వసంత కిశోర్ గారూ , మీ పూరణ బాగున్నది. అభినందనలు. కృష్ణానదిని యమున అన్నారేమో అనుకొని పొరబడ్డాను. యమున అంటే పార్వతి అనే అర్థం కూడా ఉంది. బాగుంది. * జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ జహ్ను వదిమన కృష్ణమ్మ జలము చేత వాడ వాడల బయనించు వసతి తోడ డవులు దే ల్చెడి వాణిజ్య దళపు వాడ కొరుప్రోలు రాధా కృష్ణ రావు
బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ జహ్ను వదిమన కృష్ణమ్మ జలము చేత వాడ వాడల బయనించు వసతి తోడ డవులు దే ల్చెడి వాణిజ్య దళపు వాడ కొరుప్రోలు రాధా కృష్ణ రావు
పై పద్యమున నొక చమత్కారము కలదు. నాల్గు పాదములలోని్... మొదటి గణపు మొదటి యక్షరములఁ గలిపిన "బెజవాడ" యని, మూఁడవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "యాంధ్రులకు"నని, యైదవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "రాజధాని"యని చమత్కరించుట జరిగినది.
వర్ణితాంశము విజయవాడ సుగుణమే!
ఇందు దొసఁగు లుండవచ్చును. పాండిత్యప్రకర్శకొఱకుఁ గాక, చమత్కార సాధనకై మాత్రమే నేను దీనిని వ్రాసితిని. కవిమిత్రులు మన్నించి యాదరింపఁగను, దొసఁగులున్న సవరణములు సూచింపఁను మనవి.
కవిమిత్రులకు నమస్కృతులు. ఉదయం హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. పూరణలు పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. * గుండు మధుసూదన్ గారూ, నా అనుపస్థితిలో శ్రమకోర్చి మిత్రుల పూరణ గుణదోషాలను సమీక్షించి, సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు. * మరుపాక రఘుకిశోర్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ రాక ఆనందదాయకం.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింపనున్నవి !
విజయవాడ :
01)
________________________________
బెదురు లేనట్టి వాడది - విజయవాడ
జనుల రక్షింప నటనుండ - జగముతల్లి
వారిరుహనేత్ర,భార్గవి - బాలచంద్ర !
డమరుకము పట్టి శివుడుండ - యమున వెంట
కనకదుర్గమ్మ ప్రజలను - కరుణనేల
బెదురు లేనట్టి వాడది - విజయవాడ !
________________________________
బెరుకు తీర్చెడి దుర్గ శిఖరము పైన
రిప్లయితొలగించండిజనుల దాహము తీర్చు కృష్ణ గలగలలు
వాసికెక్కిన వణిజులు వరి పొలములు
డబ్బు రాదే తెలివితేటలబ్బినంత!!
బెదురు భయములు లేనిది విజయ వాడ
రిప్లయితొలగించండిజనుల రక్షింప దుర్గమ్మ ననున యమున
వారవారము క్రిందకు వచ్చు చుండి
డమరు కమ్ముజే బూనుప రమశి వుడును
నెల్ల వేళల జూచును జల్ల గాను
వసంత కిశోర్ గారూ ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణానదిని యమున అన్నారేమో అనుకొని పొరబడ్డాను. యమున అంటే పార్వతి అనే అర్థం కూడా ఉంది. బాగుంది.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బెట్టుగ ననవరత మెట్టి బెరుకు లేక
రిప్లయితొలగించండిజనులు సోదరులవలెను సంతసముగ
వాడ వాడల నుండుటఁ జూడ గలము
డక్కు సుఖశాంతు లచ్చోట నిక్కముగను
బెట్టుః గౌరవము, డక్కుః దక్కు
బెస్తవారికి, సతతంబు ప్రియము గూర్చు
రిప్లయితొలగించండిజయము లొసగుచు నగరస్థ జనులకెపుడు
వాసి బెంచును విద్వాంసవర్యులకిక
డజను లుగనిచ్చు విజయాలు విజయవాడ
బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ
రిప్లయితొలగించండిజహ్ను వదిమన కృష్ణమ్మ జలము చేత
వాడ వాడల బయనించు వసతి తోడ
డవులు దే ల్చెడి వాణిజ్య దళపు వాడ
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ
రిప్లయితొలగించండిజహ్ను వదిమన కృష్ణమ్మ జలము చేత
వాడ వాడల బయనించు వసతి తోడ
డవులు దే ల్చెడి వాణిజ్య దళపు వాడ
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిబెళుకు నగరము కేంద్రమై విస్తరించె
జయము గూర్చుచు దుర్గమ్మ చలము నిలచె
వాడవాడల కృష్ణమ్మ పారుచుండ
డంబముల జూపు బెజవాడ సంబరములు.
బెళుకు = ప్రకాశించు
కేంద్రము = రాజధాని
డంబము = ప్రతిష్ఠ
సంబరము = సంతోషము
బెగ్గడిల్లని నగరమ్ము విజయవాడ
రిప్లయితొలగించండిజయము లొసగును దుర్గమ్మ జనులకెపుడు
వానియమ్ము నకది మంచి బట్టుగొమ్మ
డబ్బులున్నట్టి పురి జూడ నబ్బురమ్ము!
బెజ్జ వాడందు వేమిరా పిల్లవాడ
రిప్లయితొలగించండిజ యను వర్ణమున్ పలుకక నయము గాను
వారు చెప్పంగ నీకిక వలను గాక
డప్పు వలె వీపు పై కొట్టి చెప్ప వలెనె?
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిబెరుకు లేనట్టి విజయుడు వెల్గె నిచట
జయము గూర్చేటి దుర్గమ్మ చక్కగాను
వాస మింద్రకీలను నుండు వాడ యిదియ
డమరుకము బట్టి మల్లేశు డతడు వెలుగు
బెదర కుండంగ పాలించె బిజ్జలుండు
జయము నందేను పార్ధుడు శంభునెదిరి
వాసి రైళ్లకు కూడలి, బస్సులకును.
డబ్బు వ్యాపార మందించు టంకశాల
బెదర రిచ్చటి వనితలు పెద్దగాను
జయము నందింప స్వాతంత్ర్య సమరమందు
వారి ధనమాన ప్రాణాలు వదిలినారు
డచ్చి దర్పాలు వీడరె టంకరించి
బెట్టి దంబును నైనను వివిధ గతుల
జయము నందంగ జాలిరి సర్వు,లెలమి
వారి గాచెడి దుర్గయు బాగ వెలుగ
డక్క గొట్టియి నిలుతురు చక్కగాను
బెదురు నదురును నెరుగని విజయవాడ
జయము నాంధ్రుల కెల్లను చాల నిచ్చు
వారి పూరంబు కృష్నమ్మ పారునేల
డబ్బు తిరుగాడు వ్యాపార ఠావునిదియె
రిప్లయితొలగించండిబెడగు కృష్ణమ్మ తటిని పృథ్వీధ్రమున వి
జయము చేసె కనకదుర్గ జనుల బ్రోవ
వాసి సిరి సంపదల నిడ "భవ్య"యశము
డమరువునుగొట్టి కీర్తి౦ప నమరవరులు
బెదురు వీడర బెజవాడ పిల్ల వాడ
రిప్లయితొలగించండిజనుల రాజధానిగఁ జేయ చంద్రబాబు
వాసి కెక్కును దేశాన వన్నెబెరిగి
డబ్బు కురియును మీకట దిబ్బ లున్న!
కె.ఈస్వరప్ప.గారి పూరణ
రిప్లయితొలగించండిబెదరుమాన్పెడి దుర్గమ్మసదనమయ్యె
జముపగతుదు సతిగూడిజతగ నుండి
వాణిజులుకవుల్ నేతలు వాసి కెక్కు
డబ్బులున్నట్టి విజయవాడ నగరము
కవిమిత్రులకు నమస్కారములు!
రిప్లయితొలగించండిబెబ్బులిని బండిగాఁ గొని వెలిఁగెడు, వి
జయము లందించి, కాచెడు, జనుల వెత ని
వారణమిడు కనకదుర్గ వదనమునఁ బొ
డమిన మెఱపుచే విజయవాడయె వెలుంగు!!
బెరసు డైనట్టి రక్కసు నరికి జంపి
రిప్లయితొలగించండిజనుల కాచిన తల్లికై జయము కొరకు
వాడవాడల జేజేలు పల్కి, నిరుగ
డలను భక్తులు హారతి వెలుగు లిడరె!
నా ద్వితీయ పూరణము:
రిప్లయితొలగించండిబెడఁగు నడ, వినయాంచిత వీక్ష, రాగ
జన వితరణ, మాంధ్రుల మానసాంబుజ చిర
వాసిత కరుణాలయ దరహాస ధార,
డగ్గఱించెడి కుతుక, మటన కనికరి!!
పై పద్యమున నొక చమత్కారము కలదు.
నాల్గు పాదములలోని్...
మొదటి గణపు మొదటి యక్షరములఁ గలిపిన "బెజవాడ" యని,
మూఁడవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "యాంధ్రులకు"నని,
యైదవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "రాజధాని"యని
చమత్కరించుట జరిగినది.
వర్ణితాంశము విజయవాడ సుగుణమే!
ఇందు దొసఁగు లుండవచ్చును. పాండిత్యప్రకర్శకొఱకుఁ గాక, చమత్కార సాధనకై మాత్రమే నేను దీనిని వ్రాసితిని. కవిమిత్రులు మన్నించి యాదరింపఁగను, దొసఁగులున్న సవరణములు సూచింపఁను మనవి.
బెదురు భయములు లేనిదా విజయ వాడ
రిప్లయితొలగించండిజరుగు నెన్నియో పెండ్లిండ్లు సాయి మఠము
వారి యాధ్వర్యమున నట వారి జాక్ష !
డబ్బు లేకున్న ,నచ్చట యబ్బురమ్ము
మిత్రులారా!
రిప్లయితొలగించండినా పై పూరణా వివరణమునఁ జివరన..."ప్రకర్శ"ను.."ప్రకర్ష"గాఁ బఠింపఁగలరు. తొందరలో దోషము గమనింపకయే ప్రకటించితిని. మన్నింపుఁడు.
మఱియొక విషయము...
కవిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు నేఁడు హైదరాబాదునకుం బోయినందునఁ గవిమిత్రుల పద్యములను సమీక్షింపలేకుంటినని దూరభాషణమునం దెలిపినారు. గమనింపఁగలరు.
కెయెస్ గురుమూర్తి ఆచారిగారి పూరణ
రిప్లయితొలగించండిబెడద లేదు నీటికి కృష్ణ వెడలె నిచట
జనుల పాలించు దుర్గమ్మ తనరు నాల
వాల మఖిల విద్యలకును వైద్యమునకు
డక్కు మంచి నాగరికత నిక్కువముగ
కవిమితులు...
రిప్లయితొలగించండి***
అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ, మీ పూరణము అరసున్నను నిలుపుటచే బాగున్నది. అభినందనలు. అటులనే "... జూడఁగలము"అనిన నింకను బాగుండెడిది. గమనింపుఁడు.
***
హరి వేంకటసత్యనారాయణమూర్తిగారూ, మీ పూరణమత్యంత రమణీయముగ నాంగ్లపదాగమనముచే శోభిల్లుచు నన్యభాషావినిమయాదరణాపేక్షనుఁ బ్రకటించుచున్నది. అభినందనలు.
***
కొరుప్రోలు రాధాకృష్ణ రావుగారూ, మీ పూరణము విజయవాడ ప్రత్యేకతనుం దెలుపుచున్నది. అభినందనలు.
***
శ్రీపతిశాస్త్రిగారూ, మీ పూరణము విజయవాడాడంబర డంబము నుట్టంకించుచు నలరారుచున్నది. అభినందనలు.
***
శైలజగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.
"వానియమ్మునకది..."? (అర్థమగుటలేదు)
...అది బట్టుగొమ్మ...> అది పట్టుఁగొమ్మ...
***
మిస్సన్నగారూ, బెజవాడనుం దప్పుగాఁ బలికిన పిల్లవానికి బుద్ధిచెప్పినట్లున్న మీ పూరణము ప్రశస్తముగనున్నది. అభినందనలు.
***
మల్లెలవారూ, మీ యైదు పూరణములు విజయవాడ విశ్వరూపముం బ్రకటించుచు నలరించుచున్నవి. అభినందనలు.
కొన్ని వ్యావహారికములు సవరింపవలసియున్నది.
***
కెంబాయి తిమ్మాజీ రావుగారూ, మీ పూరణమునకు సంతసించి యమరులు తప్పక విజయవాడను కీర్తింతురు. అభినందనలు.
***
గుండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ, మీ పూరణమునం బిల్లవానికిం దెలుపు రాజధానీనగరాద్యతనాంశములు బాగున్నవి. అభినందనలు.
మూఁడవ పాదము"వాసి కెక్కును దేశాన వన్నెబెరిగి"యందు ...వన్నె పెరిగి...యని యుండవలెను.
***
కే. ఈస్వ(శ్వ)రప్పగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.
బెదరుమాన్పెడి దుర్గమ్మసదనమయ్యె
జముపగతుదు సతిగూడిజతగ నుండి
వాణిజులుకవుల్ నేతలు వాసి కెక్కు
డబ్బులున్నట్టి విజయవాడ నగరము
రెండవపాదమున "జముపగతుదు సతిగూడిజతగ నుండి"...అర్థమగుటలేదు.
జముపగతుదు > జము పగతుఁడు? కావచ్చునా?
నాల్గవపాదమున ...నగరము...ను...నగరమ్ము...గా సవరింపుఁడు.
***
రెండుచింతల రామకృష్ణమూర్తిగారూ, మీ పూరణమున విజయవాడను వర్ణించినట్టులఁ గనిపింపకున్నను నందు బెజవాడ కనకదుర్గ ధ్వనించుటచే మనోహరముగనున్నది. అభినందనలు.
మూఁడవపాదమున..."జేజేలు పల్కి యిరుగ"...డలని సవరింపఁగలరు.
***
సుబ్బారావుగారూ, మీ పూరణమున విజయవాడయందలి ప్రస్తుతాంశములు బాగున్నవి. అభినందనలు.
***
స్వస్తి.
కవిమిత్రులు కేయస్ గురుమూర్తిఆచారిగారూ, మీ పూరణమున విజయవాడ గొప్పతనము విశదమగుచున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిస్వస్తి.
శ్రీ గుండు మధుసూధన్ గారికి నమస్సులు. మీ పద్యములలోని పదముల అల్లిక నాకు కడు ముదంబొనరించుచున్నది. 2 వ పద్యము నందలి చమత్కారము చాలా బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదములు శ్రీపతిశాస్త్రిగారూ!
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిబెదురు వీడర బెజవాడ పిల్ల వాడ
జనుల రాజధానిగఁ జేయ చంద్రబాబు
వాసి కెక్కును దేశాన వన్నెపెరిగి
డబ్బు కురియును మీకట దిబ్బ లున్న!
మాయమ్మ దుర్గమ్మ చరణాంబురుహములకు మనమున సాగిల నమసమిడుచూ
రిప్లయితొలగించండిబెంజ నైతిని, గిరిరాజు బిడ్డ యొక్క
జలజ పావర మధువు భోజనము జేసి
వాఁకతాలుపు సతి నిచ్చ వాసమయిన
డంబుసూపుల విజయవాడ పురి యందు
కవిమిత్రులు మరుపాక రఘుకిశోర్‍గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ మపురూపములైన యచ్చఁదెనుఁగు పదములచే నలరారుచుఁ దత్సమములం దనలో నిముడ్చుకొని శోభిల్లునట్టి చక్కని పదప్రయోగము పద్యమునకే వన్నెతెచ్చినది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఉదయం హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. పూరణలు పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
*
గుండు మధుసూదన్ గారూ,
నా అనుపస్థితిలో శ్రమకోర్చి మిత్రుల పూరణ గుణదోషాలను సమీక్షించి, సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.
*
మరుపాక రఘుకిశోర్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ రాక ఆనందదాయకం.
గుండు మధుసూదన్ గారూ, మీ వ్యాఖ్యానమునకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికంది శంకరయ్య గారూ, మీ ఆహ్వానము ఆనందదాయకము.
ధన్యవాదములు
-- మారుపాక రఘుకిశోర్ శర్మ