15, అక్టోబర్ 2014, బుధవారం

పద్యరచన - 707

కవిమిత్రులారా,

మొన్నటి విశాఖపట్టణపు టందాలు... నేడు?
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. అందంబుల నిలయంబౌ
    సుందర నగరంబు నేడు సొంపులు చెడగా
    చిందర వందర బ్రతుకై
    నెందరికి హుదుహుదు వలన యిండ్లే పోయెన్

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. చిన్న సవరణ తో
    అందంబుల నిలయంబౌ
    సుందర నగరంబు నేడు సొంపులు చెడెగా !
    చిందర వందర బ్రతుకై
    యెందరికో యిండ్లు పోయె నేమి హుదుహుదో !

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    విశాఖ - నాడు - నేడు :

    01)
    ____________________________

    చిందఱవందఱ నొందిన
    సుందర వనమగు యశోక - సుడివడు సరణిన్
    కుందెను విశాఖ నగరమె
    యందము చందము నశించ - నతలకుతలమై !
    ____________________________
    అతలకుతలము = చెదరిపోవుట,Disorder

    రిప్లయితొలగించండి
  5. హుద్‌హుద్ తుఫానుతో - వైజాగు :

    02)
    ____________________________

    పంచభూతము లన్నియూ - పగను రగిలి
    పట్టణంబును సాంతము - కుట్టికుడుప
    పాడి పంటలు పశువుల - జాడ లేక
    మట్టి కరచెను వైజాగు - పట్టణంబు

    కుంభవృష్టులు గాలితో - కూడి కురువ
    ఇండ్లు కూలెను ప్రజ కడ - గండ్లు వడగ !
    తిండినీరును లేకుండ - నుండ జనులు
    మట్టి కరచెను వైజాగు - పట్టణంబు

    నేల రాలెను వృక్షము - ల్గాలి వలన !
    స్తంభమును దప్పె విద్యుత్తు - స్తంభములును
    యంధకారము క్రమ్మెను - బంధురముగ
    మట్టి కరచెను వైజాగు - పట్టణంబు

    రోడ్ల పాలైరి జనులంత ! - రోడ్లు క్రుంగ
    వాహనంబులు తిరుగాడె - నూహ లోనె
    దూరభాషిను లవికూడ - దూరమౌట
    మట్టి కరచెను వైజాగు - పట్టణంబు

    రైలు బస్సు విమానపు - రాకపోక
    లన్ని నిలచెను జనులంత - ఖిన్నులయిరి
    కుంద ప్రజలంత కన్నీరు - సింధువైన
    మట్టి కరచెను వైజాగు - పట్టణంబు
    ____________________________
    స్తంభము = స్థిరము
    బంధురము = దట్టమైనది

    రిప్లయితొలగించండి
  6. హుద్‌హుద్ తుఫాను తదుపరి - విశాఖ :

    07)
    ____________________________

    ఏ చోట గాంచిన - నేడ్పులు బొబ్బలు
    జీవకళను దప్పె - నీ విశాఖ !

    ఏ వీధి జూచిన - నిబ్బంది యదె ముందు
    జీవకళను దప్పె - నీ విశాఖ !

    ఏ వాడ బోయిన - నెర లేదు జల లేదు
    జీవకళను దప్పె - నీ విశాఖ !

    ఏ యిల్లు తిరిగిన - నీశాన మది లేదు
    జీవకళను దప్పె - నీ విశాఖ !

    ఇన్ని కష్టములకు - నేమి కారణ మగు ?
    నెవ్వ రాప గలరు - యిట్టి శిక్ష ?
    ఇడుము లెటుల దీరు ? - నేమగు నిక ముందు ?
    నెవ్వ రాదు కొంద్రు ? - యీశ్వరేచ్ఛ !
    ____________________________
    ఎర = ఆహారము
    ఈశానము = కాంతి(విద్యుత్తు)

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    హుదుహుదు వల్ల రూపుచెడిన విశాఖను ‘మట్టి కఱచెను వైజాగు పట్టణంబు, జీవకళను దప్పె నీ విశాఖ’ అంటూ కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఈ అలజడులకు కారణం - పాప భార ప్రభావమా ? :

    08)
    ____________________________

    కర్మాసంచిత పాప వర్తనము ని - క్కష్టంబు దోపించెనా ?
    దుర్మోహంబున నీచ మానవులదే - దుర్మార్గ యాలోచనన్
    ధర్మంబీవిధి నేల గూలబడ, పో - దా భూమిపై భారమే ?
    నిర్మోహంబుగ నిశ్చలాత్మ గొని యా - నిర్మాల్యమున్ దీసి యీ
    మర్మం బెవ్వ డెరుంగునో యతని శ్రీ - మల్లారి నర్చించినన్
    నిర్మాణంబగు; పాప కర్మలను పో - నీ యంచు వర్జించినన్ !
    ____________________________
    మల్లారి = శివుడు

    రిప్లయితొలగించండి
  9. ప్రకృతి యొసంగ పచ్చని ప్రభల్ వెలుగొందుచునుండునిచ్చటన్
    వికలముఁ జేసె నేలనొకొ ,పెద్దవియైనయనేక చెట్ల, తా
    నొక చిరు వేటుకూల్చె ,మరి యొక్క మహా ప్రళయమ్ముఁ దెచ్చుచున్
    సకలముఁ బాగుజేయనిక శక్తులఁ నిప్పుడుఁ గూడకట్టుమా!

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమ:

    నిన్న

    ఆశల నగరము వైజాగ్
    దేశమునన్ సహజమైన తీరము కలదై
    క్లేశంబుల నెదిరించుచు
    శాశించెను కడలినైన సాహసి యగుచున్

    నేడు

    మ్రానులు కూలిపోయినవి మారుత తీవ్రత నోపజాలకన్
    వానలు తీవ్రమాయె ఘనవారిధిలో సుడిగుండమేర్పడన్
    దీనములాయనే బ్రతుకు దీరులు మారగ నేడు దైవమా
    హూనము జేసె జూడగను హుద్ హుదనుప్పెన మా విశాఖనే.

    రేపు

    ఐనను కృంగక వడిగా
    నానాటికి వృద్ధిచెందు నగరంబగుచు
    న్నేనాటికైన నిలచును
    వైనముగా మా విశాఖపట్టణమెపుడున్

    ఐనము = ఉపాయము

    రిప్లయితొలగించండి
  11. పలుబాధలు గలిగించెను
    చెలరేగిన పెను తుఫాను చీకటి జేసెన్!
    మిలమిలలాడు విశాఖను
    కలతల బడవేసి పోయె కర్కశ హుదుహుద్!

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కర్మసంచిత’మున్నది కాని ‘కర్మాసంచిత"..?
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘శాసించు’... శాశించు అయింది?
    రెండవ పద్యంలో ‘అను + ఉప్పెన’ అను నుప్పెన అవుతుంది.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అందమగు నగరమ్మగు నావిశాఖ
    నకట! నాశన మొనరించె నాహుదూదు
    కొంప లెన్నియో గాలికిఁ గూలిపోయె
    పేద ప్రాణాలు కబళించె పెనుతుఫాను
    బ్రతుకు తెరువును గోల్పోయి బడుగు జనులు
    కాచు వారికై యాశగాఁ జూచు చుండ్రి

    రిప్లయితొలగించండి
  14. నీట మునగ సర్వస్వము
    కూటికి గుడ్డకు నిలువగ గూటికి కరువై
    కాటిని దలపించు నదే
    మాటల కందక, హుదుద్ని మరువగ తరమే!

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా !
    ధర్మ+రావు = ధర్మారావు
    గౌరి+దేవి = గౌరీదేవి
    లక్ష్మి+పతి = లక్ష్మీపతి
    ఐనటుల
    కర్మ+సంచిత = కర్మాసంచిత
    మన్నమాట !
    "మూర్ఖరాభణు" డన్న మాటను కాళిదాసు సమర్థించినట్టున్నదా ?!

    ఏక వాక్య కథ :
    పూర్వం పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాని పేద బ్రాహ్మణు డొకడు రాజాశ్రయము
    గోరి కాళిదాసును కలిస్తే సరే , సభలోనీవు మౌనంగా నున్నట్లైన , నీకు
    రాజానుగ్రహము కలిగేలా ప్రయత్నిస్తానని చెప్పిన కాళిదాసు
    వానిని సభకు తీసుకొని వెళ్ళిన సమయములో సభలో
    రామాయణముపై జరుగుతున్న చర్చను విన్న బ్రాహ్మణుడు
    ఊరికే ఉండలేక "ఆ మూర్ఖ రాభణుడా " అని యనగా
    ఈ మూర్ఖు డెవడన్నట్టుగా భోజరాజు కాళిదాసు వైపు చూస్తే

    భకారో కుంభకర్ణశ్చ - భకారశ్చ విభీషణః
    త్రయోర్ జ్యేష్టః కులశ్రేష్టః - రాభణో నచ రావణః

    మహారాజా " కుబేరుడు,కుంభకర్ణుడు,విభీషణుడు సోదరులైన వాని
    పేరు రాభణుడే ఔతుందని ఈ పండిత మహాశయుల గట్టి నమ్మక
    మని కాళిదాసు సమర్థించి ఆ బ్రాహ్మణునికి సన్మానం జరిపిస్తాడు !

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా !
    నన్ను సందిగ్ధములో పడవైచి
    మీరు చేతులెత్తేస్తే యెలా !

    నా సందిగ్ధం తొలగించండి !

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా !
    ఈ పాదములో యతి
    "జయోస్తు "లో సంధికార్యము వివరించండి

    ది/వ్యామృత మాచరింపుము, “జయోస్తు” కుమార! శిరస్సుపై అహిం/సా

    రిప్లయితొలగించండి
  19. నీట మునగ సర్వస్వము
    కూటికి గుడ్డకు నిలువగ గూటికి కరువై
    కాటిని దలపించు నదే
    మాటల కందక, హుదుద్ని మరువగ తరమే!

    రిప్లయితొలగించండి
  20. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ‘ధర్మారావు’ నామవాచకం. దాని గురించి చర్చ అవసరం లేదు.
    ‘గౌరి, లక్ష్మి’ రెండూ ఈకారాంత స్త్రీలింగ పదాలు. సమాసంలో ‘గౌరీదేవి, లక్ష్మీపతి’ అవుతాయి. కాని ‘కర్మ’ నపుంసకలింగ శబ్దం. సమాసంలో అది దీర్ఘంగా మారదు. కర్మఫలము, కర్మచ్యుతి మొ||
    ‘జయః + అస్తు = జయోऽస్తు, నమః + అస్తు = నమోऽస్తు’ ఇక్కడ ఉభయయతిగా అకార, ఓకారాలకు యతి వెయ్యవచ్చు.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా !
    సందేహములు తీర్చినందులకు
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యులకు ధన్యవాదములతో :

    08అ)
    ____________________________

    కర్మోద్దీప్తపు పాప వర్తనము ని - క్కష్టంబు దోపించెనా ?
    దుర్మోహంబున నీచ మానవులదే - దుర్మార్గ యాలోచనన్
    ధర్మంబీవిధి నేల గూలబడ, పో - దా భూమిపై భారమే ?
    నిర్మోహంబుగ నిశ్చలాత్మ గొని యా - నిర్మాల్యమున్ దీసి యీ
    మర్మం బెవ్వ డెరుంగునో యతని శ్రీ - మల్లారి నర్చించినన్
    నిర్మాణంబగు; పాప కర్మలను పో - నీ యంచు వర్జించినన్ !
    ____________________________
    మల్లారి = శివుడు
    ఉద్దీప్తము = హెచ్చినది

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి నమస్సులు. ఆత్రములో పొరపాటు దొర్లినది.
    మొదటి పద్యమును క్రింది విధముగా సవరిస్తున్నాను.

    ఆశల నగరము వైజాగ్
    దేశమునన్ సహజమైన తీరము కలదై
    క్లేశంబుల నెదిరించుచు
    కౌశలమున నిల్చె పురము గంభీరముగాన్

    కౌశలము = నేర్పరితనము

    రెండవ పద్యమును క్రిందివిధముగా సవరిస్తున్నాను.

    మ్రానులు కూలిపోయినవి మారుత తీవ్రత నోపజాలకన్
    వానలు తీవ్రమాయె ఘనవారిధిలో సుడిగుండమేర్పడన్
    దీనములాయనే బ్రతుకు దీరులు మారగ నేడు దైవమా
    హీనము జేసె హుద్ హుదము హేళనగా నిటు మా విశాఖనే

    రిప్లయితొలగించండి
  24. శ్రీ వసంత కిశోర్ గారికి నమస్సులు. విశాఖ విపత్తును గూర్చి మీరు కరుణ రసముతో వ్రాసిన తేటగీతులు, సీసములు, విమర్శనాత్మక దృష్టితో వ్రాసిన శార్ధూల వృత్తము చాలా బాగున్నయి.

    రిప్లయితొలగించండి
  25. శ్రీపతిశాస్త్రిగారికి ధన్యవాదములు !

    విశాఖతో యెన్నో యేళ్ళుగా నున్న అనుబంధమది !
    విశాఖ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష !

    మీ కంద, ఉత్పలములు కూడా చక్కగా నున్నవి !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి