22, అక్టోబర్ 2014, బుధవారం

న్యస్తాక్షరి - 11

అంశం- దీపావళి.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’.
(పదవ అక్షరం గురువు కావాలి. అంటే ‘వ’ తర్వాత ద్విత్వసంయుక్తాక్షరాలలో ఏదో ఒకటి ఉండాలని గమనించ మనవి)

36 కామెంట్‌లు:

  1. మాష్టారు ఉత్పలమాలలో రెండవపాదం ఐదవ అక్షరం పా (గురువు) రాదు కదా !

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా !
    మీరిచ్చిన "ఉత్పలమాలను - చంపకమాలగను
    మొదటి పాదంలో మొదటి అక్షరం "దీ" ని - "ది" గా మార్చుకొని
    పూరించు చున్నాను !
    అనుమతించమని వినతి !

    *****
    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    దీపావళి :

    01)
    ___________________________

    దినకరు డస్తమించు తరి - దీపపు కాంతులు మిన్ను నంటగా
    వనితల పాటవంబునను; - పాల సముద్రపు రాచకన్యనే
    వనమున తీర్థమాడి నిజ - వస్త్రము లందరు దాల్చి భక్తితో
    దనియుదు రర్చన న్పలు మ - తాబుల గాల్చుచు దివ్వెలాళినిన్ !
    ___________________________
    తరి = సమయము , వళి
    తనరు = అతిశయించు
    వనము = జలము
    తీర్థమాడు = స్నానమాడు
    నిజ = తనది
    అందరు = కుటుంబము
    మతాబు = బాణసంచా
    ఆళి = పఙ్క్తి;వరుస

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా !
    మీరిచ్చిన దానినే కొద్దిగా మార్చుకొని
    పూరించు చున్నాను !
    అనుమతించమని వినతి !

    రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
    మూడవ పాదంలో పదియవ అక్షరం ‘వ’,

    *****
    దేవకి పార్వతీశములు - భార్యాభర్తలు
    పావన మూర్తి, వల్లభరాయలు - అల్లరి పిల్లలు
    వాళ్ళింట్లో దీపావళి - ఎలా జరిగినదంటే :

    02)
    _____________________________________

    దీవెన లంది లక్ష్మి కడ - దీపపు పంక్తులు దీప్తి నివ్వగా
    దేవకి పార్వతీశములు - దిగ్గున దిక్కులు పిక్కటిల్లగా
    పావన మూర్తితో కలసి - వల్లభరాయలు వెంట నుండగా
    వావిరియౌ టపాసులను - ధ్వంసమొనర్చిరి దివ్వెలావళిన్
    _____________________________________
    వావిరి = శ్రేష్ఠము
    టపాసులు = దీపావళి పండుగనాటి రాత్రి కాల్చునట్టి బాణసంచా విశేషము.

    రిప్లయితొలగించండి
  4. కవిమిత్రులు మన్నించాలి.
    రాత్రి న్యస్తాక్షరిని ఇస్తూ ఉత్పలమాల అనుకొని మొదటి అక్షరం సరిగానే ఇచ్చాను. ఆ తరువాత నా మనస్సులో చంపకమాల వచ్చి చేరి గందరగోళం చేసింది. జరిగిన పొరపాటుకు మన్నించండి. సవరించాను.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణను పందొమ్మిదవ అక్షరంగా ళి వేసి సవరించండి.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! శుభోదయం !
    మరియు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యుల సూచనతో :

    అంశం- దీపావళి.
    ఛందస్సు- ఉత్పలమాల.
    మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’,
    రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
    మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’,
    నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’.

    దేవకి పార్వతీశములు - భార్యాభర్తలు
    పావన మూర్తి, వల్లభరాయలు - అల్లరి పిల్లలు
    వాళ్ళింట్లో దీపావళి - ఎలా జరిగినదంటే :

    02అ)
    _____________________________________

    దీవెన లంది లక్ష్మి కడ - దీపపు పంక్తులు దీప్తి నివ్వగా
    దేవకి పార్వతీశములు - దిగ్గున దిక్కులు పిక్కటిల్లగా
    పావన మూర్తితో కలసి - వల్లభరాయలు వెంట నుండగా
    వావిరియౌ టపాసులను - ధ్వంసమొనర్చిరి దివ్వెలాళినిన్ !
    _____________________________________
    వావిరి = శ్రేష్ఠము
    టపాసులు = దీపావళి పండుగనాటి రాత్రి కాల్చునట్టి బాణసంచా విశేషము.

    రిప్లయితొలగించండి
  7. దీపపు కాంతి ధారలటు దీపిత మయ్యె ధరాతలమ్మునన్,
    శాపము పాపముల్ దొలగి శాంతము వచ్చెను లోకమంతటన్,
    పాపపు రాక్షసున్ దునుమ వర్ధిత మందుచు వర్తమానమున్
    ఆపద లన్నియున్ దొలగు అన్నుల మిన్నుగ మానవాళికిన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  8. దీపములన్ని తీరుగ పదింతల వెల్గులనిచ్చుచుండగా
    పాపుల పాతకమ్ముల టపాసులు ప్రేల్చినయట్లు ప్రేల్చగా
    నా పరదైవతమ్ము; నవ వర్షములొక్కెడ నాచరించుచున్
    లోపము లేని పండుగని లోకులు మెచ్చిరి దీపయాళినిన్.

    రిప్లయితొలగించండి
  9. దీపములెన్నొ వెల్గి శశి దీపము భూమికి రాత్రి వచ్చెగా
    పాపమె పారద్రోలి ధర బంచగ పుణ్యపు కాంతు లిఛ్ఛటన్
    పాపిని భూసుతున్ దునుమి చ్చిన కృష్ణుని సత్యభామనే
    కాపుగ దల్చి గొల్తురిల గాంచుడి మోదమునన్ జనాళినే.

    రిప్లయితొలగించండి
  10. దీపము లన్నియున్ కొలువు దీర్చిన రీతిని నంగనా మణుల్
    ' బాపుము పాపముల్ ప్రమిద బాయక జ్యోతి! సదా హితైషివై
    ప్రాపువు నీవె మాకనుచు ' వన్నెల నీనెడు రీతి పేర్చి రా
    నైపుణి చూడ ముచ్చటగు నవ్య సుశోభల దీప కేళిలో.

    రిప్లయితొలగించండి
  11. దీకొని చెచ్చెరన్ నరకుదేహము ఖండన సల్పి సత్య భూ
    భారము పాపె పార్థసఖువాహన మందున నిల్చి తాను ఆ
    వారిజ లోచనన్ మునులు వజ్రియు దేవతలంత మెచ్చగన్
    ధారణి పుత్రుచావుగని ధాత్రి జనంబులు సల్పె కేళికల్

    కేళిక: నృత్యము, దీకొని: ఎదిరించి.

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దీప + ఆళి = దీపాళి’ అవుతుంది. వసంత కిశోర్ గారి లాగా ‘దివ్వెల + ఆళి = దివ్వె లాళినిన్’ అంటే బాగుంటుందేమో?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. దీపము లెన్నియో వెలిగె. దీప్తము నయ్యెను లోకమంతయున్
    పాప, టపాసులన్ మిగుల భాసిలు తోషము తోడ కాల్చగా
    వ్యాపము నయ్యె భూమినటు వర్తిలు పూజలు లక్ష్మి దేవికిన్
    వే, పరువెట్టె చీకటది, వెల్గు మతాబుల కాంతి, ధూళికిన్

    దీనమునయ్యెగా బ్రతుకు, దేవ, మునీంద్రుల కెల్ల, కాంతలున్
    హీనపు పాటులానరకు హేయపు చేష్టల నందియుండగా,
    వానిని సత్యచేతనటు వధ్యుని కాగనుఁ జేయనింపుగా
    భూ, నభ మధ్య మంతయును, పూసెను. వెల్గు టపాసు కేళిచే

    రిప్లయితొలగించండి
  14. దీపఁపుకాంతిశోభ సముదీర్ణపరంపరమై చెలంగి యు
    ద్దీపిత పాలకోత్తముల దివ్యకరంబుల నవ్యతేజమై
    ప్రాపును సత్ప్రవర్తనము వర్ధిలజేయవె భారతావనీ
    స్థాపిత ధర్మకార్యములు సర్వజగత్తున మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గోలి గారికి నమస్కారములు పారద్రోలి అన్నపుడు ర గురువు అవుతుంది కదా?
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    దీపము ప్రాణమై వెలుగు దేహములందున దైవసన్నిదిన్
    దీపము పావనమ్మవగ దీపములన్ బలి యివ్వబూనె నా
    పాపి ధరాత్మజుండు తను వర్దిలగా నిక సత్యభామతో
    గోపుడు చక్రధార నరకున్ వధియించె దివాలి హాళిగా

    రిప్లయితొలగించండి
  17. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘వ్యాపము’ అన్నారు. ‘వ్యాపనము, వ్యాప్తము’ ఉన్నాయి. ‘వ్యాపన మయ్యె’ అంటే సరిపోతుందనుకుంటాను.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కొరుప్రోలు వారూ,
    ‘పారద్రోలి’ అన్నప్పుడు ‘ర’ గురువు కాదు. లఘువే. అది నిజానికి (పారఁద్రోలి). ‘పారన్ + త్రోలి = పారంద్రోలి, పారఁద్రోలి, పారన్ద్రోలి’
    *
    కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. దీపము లన్నియున్ వెలిగి దేశము లెల్లెడ కాంతినింపుచున్
    లోపల పాపముల్ దరిమి లోకుల కోర్కెలన్ని దీర్చుచున్
    పాపఁపుద్రోవ వానికిల చ్చును చేటని చాటిచెప్పుచున్
    తీపిమిఠాయిలన్ నిడుచు దేవిని గొల్చును మానవాళియే!!!

    రిప్లయితొలగించండి
  19. శ్రీగురుభ్యోనమ:

    దీపము బ్రహ్మవిష్ణుశివ తేజములన్ గల దివ్య రూపమై
    తాపము పాపమున్ దమము దాయము లెల్ల తొలంగి పోవగాన్
    వ్యాపనమొందె విశ్వమున వర్ణకరంబుల కాంతిపుంజమై
    మాపటి వేళ వెల్గులిడు మంచిని పంచుచు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  20. కె.ఈశ్వరప్ప గారి పూరణ
    దీపము యంతటన్ వెలుగ దిక్కులు దోచక రాత్రి వెళ్లగా
    పాపము పారద్రోలగనుపాద్యమునింపుచులక్ష్మి చేరగా
    పాపలు బాణముల్ విడువ వత్సరమంతయు సంతసమ్ము నన్
    మా పురమందు వేడుకలు మక్కువ నింపెను మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  21. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోర్కెలన్ని’ అన్నచోట గణదోషం. ‘కోరిక లన్నియు’ అంటే సరి.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దీపము + అంతటన్’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘దీపము లంతటన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారు,
    ధన్యవాదాలు.

    లోపములేని పండుగ అని వ్రాయడం తప్పనిపించింది. లోపములున్న పండుగలు లేవు నా దృష్టిలో.

    అందుకే చివరి పాదము మార్చి వ్రాస్తున్నాను.

    దీపములన్ని తీరుగ పదింతల వెల్గులనిచ్చుచుండగా
    పాపుల పాతకమ్ముల టపాసులు ప్రేల్చినయట్లు ప్రేల్చగా
    నా పరదైవతమ్ము; నవ వర్షములొక్కెడ నాచరింప నే
    యాపద లేని రీతినిట నాడుచునుంద్రు ప్రకాశకేళినిన్.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులు అన్నపరెడ్డివారి పూరణమందలి ప్రథమపాదమున ప్రాసభంగమైనది. సవరింపఁగలరు.

    రిప్లయితొలగించండి
  24. దీపముఁ బెట్ట లేను మది దీనుల రోదన గుర్తు జేయగన్!
    శాపమొ పాపమో హుదుదు సర్వము దోచగ గుండె జార నా
    పాపుల కళ్లలో వెలుగు వర్ధిలఁ బండుగ!నాడె భవ్యమౌ!
    తాపమదెట్లు పర్వమగు తాడిత పీడిత మానవాళికిన్!

    రిప్లయితొలగించండి
  25. లక్ష్మీదేవి గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. దీవెన లిచ్చు శ్రీ నగవు దివ్వెలు రవ్వల పువ్వులై భువిన్
    జీవిత పాఠముల్ మనకు చెప్పును విచ్చిన చిచ్చు బుడ్డులై
    పావనమైన త్యాగమున వత్తులు కాలిన బాధలేక దీ
    పావళి దివ్య మూర్తులయి పండుగ చేయుచు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  27. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. దీపపు పంక్తులెల్లెడల దివ్యముగా వెలుగివ్వ వాకిటన్
    బాపి యపార చీకటుల పండుగ రోజు ప్రమోదమివ్వగా
    పాపలు పెద్దలందరును వచ్చి టపాసుల గాల్చగా యహో
    చూపులు ద్రిప్పలేని యొక సుందర దృశ్యము మానవాళికిన్!

    రిప్లయితొలగించండి
  29. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘...గాల్చగా నహో’ అనండి.

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులకు నమస్కారము!

    దీనజనావనుండు వసుదేవసుతుండు దురాన ధారుణీ
    సూను నిపాత పాతకుని శూరతఁ దాఁకఁగ, సత్యభామయున్
    వాని నెదుర్కొనన్ జనియు ధ్యునొనర్పఁగ, నాఁడు శీఘ్రమే
    మానవు లుంచ దీపముల, మాల్మిఁ గనెన్ గద దేవతాళియున్!

    రిప్లయితొలగించండి
  31. సవరణతో...

    దీపపు పంక్తు లెల్లెడల దివ్యముగా వెలుగొందుచుండుచున్
    బాపి యపార చీకటుల బండుగ రోజు ప్రమోదమివ్వగా
    పాపల పెద్దలందరును వచ్చి టపాసుల గాల్చగా నహో
    చూపులు ద్రిప్పలేని యొక సుందర దృశ్యము మానవాళికిన్!

    రిప్లయితొలగించండి
  32. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. శ్రీవాణి ( ని పూజించగ
    పావన వేదాధ్యయనపు పాటవ మొప్పన్,
    భావింప నాడచట పో
    టీ వీలుండెనట మునికుటీరములందున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  34. ద్యూత మదియన్న సీతకు దూత గాగ
    పాన మదియన్న మధువగు భక్తి గాగ
    పొసగు రతియన్న అనురాగ పుష్ప మవగ
    ద్యూత మద్యపాన రతులు నీతి పరులు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు03/04/15

    రిప్లయితొలగించండి