31, అక్టోబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1541 (రాముండిటు రమ్మటంచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్.

27 కామెంట్‌లు:

  1. యేమూలను జూసిన రా
    ధా మాధవులు కనిపించ తగదని చెప్పన్
    తాఁ మంచి వచనముల బల
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

    రిప్లయితొలగించండి
  2. భామను సీతను బిలిచెను
    రాముండి టు రమ్మ టంచు, రాధను బిలిచెన్
    భామామణి ! నీవొక పరి
    యీ మూలకు రమ్ము చూత మిమ్ముగ శివునిన్

    రిప్లయితొలగించండి
  3. ప్రేమగ సీతను బిలిచెను
    రాముండిటు రమ్మటంచు , రాధను పిలిచెన్
    దామోదరుడగు వెన్నుడు
    క్షేమంబుగ యమునదరికి కేళియ లాడన్

    రిప్లయితొలగించండి
  4. ధూమమ్మును సేవించుచు
    భామామణి మత్తు లోన బావా యనినన్
    రోమాంటిక్ గా వెరవక
    రాముండిటు 'రమ్మ' టంచు రాధను పిలిచెన్!
    (పౌరాణిక రాముడు, రాధ కాదండి. ఈ కాలంలో పెట్రేగే పబ్బు లోని రాముడు, రాధ)

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తా మంచి’ అన్నప్పుడు అరసున్నా అవసరం లేదు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గోముగ శ్రీకృష్ణుడు దన
    ప్రేమమ్మును దెలుపుచుండ వినలేదని యా
    భామను సరసన గల బల
    రాముండిటు రమ్మటంచు రాధను బిలిచెన్!

    రిప్లయితొలగించండి
  7. క్షేమంకరుఁడతులిత బల
    ధీమంతుఁడు గోపకులసుధీవరుఁడు కళా
    శ్రీమంతుఁడు సద్గుణసు
    త్రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  8. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జడశతకం’ ఆవిష్కరణ సభలో మీరు కలుస్తారనుకున్నాను.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురుదేవులకు నమస్కారములు, హైదరాబాదుకు రావాలనే అనుకున్నాను కాని కొన్ని కారణాలవల్ల రాలేక పోయాను. మిమ్ముల, బ్లాగు మిత్రులను కలుసుకొనే అవకాశం కోల్పోయాను. బాధగానే ఉంది.

    రిప్లయితొలగించండి
  10. మల్లెలవారి పూరణలు
    భామా మణులెల్ల గొలువ
    శ్యామాకారుడు నగుచును సరసపు రీతిన్
    కోమల బృందము యదుకుల
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
    2భామారాధాయు నాత్మజ
    కోమల కృష్ణ పరమాత్మ గూడుట రాధౌ
    శ్యాముడు నటనల గోపా
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
    3.ప్రేమకు రాదా మాధవ
    కోమల క్రీడను జగతిని గొప్పది యనరే
    ధీమతి గోకుల శ్యామా
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
    4.రాముండను పేరు గలిగి
    భామను రాధను వలచెను పాణిని బట్టెన్
    గోముగ నొంటిగ నుండగ
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

    రిప్లయితొలగించండి
  11. ప్రేముడిన పిలిచె సీతను
    రాముండిటు రమ్మటంచు, రాధను పిలిచెన్
    దామోదరుండు తోటకు
    సోముని యొక్క వెలుగులలొ సుఖముల బొందన్

    రిప్లయితొలగించండి

  12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    ఆమని రాకనుబృండా
    రామములో గోభామలందరు యాడన్
    శ్యాముని యగ్రజుదౌ బల
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
    భామా!రాధా!వినవే
    నామైథిలి సీత వపుడు నాయుగమందున్
    ప్రేమించు కొందు మనుచున్
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

    రిప్లయితొలగించండి
  13. కె ఈశ్వరప్ప గారి పూరణలు
    రాముడు కృష్ణు౦డొకడే
    డ్రామా కృష్ణా౦జనేయ రణమున గాంచన్
    కోమలి సీతే రాదని
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్
    2సోమన్న కొడుకు రాముడు
    భీమన్న సుపుత్రి రాధ పెండ్లాడ౦గన్
    ప్రేమను పెంచగనామెను
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

    రిప్లయితొలగించండి
  14. భామా కలాప వేళకు
    ప్రేమోద్వేగంబు హెచ్చి ప్రియురాలి నటన్
    గోమున హరి, త్రేతాయుగ
    రాముండిటు రమ్మ టంచు రాధను పిలిచెన్!

    రిప్లయితొలగించండి
  15. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    రామకమౌ రూపమ్మును
    వ్యామకుచాచలయుగమ్మునా రతి యె౦తో
    కామముతో గోపీహృ
    ద్గ్రాముండిటు రమ్మ టంచు రాధను పిలిచెన్!

    రిప్లయితొలగించండి
  16. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    టైపాట్లు (రాధాయు, రాధౌశ్యాముడు) ఉన్నవి. మొదటి పూరణలో ‘కోమల బృందము’ అన్వయించడం లేదు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ప్రేముడిని’ అనండి. ‘వెలుగులలొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ఆ పాదాన్ని ‘సోముని వెన్నెలలలోన...’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    వ్యాఖ్యను పోస్ట్ చేసే ముందు ఒకసారి టైపు దోషాలను సరి చూడండి. (బృండారామము, గోభామ, యగ్రజుదౌ)
    ‘గోపభామ’లలో ‘ప’ తప్పిపోయింది.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గోపీహృద్గ్రాముడు’ గోపీహృదయమనే గ్రామము కలవాడని అర్థం చెప్పుకోవాలా?

    రిప్లయితొలగించండి
  17. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులకు నమస్కారములు!

    సోమనిభ వక్త్ర వల్లవ
    భామలతో రాసకేళి వదలి వినీల
    శ్యాముఁడు రాధాహృదయా
    రాముం "డిటురమ్మ" టంచు, రాధనుఁ బిలిచెన్!

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారూ,
    నేను నాలుగు సంవత్సరాల మునుపు, శంకరాభరణం బడి లో చేరినది ఈ సమస్యాపూరణము తోనే.
    గుర్తు చేశారు, అనేక ధన్యవాదములు.
    http://kandishankaraiah.blogspot.in/2010/06/blog-post_03.html

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  21. ఏమీ కోపము !వలదిక
    నా మీద వలపు తొలకరి నయముగ నిమ్మా
    కామిని! రాగలడా బల
    రాముం,డిటు రమ్మటంచు రాధను పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు,
    విశ్వరూపం న్యస్తాక్షరికి నేను నిన్న రాసిన పూరణ కనిపించడం లేదు.
    మీ మెయిల్ కు వచ్చిందంటారా?

    రిప్లయితొలగించండి
  24. గోముగ పలుపలు విధములు
    రాములు భార్గవ దశరధ రౌహిణి యితియౌ...
    భామల గోకులముల యభి
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

    రిప్లయితొలగించండి


  25. మామీ ! జిలేబియా ! యే
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్ ?
    మామూ లువిషయ మిదికా
    దే! మాటల్ సరి పలుకవె! తేగడ తోడై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. ఆమని లోబృందావని
    లో మానస మొల్లగ భళి లోలితుడౌచున్
    దోమల తోలగ తోటల
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్

    రిప్లయితొలగించండి