పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. నరులు అన్నారు కనుక జరిపెన్ అని ఏకవచనంలో కాక జరిపిరి అనాలి. నరులీ భువిలో.. అన్నదాన్ని.. నరజాతి భువిన్.. అనండి. లేదా దీపముల నిడిరి పండుగ జరుపన్.. అనండి. * జిగురు సత్యనారాయణ గారూ, మీ సీసపద్యంలో మాతృహృదయాన్ని, విష్ణుతత్త్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చక్రమునే విడిచి’ అంటే అన్వయం కుదురుతుంది. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘నియతిని’ అనండి. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరణించె నరకు డనుచును
రిప్లయితొలగించుకరమతనిని జూడ గోరి కమలా క్షుండే
దారను వెంటను నిడుకొని
మరు భూమికి వచ్చె నార్య ! మనసున బాధన్
రిప్లయితొలగించుమరణించె నరకు డనుచును
గరమగు సంతసము తోడ కర దీ పికలన్
గరమున బట్టుచు దిరిగిరి
పురజనములు వీ ధు లన్ని పోలగ బగలున్
మఱు చటి దినమున వారలు
వఱు వాతనె లేచి పిదప బాగుగ శుచియై
య రమరలు లేని భక్తిని
పరమాత్మకు బూజ జేసి బ్రమదము తోడన్
దీపాలను వెలిగించిరి
దీపావళి పేరు పెట్టి దేదీ ప్యముగాన్
రూపాయలైన వెరవక
పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్
హరి తా యుద్ధము నందున
రిప్లయితొలగించునరకుని తలగోసి జంప నరులీ భువిలో
హరుసము నిండిన మనమున
వరుసగ దీపముల బెట్టి పండుగ జరిపెన్
అమ్మ సంధించిన యమ్ము కదిలి వచ్చె
రిప్లయితొలగించు*****ప్రేమ మీరగ తల్లి ప్రేగు కదిలె
తూపు తగిలిన నెత్తురు జిమ్మె నరకుడు
*****నెలత చను మొనల న్నెత్తురొలికె
కుంభిని పైబడి కుజనుడు కూలెను
*****కూరిమి మనమున దూరెనంత
ప్రాణముల్ బాసెను పాప వర్తనుడిక
*****గర్భమందేమియో కాలుచుండె
ద్వంద భావంబున మునిగె ధరణి తాను
మాయకున్ లోబడకనుండె మాధవుండు
దుష్ట సంహారమె తనకు నిష్టమనుచు
విష్ణు తత్వముఁ దెలియరె విబుధులార!!
నరకుడు నేలను వ్రాలగ
రిప్లయితొలగించువరదుడు దా వచ్చి సత్య భామయు తోడన్
మరణము నొందిన నతనికి
సరములు లేకుండ దెలిపె సంతా పంబున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించుమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నరులు అన్నారు కనుక జరిపెన్ అని ఏకవచనంలో కాక జరిపిరి అనాలి. నరులీ భువిలో.. అన్నదాన్ని.. నరజాతి భువిన్.. అనండి. లేదా దీపముల నిడిరి పండుగ జరుపన్.. అనండి.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ సీసపద్యంలో మాతృహృదయాన్ని, విష్ణుతత్త్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించుఅందరి పూరణలూ అలరింపనున్నవి !
నరకాసుర సంహారము :
01)
___________________________
విక్రమమున హరి చివరకు
చక్రమునే విడువ నరకు - సంహారింపన్
వక్రముగా తల తెగి పడె
సక్రమమవ లోకమంత - సంతోషంబున్ !
___________________________
సం(హ)(హా)రించు = చంపు
శంకరార్యా ! శుభోదయం !
రిప్లయితొలగించుశరమున సత్య తునుమగను
రిప్లయితొలగించునరకుడు మరణించి తాను నాకముఁ జేరెన్
హరిని భజించి నియతిన
ధరణినివెలుగులను నింపి తనిసిరి జనముల్
నరకునిఁ జంపిరంచు, నొక నమ్మక ద్రోహమటంచుఁబల్కుచున్
రిప్లయితొలగించుపరిపరి తీరులన్ జనుల భ్రష్టులఁ జేయుచు నుండ్రి; పాపియై
నరులను బాధవెట్టు తఱి నాశమొనర్పగ విష్ణుడెంచె; నే
మరకుడు దుష్టచింతల నమాయక భారత సోదరా, సదా!
సత్యమె వినుమా పుత్రుడు
రిప్లయితొలగించుహత్యలు జేసెడి దురాత్ము డాతండైనన్
నిత్యము ధర శాంతికినై
సత్యా ! పరిమార్చవాని సవ్యంబేలే.
నరకుడు దుష్ట వర్తనుడు నాశము నొందుట తథ్యమౌను, సం-
రిప్లయితొలగించుబరమున ధారుణిన్ ప్రజలు పండుగ జేయుదు, రట్టి వాని కా-
ల్పురి కనుపంగ వాని తన పుత్రునిగా నెరుగంగ బోకయే
సరగున సత్యకే దగు! నసాధ్యము సాధ్యము గాదె చక్రికిన్!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చక్రమునే విడిచి’ అంటే అన్వయం కుదురుతుంది.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నియతిని’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీణావాద్యముచే చెలంగు కరముల్ విల్లంది దైత్యారిపై
రిప్లయితొలగించుబాణాస్త్రాదిమహోగ్ర శస్త్రయుత దీవ్యచ్చాపనాదార్భటిన్
శ్రేణీసంయుతదానవాహినుల నిస్తేజంబుగావించి శ
ర్వాణీకైవడి సంహరించె నరకున్ రంజిల్లగా లోకముల్.
నరకుని సంహారము భీ
కరమై దానవులకెల్ల కలత మిగిల్చెన్
సుర మానవ ఋషిగణములు
పరమానందమునువొంది వరలిరి జగతిన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించుమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘శర్వాణీ కైవడి’అనడమే బాగాలేదు. ‘శర్వాణిం బోలుచు’ అందామా?
భరియించదు తల్లైనను
రిప్లయితొలగించుతరుణుల నవమాన బరచు దానవ గుణమున్!
నరకాసుర సంహారము
ధరణిని దెల్పెడు నిజమిదె దాల్చఁగ మదిలో!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించుతల తెగ నరకగ నరకుడు
విలవిలమని భువిన పడెను విధిలిఖితమనన్
చలనము లుడిగిన క్షణమున
వలవలమని వగచె జనని పతి యోదార్చెన్