18, అక్టోబర్ 2014, శనివారం

పద్యరచన - 710

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. మరుగుజ్జు లలో గుజ్జగు
    చిరురూపంబైననేమి చింతపడకుమా
    గురుతించిరి గిన్నీసున
    తరుణులలో నీవెపొట్టి దానివియనుచున్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పొట్టిదైనా గట్టిదే :

    01)
    ______________________________

    పొట్టిదె ధారుణి యందని
    కట్టిరి గిన్నెసు రికార్డు - ఘనత వహించన్ !
    సొట్టల బుగ్గల నవ్వులు
    చుట్టము లందరును జూచి - సుఖమును బొందన్ !
    ______________________________

    రిప్లయితొలగించండి
  3. బోన్సవి పెరుగక నీమెయె
    బోన్సయ్ గా మారెనిటుల, భువనమునందే
    యిన్సల్టైనను, రికార్డు
    ఛాన్సే గిన్నీసు బుక్కు చప్పున నెక్కెన్.

    రిప్లయితొలగించండి
  4. పొడవైనను కుఱచైనను
    నడవడికయె మానవాళి నవపథమనుచున్
    నుడివెదరార్యసమానులు
    కడునుత్తమ గతినిబొంద గలిగితివమ్మా!

    కుఱచైతిననుచు మనసున
    వెఱపున్ గనబోకుమమ్మ విరిబోణీ మీ
    పెఱవారలెన్ని జెప్పిన
    నిఱుసంస్థానంబు దక్కె నిజమిదె గనుమా!

    నిఱు = మిక్కిలి ఉన్నతమైన

    రిప్లయితొలగించండి


  5. గోలి వారి 'బోన్సాయి' బోనస్ ఐ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. గట్టిగ గిన్నిసుబుక్కున
    పట్టును సాధించినావె భళిరా జ్యోతి!
    పొట్టిగ నున్నను నేమిలె
    నిట్టుల ఘనకీర్తి కలిగె నింతీ! నీకున్ !!!

    రిప్లయితొలగించండి
  7. ఎక్కి గిన్నీసు బుక్కులో నిమ్ము గాను
    వినుతి కెక్కితివి గదమ్మ విశ్వ మంత
    విధి సలిపినట్టి చేటుయున్ పేరుదెచ్చె
    మంచిరోజులు భావిని కాంచుమమ్మ

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    అమ్మా నిన్ గని నంతనె
    బొమ్మని భ్రమచెందినాను పొరపడుచు, సజీ
    వమ్మే ననగన్ దెలిసెను
    కమ్మని ఘనకీర్తి గల్గి గౌరవమందన్.

    రిప్లయితొలగించండి
  9. చిన్న పడతి యైన నెన్నికాయెను గదా!
    ఎత్తు లోన పెద్ద పొత్తమందు
    నింక తాను నెంత యెదగంగ వలయునో
    చెప్పవలయు జనులు గొప్పమీర.

    రిప్లయితొలగించండి
  10. గిన్నీసు బుక్కు నందున
    మన్నన లందించ పొట్టి మహిళా మణికిన్
    బన్నీటి జల్లుఁ గురియదు
    యన్నాతికి నీడు జోడు నమరిన గురియున్!

    రిప్లయితొలగించండి
  11. పెట్టిన పోటీలో నతి
    పొట్టివి నీవని గినీసు పొత్తములోనన్
    పెట్టిరి నిన్నే యందున
    కట్టిన నీచీర యెటుల కట్టితివమ్మా!

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    పద్యం చివర ‘దాన వటంచున్’ అనండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో బేసిగణంగా (రికార్డు) జగణాన్ని వేశారు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    పొరబాటుకు క్షంతవ్యుడను, సవరణ తో...


    బోన్సవి పెరుగక నీమెయె
    బోన్సయ్ గా మారెనిటుల, భువనమ్మందే
    యిన్సల్టైనను, దక్కెను
    ఛాన్సే గిన్నీసు బుక్కు చప్పున నెక్కెన్.

    రిప్లయితొలగించండి