రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
చం. అరి(జనలోకభీకరుఁడునై తన భీషణశక్తిచేతఁ దా
గురుబలమున్)
మహాదనుజకోటినిఁ గూల్చెను; మాల్యవంతు నా
శర(ఘనసేనఁ
దోలు పృథుశల్యునిఁ జంపె యుధిష్ఠిరుండు నొ
ప్పు రణమునన్)
వరుం డనిలపుత్రుఁడు దారిని; మంచె లక్ష్మణున్.
(౧౧౫)
భారతము-
కం. జనలోకభీకరుఁడునై
తన భీషణశక్తిచేతఁ
దా గురుబలమున్
ఘనసేనఁ దోలు
పృథుశ
ల్యునిఁ జంపె
యుధిష్ఠిరుండు నొప్పు రణమునన్. (౧౧౫)
టీక- శక్తిచేత = (రా) బలముచేత, (భా) శక్తియను నాయుధముచేత; (రా) గురుబలమున్ = గొప్పసేనను, (భా) కురుబలమున్ = కౌరవసేనను;
ఆశర - (రా) రాక్షసుల, పృథుశల్యుని = గొప్పబాణములు గలవానిని, (భా) గొప శల్యుని; యుధిష్ఠిరుండు = (రా)
యుద్ధమునందు స్థిరమయినవాఁడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి