14, అక్టోబర్ 2014, మంగళవారం

పద్యరచన - 706

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. కన్నా! యీతల్లికి నీ
    కన్నా యీ లోకమందు గలరెవ్వరురా ?
    యన్నీ నీవే ననుకొని
    నన్నే నే మరచిపోదు నవ్వర నాన్నా!

    రిప్లయితొలగించండి
  2. తనదు యొడిలోన నున్నట్టి తనయు జూచి
    మురియు చుండెను నాతల్లి ముదము తోడ
    కనిన ప్రేగది గాబట్టి కనుల నిండ
    సంత సంబును నింపెను సంతు జూచి

    రిప్లయితొలగించండి
  3. అమ్మపాలుఁద్రావి యిమ్ముగ నొడిలోన
    సేదఁ దీరుచుండె చిట్టి తండ్రి
    వాని నిద్రఁబుచ్చి వంటఁ జేయఁ దలచి
    వేచి యుండెఁ దల్లి ప్రీతితోడ

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !


    మాతృదేవోభవ :

    01)
    _______________________________

    బొజ్జది నిండిన బుజ్జిని
    బుజ్జగపు తన యొడి నుంచి - ముద్దుల నిడుచున్
    యిజ్జగము నెరుగ తల్లియె
    నొజ్జౌ గద ప్రప్రథమము - నోరిమి తోడన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  5. ఇంటి పనులెల్లఁ జేయుచు
    కంటికి పాపగ కొడుకునుఁ గనిపెట్టుచు వె
    న్వెంటనె వృద్ధిగన కలల
    పంటను దీవించు తల్లి! బంగరు తల్లీ!

    రిప్లయితొలగించండి
  6. చిట్టి పాపా! నీదు చిరునవ్వులను జూచి
    .........జాబిల్లి తన మోము చాటు జేయు
    బుల్లి బాబూ! నీదు బుజ్జి చేతిని గన
    .........పూలపొట్లము వోలె ముద్దు గలుగు
    కన్న తండ్రీ! నీదు చిన్ని బొజ్జ సడల
    .........కలతతో నా మది కలవర పడు
    చిన్ని బుజ్జాయి! నీ కన్నుల నీలాలు
    .........కారిన నా గుండె జారి పోవు

    నవ్వు లూరెడు నిను వీడ నా మనస్సు
    సుంత యైనను నోర్వదు చూచి చూచి
    యింటి పని కేగ లేనయ్య యెప్పు డుండు
    నదియె నీ బుల్లి యాటలు నదరు నాకు.



    రిప్లయితొలగించండి
  7. వంటకుపక్రమించి పసిపాపను లాలన చేయు తల్లియై
    కంటికి రెప్పచందమున కాచుచు బిడ్డను నిద్ర బుచ్చగా
    తుంటరి బాలచేష్టలను తొల్లిగ జూచుచు సంబరమ్ముతో
    వంటను విస్మరించినది బాలుని చూపులు మత్తుగొల్పగన్!

    రిప్లయితొలగించండి
  8. కన్న తండ్రీ నీకు కమ్మగా పాలిచ్చి
    ..........నిదుర పొమ్మన్నను నిదుర వోక
    లీలగా చేతులన్ లేలేత పదములన్
    ..........తపతపా యాడించ తగునె నీకు?
    ఉగ్గు నుంగా యంచు బుగ్గల నిండుగా
    ..........సవ్వడుల్ జేయంగ సరియె నీకు?
    నునులేత పెదవులన్ కనుమంచు గుమ్ముగా
    ..........నవ్వుల రువ్వంగ నగునె నీకు

    బోసి నవ్వుల నాటల దూసి యిడుచు
    నమ్మ మనసును దోచంగ నామె పనుల
    నెవరు చేయుదు రో నాన్న యింక నీవు
    నిదుర పోవయ్య కమ్మగా నిర్మలముగ.


    రిప్లయితొలగించండి
  9. నీ చిరునవ్వులు సిరులై
    పూచిన పూలై పరిమళముల పంచితివా!
    చూచిన వారలు చేతులఁ
    జాచరె నిను ముద్దు లాడ సరసిజ నయనా!

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ఈమధ్య మీరు పద్యరచనకే పరిమితమైనట్టున్నారు.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఇడుచున్ + ఇజ్జగము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఇడుచు/ న్నిజ్జగము...’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ సీసపద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ ఉత్పలమాల బాగుంది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చూచరె’...? చూడరె సరియైన రూపం కదా... అక్కడ ‘చూచిరె’ అందామా?

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమ:

    అల్లారు ముద్దు సూనుని
    నుల్లాసముతోడ ప్రేమనూయలలూపన్
    కల్లాకపటం బెరుగని
    తల్లీ నీ సేవ చేత ధన్యుండయ్యెన్.

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ధన్యవాదాలు.
    పిల్లలను తల్లి దగ్గర నుంచి ఎత్తుకోవటానికి
    మనం రమ్మని చేతులు చాచుతాము కదా!
    ఆ పిల్ల వాడు చాలా అందంగా వుండటంతో చూచిన
    వారందరూ బాబును ఎత్తుకొని ముద్దులాడటానికి
    చేతులు చాచెదరను భావంలో తల్లి వున్నట్లు వ్రాశాను. పరిశీలించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  14. మాష్టారు ! నాకు రాత్రి 12 గంటలకి మాత్రమే టైం దొరుకుతున్నది . అందువల్ల పద్యరచన ఒక్కటే సాధ్యపడుతున్నది

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    క్షమించాలి. దృష్టిలోపం వల్ల ‘జా’.. ‘జూ’లాగా కనపడింది.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు ధన్యవాదాలు.
    అయ్యో అంత మాటెందుకండి. మీ వయసులో మా పరిస్థితి ఎలా వుంటుందో?

    రిప్లయితొలగించండి
  17. నినువదలిపోగలనెటుల
    ననునీవిధికట్టివేయ నవ్వులతోడన్
    మనసైనదియాడుకొనగ
    పనులన్నియుమానుచుగడుపగనీతోడన్

    రిప్లయితొలగించండి
  18. బాయిని త్రాగిన నా పా
    పాయీ నిదురైన పోవె, నేనే త్వరగా
    పోయెద నన్నము వండగ
    తీయగ నే జోలపాడి త్రిప్పుదు నిన్నే.

    రిప్లయితొలగించండి