రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
ఉ. రోసము
మించగా (నరవరుండు నతండు నొనర్చి రాజి)నిన్
వేసెను రాముఁడున్
(బలిమి భీషణలీలనుఁ బద్మజాస్త్ర) మె
చ్చౌ సరి నెన్ని
బా(ములను, నారిపు తేజము మొత్తె; వేగ) నా
దోసినిఁ గూల్చెఁ,
దద్(విజయు దోర్బల మర్మిలి వేల్పు లెన్నఁ)గన్. (౧౧౯)
భారతము-
గీ. నరవరుండు
నతండు నొనర్చి రాజి
బలిమి భీషణలీలనుఁ
బద్మజాస్త్ర
ములను,
నారిపు తేజము మొత్తె; వేగ
విజయు దోర్బల
మర్మిలి వేల్పు లెన్న. (౧౧౯)
టీక- నరవరుండు = (రా) రాముఁడు, (భా) అర్జునుఁడు; ఆజి = యుద్ధమును;
పద్మజాస్త్రము = బ్రహ్మాస్త్రము; (రా) ఎచ్చౌ = హెచ్చగు; బాముల = కష్టముల;
విజయ = జయశీలుని; దోర్బలము =
భుజబలము; అర్మిలి = ప్రేమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి