిభుండు హెచ్చు. (౧౧౩)

టీక- (రా) ఇంద్రజిద్గురుఁడు = రావణుఁడు, సైన్యవిభుండు = నీలుఁడు, హెచ్చు, కాన్ = కాగా- అనగా సంతోషింపగా; (భా) గురుఁడు = ద్రోణుఁడు, సైన్యవిభుండు = ధృష్టద్యుమ్నుఁడు, దణి = ప్రభువు; జానగు = ఒప్పుచుండు; బిద్దుట = చనిపోవుట; కృతి = సమర్థత; పొలిపె = చంపెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి