జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * "మనతెలుగు" చంద్రశేఖర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ 1, 2 పాదాలలో గణదోషం. సవరించండి. రెండవ పూరణలో "దుష్కృత్యతదియ" అర్థం కాలేదు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సజ్జనున్ + చారుదత్తుని = సజ్జనుం జారుదత్తుని’ అవుతుంది. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ సవరించిన పూరణలు బాగున్నవి. కాని ‘దుష్కృత్యత + అదియ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
దుష్ట వర్తనమవినీతి తొండి స్వార్థ
రిప్లయితొలగించండిజీవనంబు స్త్రీ వ్యామోహ చిహ్నముగను
నీచుడై తానిలిచి నేటి నేతలకును
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె!!
ఆట విడుపుకై వింతగ మాట లాడి
రిప్లయితొలగించండిమృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె
రాజకీయ శకారుల రభస సిగ్గు
చేటు తప్పదది మనకు చివరి వరకు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమృచ్ఛ కటిక శకారుడు మేలు జేసె
రిప్లయితొలగించండిననుట యెండమావుల నీరమందెననుటె
యిసుక తైలంబునిచ్చునే యెప్పుడైన
మార్చ సాధ్యమె మూర్ఖుల మానసమును
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. నిన్నటి నా పూరణలో ఉత్పలమాలను కూడా పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండిఅన్ని తెలిసిన యట్లుగా నాడి మాట
రిప్లయితొలగించండిపిచ్చి కూతల కూయుచు రెచ్చి పోవు
వారి బోల్చగ పనితప్పె పేరు వెదుక
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
"మనతెలుగు" చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ 1, 2 పాదాలలో గణదోషం. సవరించండి.
రెండవ పూరణలో "దుష్కృత్యతదియ" అర్థం కాలేదు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిసజ్జనుం చారుదత్తుని చంప నెంచె
రేని బావమరది గుణహీనుడతడు
“మృచ్ఛకటిక” శకారుడు
మేలు జేసె చారుదత్తుడు వానికి ధీరుడనగా
కేంబాయి వేంకట తిమ్మాజీ రావు
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిసజ్జనుం చారుదత్తుని చంప నెంచె
రేని బావమరది గుణహీనుడతడు
“మృచ్ఛకటిక” శకారుడు
మేలు జేసె చారుదత్తుడు వానికి ధీరుడనగా
కేంబాయి వేంకట తిమ్మాజీ రావు
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిసజ్జనుం చారుదత్తుని చంప నెంచె
రేని బావమరది గుణహీనుడతడు
“మృచ్ఛకటిక” శకారుడు
మేలు జేసె చారుదత్తుడు వానికి ధీరుడనగా
కేంబాయి వేంకట తిమ్మాజీ రావు
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె
రిప్లయితొలగించండిపాత్ర మెరయగ రచయిత విభవ మెగయు
నన్న సత్యము దెలుపగ, మన్న నంద
బాధ్యతాయుత రచనలె బారు దీరు
మిత్రులకు నమస్కారములు.
రిప్లయితొలగించండిఅల శవర్ణ మెంతటి వక్రమౌనొ, యంత
వక్రబుద్ధియయ్యునుఁ దానె పఱఁగఁ జారు
దత్తుని వసంతసేన చెంతకునుఁ జేర్చి,
మృచ్ఛకటిక శకారుఁడు మేలుఁ జేసె!!
బావమరిది ననుచు లేనిబలము జూపు
రిప్లయితొలగించండిమృచ్ఛకటిక శకారుడు ;మేలు జేసె,
రచయితైనట్టి శూద్రక రాజు నాడు
పీడకలిగించు జనులను వీడు డనుచు.
గురువుగారికి,దోషములు సవరించి మళ్ళీ పోస్టు చేస్తున్నాను.
రిప్లయితొలగించండివేగ పూరింపను సమస్య వీలునయ్యె
విరుపులేకను చేయంగ, వెర్రితనపు
వానిమాటల నడ్డుగా వాడుకొనగ,
మృచ్ఛకటిక శకారుడు మేలుజేసె!
తాను జేసిన దుష్కృత్యతదియ దాచ (దుష్కృత్యత+అదియ)
కతడు,విశదము నవివేక కార్యములను
పరగ జేసెను,న్యాయాధిపతుల కడకు
మృచ్ఛకటిక శకారుడు మేలుజేసె!
హాస్య రసమును పండింప హావ,భావ
ములను,వానిదౌ పాత్రచే ముదిత గతిని
శూద్రకుండటు ,క్ఱొత్తగా చూపె,మనకు
మృచ్ఛకటిక శకారుడు మేలుజేసె
మూర్ఖుడయ్యును శాస్త్రజ్ఞు మోహమంది
శ్యాలకుండౌట రాజుకు చాలచెడుగ
వర్తనంబున వానికి వాడె చెడియు,
మృచ్ఛకటిక శకారుడు మేలుజేసె!
కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సజ్జనున్ + చారుదత్తుని = సజ్జనుం జారుదత్తుని’ అవుతుంది.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ సవరించిన పూరణలు బాగున్నవి. కాని ‘దుష్కృత్యత + అదియ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.