25, అక్టోబర్ 2014, శనివారం

పద్యరచన - 717

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. అందముగా ముస్తాబై
    బిందెలతో నీటి కొరకు బ్రియనేస్తముతో
    నందెల సవ్వడి జేయుచు
    సుందరి జనుచుండ సోకు జూడగ తరమా

    రిప్లయితొలగించండి
  2. భామ లిద్దరు చక్కని మోము తోడ
    నొకరు మించిన నందము నొకరు కలిగి
    యెదురు బదురుగ నిలబడి యేమి యౌను ?
    మాట లాడుచు నుండిరి ? మహతి ! యడుగు .

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కలవరముకు’ అన్నారు. కలవరమునకు అనవలసి ఉంటుంది. అప్పుడు గణదోషం. కనుక ‘కలతపడగ కారణ మెవడో’ అనండి. ‘ఎదురుగున్నా’ అని వ్యావహరికాన్ని ప్రయోగించారు. ‘ఎదుట నున్నను’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  4. పలకరింపులలోనను, వలువ కట్టు
    లోను, పనిపాటలందు, చెలువల సొబగు
    లందు పాతకాలపు గుర్తులరుదులిపుడు
    రుచులునభిరుచులను ప్రాత రోజులెవ్వి?

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నూతికి నీటికి రావే
    మూతిని తిప్పకు మొగమును మూయకు ముసుగున్
    చేతిని బిందొక టున్నది
    ప్రీతిగ నీవున్ మరియొక బిందెను తేవే.

    రిప్లయితొలగించండి

  7. అంతటి సిగ్గేలనె నా
    కంత తెలుసు కలతపడగ కారణమెవడో
    ఎంత యెదురుగున్నను వా
    డింత ముసుగునున్న నిన్ను యేవిధి గనునే

    రిప్లయితొలగించండి
  8. ఏటికి నీరు దేచ్చ్తుటకు నేగుచునుంటివి నొంటిగాను నో
    బోటిరొ కొంగు జాగరత,పున్నమిచంద్రునిబోలుమోముయున్
    సాటిగ లేని వన్నెలును చక్కని రూపము పోరగా౦డ్రు నిన్
    చాటుగ వెంబడి౦చెదరు సాయము రమ్మన వత్తునే సఖీ

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మోమునున్/ సాటియె లేని వన్నెలును...’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. ముదమున కొంగుగప్పుకొని ముచ్చట గొల్పెడు భూషణాలతో
    చెదరని మందహాసమును చిందుచు బిందెను చేత బూనుచున్
    సదనము దాటి నీటికయి సంగతకత్తెలు బావి జాడలో
    కదిలిరి మంచినీటికయి గాజుల సవ్వడి చేయుచుండుచున్

    రిప్లయితొలగించండి
  11. బొడ్దు శంకరయ్య గారూ,
    మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పునరుక్తిని సవరిస్తూ...........

    ముదమున కొంగుగప్పుకొని ముచ్చట గొల్పెడు భూషణాలతో
    చెదరని మందహాసమును చిందుచు బిందెను చేత బూనుచున్
    సదనము దాటి వెళ్ళుచును సంగతకత్తెలు బావి జాడలో
    కదిలిరి మంచినీటికయి గాజుల సవ్వడి చేయుచుండుచున్!

    రిప్లయితొలగించండి
  13. కన్నయ్య చిలిపి చేష్టలు
    విన్నావా వన్నెలాడి! విస్మయ మందున్!
    కన్నియల చీరలన్ గొని
    మన్నింతును మ్రొక్కిననుచు మానే యెక్కెన్!

    రిప్లయితొలగించండి