జిగురు సత్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవపద్యం చివరిపాదంలో యతి తప్పింది. ‘దొంగవోలె’ అన్నదాన్ని ‘తెక్కలి వలె’ అనండి.
దొంగ తనము జేసి గంగమ్మ దొరకంగ
రిప్లయితొలగించండినూరి జనులు నామె యుసురు దీయ
కుయ్యు మనక తేలు కుట్టిన దొంగమా
దిరి సహనము గలిగి దిగులు జెందె
పట్టుకు పోగా వచ్చెను
రిప్లయితొలగించండిదట్టించి గృహంబులోని ధనమంతటినిన్
కుట్టెనొక తేలు, బాధను
తట్టుకొనను లేడు యేడ్వ తరమున్ గాదే
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నల్ల ధనము దాచిన వారి నామములను
రిప్లయితొలగించండితరచి జూచిన తమవారు తారసిల్ల
బయట పెట్టిన పోవును పరువనుకొని
తేలు కుట్టిన దొంగయ్యె ధీర నరుఁడు!!
తెలుగులఁ జీల్చిరి గెలిచెడు
రిప్లయితొలగించండితలపులు మదిలోఁ గదలగ దారుణ మనినన్
విలవిల లాడెడు యోటమిఁ
దలకెత్తుకు మాట రాక ధామము విడరే!
కుడి యెడమల గట్టులనే
విడదీసియు విజ్ఞు లెల్ల వేడుకఁ గనిరే!
ముడిపడగన్ జగడమ్మును
సడలించగఁ బూను కొనక జారెదరెటకో
(శ్రీశైలం ప్రాజెక్టు జలవివాదం)
దొంగతనము జేయ దొడ్డిలో మాటేయ
రిప్లయితొలగించండితేలు గుట్టె నొకని వేలు మీద
నఱచి గోల బెట్ట నల్లరౌ నని తల్చి
మిన్న కుండె బాధ మ్రింగికొనుచు
చింతామణి యింటిలో సుబ్బి శెట్టి ఉన్నప్పుడు పెద్ది శెట్టి వచిన ఘట్టం
సాని యింటి కొకడు సరస మాడగ బోవ
నతని తండ్రి వచ్చె నాత్రముగను
తనయు డపుడు దూరె తల్పము క్రిందను
దృణము పోటు బడిన దొంగ వోలె
దృణము - తేలు
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం చివరిపాదంలో యతి తప్పింది. ‘దొంగవోలె’ అన్నదాన్ని ‘తెక్కలి వలె’ అనండి.
చక్కగ దోచగ ధనమున్
రిప్లయితొలగించండినక్కుతు మరివచ్చి తలుపు నయముగ దీయన్
టక్కున కుట్టెపృదాకువు
కిక్కురుమనలేక దొంగ గేటును దాటెన్!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. నేను “ద్రుణము” పొరపాటున దృణము అని టైపు చేశాను.
రిప్లయితొలగించండిఅందువలన “ద్రుణము పోటు బడిన దొంగవోలె” సరి పోతుందా? దయచేసి తెలియ జేయండి.
అన్నపరెడ్డి వారూ,
రిప్లయితొలగించండిచక్కగా సరిపోతుంది. స్వస్తి!
దాచిన సొమ్ములు నావని
రిప్లయితొలగించండిదోచినవారై పలుకరు దోషులు ,భళి! యా
నీచులు నల్లధనముపై
వే చల్లిరి నీటిధార, వీడిరి యాశల్.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.