11, అక్టోబర్ 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 108


రావిపాటి లక్ష్మినారాయణ

చంపకమాల(...)లో, కందద్వయము [...]లో, తేటగీతి {...}లో, ఆటవెలది “...”లోఁ దెలుపబడి, యివి గర్భితమైన సీసము
సీ.        (అతి[కరుణాత్ముడా {పతి యనంతరసాన్వి
తప్రస్ఫుటాంగ}తా])త సుగుణకలి
([త తతబలా] ప్రభూ {పతితతారక సద్ధృ
తి ప్రాజ్ఞవీర} సం)ధితరుచిర వి
(తత[వరదాయకా {యతుల నవ్యరమాయు
త ఖ్యాతియుక్త} పా)]తకరహిత ల
([లితసుభగా] విభూ {కృతి సులేఖ సుధీవ
రశ్రేష్ఠబంధు}రా) రమ్యచరిత
గీ.         నత[వరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువనభా]స
హిత [సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా]త. (౧౨౫)
(సీసములో నాలుగుపాదముల యందును ౧౬వ అక్షరములగు త, తి, , రలు సీసమునందు గురువులు, తక్కిన కంద గీత చంపకమాలలందు లఘువులు. అనఁగా సీసమునందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగ, సద్ధృతిప్రాజ్ఞ, నవ్యరమాయుతఖ్యాతియుక్త, సుధీవరశ్రేష్ఠబంధు యని యొక్కొక్కదానిని సమాసముగఁ జదువవలెను. కంద, గీత, చంపకమాలలందు అనంతరసాన్విత, ప్రస్ఫుటాంగ, సద్ధృతి, ప్రాజ్ఞ, నవ్యరమాయుత, ఖ్యాతియుక్త, సుధీవర, శ్రేష్ఠబంధు యని వేఱువేఱుగా జదువవలెను.)
గర్భిత చంపకమాల-
అతికరుణాత్ముడా పతి యనంతరసాన్విత ప్రస్ఫుటాంగతా
త తతబలా ప్రభూ పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర సం
తత వరదాయకా యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త పా
లితసుభగా విభూ కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధురా!

గర్భిత కందద్వయము-
కరుణాత్ముడా పతి యనం
తరసాన్వితప్రస్ఫుటాంగతాత తతబలా
వరదాయకా యతుల న
వ్యరమాయుత ఖ్యాతియుక్త పాలితసుభగా.

వరద రవిశశినయన పర
పరమపురుష భక్తతోష భరితభువన భా
సురమునిజనవినుత హతది
తిరుహ త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా.

గర్భిత తేటగీతి-
పతి యనంతరసాన్వితప్రస్ఫుటాంగ
పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర
యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త
కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధు.

గర్భిత ఆటవెలది-
నతవరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన
హిత సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభ.

గద్యము-
ఇది విద్వద్విధేయ, రావిపాటి చలమయామాత్యపుత్ర,
లక్ష్మీనారాయణ ప్రణీతంబయిన
నిర్వచన భారతగర్భ రామాయణము
సర్వము నేకాశ్వాసము
సంపూర్ణము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి