2, అక్టోబర్ 2014, గురువారం

నిషిద్ధాక్షరి - 12


సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా
గాంధీజీని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

37 కామెంట్‌లు:

 1. గురువు గారు,
  పరుషాక్షరములు అనగా క చ ట త ప లు కదా!!

  రిప్లయితొలగించండి
 2. ముద్దు లాడు చుండు మోముపై మోమెత్తి
  ధరణి పిలుచు నతని దాత యనుచు
  చేతి దండ మూని సేనాధి పతియౌచు
  తెల్ల వారి నుండి తెచ్చె ముక్తి

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  గాంధీ :

  01)
  _______________________________

  సత్య, మహింసను హనువుల
  నిత్యము శాంతిని నెరపుచు - నేర్పరితనమున్
  పథ్యము నిలుపన్వర్షము;
  హత్య నొనర్చెనిట హూణ - హరికపు యమలున్ !
  _______________________________
  హనువు = ఆయుధము
  పథ్యము = హితము
  వర్షము = భరతవర్షము
  హరికము = భయంకరము
  అమలు = ప్రభుత్వము

  రిప్లయితొలగించండి
 4. గురువుగారికి నమస్కారములు నిన్నటి పద్యం ఇవాళ పెడుతున్నాను
  ఆలస్యానికి మన్నించండి
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 5. జిగురు సత్యనారాయణ గారూ,
  ఎంత పొరపాటు జరిగింది! ధన్యవాదాలు. సవరించాను.
  *
  సుబ్బారావు గారూ,
  మీరు పద్యంలో పరుష సరళాలు రెండింటినీ ప్రయోగించారు. సరళాల నిషేధంతో మరో పద్యం వ్రాయండి.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. చేతకర్ర పట్టి చిన్ని కొల్లాయిని
  కట్టి తెల్లవారి కాళ్ళు విరిచె
  శాత్యహింస నేర్పి చక్కని స్వేచ్ఛను
  మనకునిఛ్ఛి నిలిచె మహిని తాత.

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగునన్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. తెల్ల వారినెల్ల తరిమి తెచ్చె మనకు విచ్చలున్
  తెల్లపంచె చేతికర్ర తెలిపె మానవత్వమున్
  పిల్లలన్న పూవు లన్న ప్రేమ పంచు తత్వమున్
  మల్లె వంటి మంచి మనసు మరువలేము తాతనిన్

  రిప్లయితొలగించండి
 9. సహనమ్ము, సత్య పాలన,
  యహింస ,నిర్మల వచనము లనయము మెరయన్
  మహనీయ భారత పితా!
  యహమింతుము! తలచి మిమ్ము హర్షింతుమయా!

  రిప్లయితొలగించండి
 10. ప్రజల శక్తి మ్లేఛ్చులనెల్ల పాఱ తఱిమి
  తెచ్చి స్వాతంత్ర్యము మనకు తేజ రిల్లె
  విశ్వ విఖ్యాతి కలయట్టి విశ్వ నేత
  చాటి లేరు వాని కెవరు చరిత లోన

  రిప్లయితొలగించండి
 11. ఆల్బర్ట్ ఐనిస్టీన్ ఉవాచ :
  ఇలలో రక్తము మాంస
  మ్ములతోనిటువంటి కాయమొకటి పొలయగా
  తలమేనా యనుకొని చకి
  తులౌ నరులనంత వికసితోర్వి మహాత్మా

  రిప్లయితొలగించండి
 12. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తాతనున్’ అనండి.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ ప్రయత్నం బాగుంది. కాని నియమోల్లంఘన జరిగింది. రెండు చోట్ల సరళాన్ని (ప్రజ, తేజ) ప్రయోగించారు. సవరించండి.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  అన్నపరెడ్డి వారు ‘ప్రజ’లతో ‘తేజ’రిల్లారు.

  రిప్లయితొలగించండి
 13. మల్లెల వారి పూరణలు

  కోమటి యయినను నేమయె
  సీమకు వెనుకకు తర్మెను, చేసియు పోరున్,
  నేమము నహింస, సత్యము
  తామల యస్త్రాలనుచును, తాతయు తానే

  సత్యమహింసల చేతను,
  నిత్యము రాట్నము గిరగిర, నేమము త్రిప్పా
  కృత్యముల, తెల్ల వారి, య
  కృత్యములను నాపి, తల్లి కిచ్చెను స్వేచ్ఛన్

  రిప్లయితొలగించండి
 14. చాలా క్లిష్టమైన అంశాన్ని ఇచ్చారు గురువుగారు.

  రిప్లయితొలగించండి
 15. ఆత్మ పరి శీల నము మిన్న యన్న మనిషి
  కర్మ సూత్రము మనకున్న మర్మ మనుచు
  నీతి సూత్రము లన్నియు నెరపి నిలువ
  శ్రీ మహాత్ముని శీలము స్థిరము నిలచె
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 16. ఆత్మ పరి శీల నము మిన్న యన్న మనిషి
  కర్మ సూత్రము మనకున్న మర్మ మనుచు
  నీతి సూత్రము లన్నియు నెరపి నిలువ
  శ్రీ మహాత్ముని శీలము స్థిరము నిలచె
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 17. మోహనుడు తెల్ల వారిని
  సాహసమున తరిమి కొట్టె సత్యనిరతి తో
  నూహల చిక్కని నిజమగు
  నాహా నేటి జనములకు నార్యా! తలుపన్.

  రిప్లయితొలగించండి
 18. మిస్సన్న గారు "డు" తో పాటుగా "జ" గూడా వాడారు.

  రిప్లయితొలగించండి
 19. మిత్రులకు నమస్కారములు!

  నెత్తిపై పిలకతో, నిర్మలమ్మౌ ముఖ
  ....మ్మున ధీరశాంతముల్ మొనయ నిచట
  నల తెల్లవారి కార్యావర్త పరిహార్య
  ....మౌటకై నీ వహింసాస్త్రము ధరి
  యించియు నని సేసి, యేకమౌ నటు సేయ
  ....ప్రాంతీయులను భవ్యవాక్ప్రతతుల
  నాసేతుశీతాచ లాంతర సంచారి
  ....వైతి మేల్కొలుప నీ వనవరతము

  తెల్లవారల పాలన తెల్లవాఱ
  నీ వహింసాయుత సమర నేతవయ్యు
  భారతీయ స్వతంత్రతా వర్తనకయి
  హే భరతమాత సత్పుత్ర, హితవర, పిత,
  తెల్లవారి నంపితివి మా యుల్ల మలర!!

  రిప్లయితొలగించండి
 20. మదీయ ద్వితీయ పూరణము:

  శాంత్యహింసాయుధధుర్య! సత్యకోప!
  శ్వేతముఖపలాయిత! చిత్రవేషధారి!
  భరతమాత సత్పుత్రక! భరతవర్ష
  పిత! మహాత్మ! నమోऽస్తుతే విమల చరిత!!

  రిప్లయితొలగించండి
 21. మేక పాలు తాగి కాకలు తీరగా
  సత్య మూర్తి నిలిపె సహన శీలి
  శాంత్య హింసల తోడ చక్రమ్ము త్రిప్పుచూ
  మ్లేచ్ఛ జనుల తోలె స్వేచ్ఛ కొరకు.

  రిప్లయితొలగించండి
 22. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  `తర్మెను" ప్రయోగం ఆలోచించవలసిందే. `త్రిప్పా/ కృత్యముల..' అర్థం కాలేదు.
  *
  మిస్సన్న గారూ,
  మీకు క్లిష్టమైన అంశమా? రిటైర్మెంట్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మీ ప్రయత్నం ప్రశంసించదగినదే!
  మీ పూరణలో డ మాత్రమే కాదు జ కూడా రెండు సార్లు ప్రయోగించారు. మళ్ళీ ప్రయత్నించండి.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ సీసపద్య పూరణ, రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. అక్కడ "శాంత్య హింస లనెడి చక్రమ్ము త్రిప్పుచు" అందామా?

  రిప్లయితొలగించండి
 24. మోము పైనన మోమెత్తి మూ ర్కొ నునత
  నార్య !యిలకునే తాతయై యలరి మఱి ని
  శాంతి పూర్వక సమరము సలిపి ,మనకు
  పరుల పాలన తప్పించె వరలు నట్లు

  రిప్లయితొలగించండి
 25. కంది శంకరయ్య గార్కి వందనములు

  తప్పు దొర్లినందుకు చింతిస్తున్నాను
  'నిత్యము రాట్నము గిరగిర, నేమము త్రిప్పా'
  కి బదులుగా
  'నిత్యము రాట్నము చరచర, నేమము త్రిప్పా'
  అని సవరిస్తున్నాను

  ఇట్లు
  మల్లెల సోమనాధ శాస్త్రి

  రిప్లయితొలగించండి
 26. శ్రీగురుభ్యోనమ:

  పోరుచు నాపాశ్చ్యాత్యుల
  వారించితివీవు సత్యవాక్పాలనతో
  భారతమాతకు స్వేచ్ఛా
  హారతులను పట్టినావు ధ్యాత!మహాత్మా.

  రిప్లయితొలగించండి
 27. భారతమాత శిరమునన్
  భూరియశోకాంతిమంతముత్యపుమాలై
  ధీరలలితాంశరూపా
  కారుణ్యముచూపి మమ్ము కాచిన మూర్తీ.

  రిప్లయితొలగించండి
 28. కె.ఈశ్వరప్పగారి పూరణలు
  తెల్లవారి నెల్ల మెల్లగా నంపిన
  శాంతి నేతయాయె క్రాంతి నింపె
  సత్య సహన ములకునిత్య నిర్మలకర
  నిల మహాత్ము పిలుపు యెవరి కొచ్చె?
  ఎవరును నూహించని విధ
  మవలీలను తెల్లవారి న౦పుట వింటే
  కవు లెంచని సహనమునన్
  అవిరళ కృషి చేమహాత్మునా యన వినమే

  రిప్లయితొలగించండి
 29. చూశారా గురువుగారూ! ఎన్ని తప్పులో. సత్యనారాయణ రెడ్డి గారికీ, మీకు ధన్యవాదాలు. మరమ్మతు చేయడానికి ప్రయత్నిస్తాను.

  గుండు మధుసూదన్ మిత్రుల పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 30. కిట్టించిన పద్యం.

  మోహనతాత వెల్లలను
  సాహసమున తరిమి కొట్టె సత్యనిరతితో
  నూహల చిక్కని వాస్తవ
  మాహా నేటి యువకులకు నార్యా! తలుపన్.

  నేను ఈ చిన్న పద్యానికే ముప్పుతిప్పలు పడ్డాను. మధుసూదనులు అంత పెద్ద పద్యాన్ని ఎలా వ్రాశారో!
  ఘటనాఘటన సమర్థత.

  రిప్లయితొలగించండి
 31. పూజ్య గురుదేవులు శ౦కరయ్యగారికి వందనములు
  సత్య శాంత్యహింసలె యను సత్వ పథము
  భారతావని స్వాతంత్ర్య మారయుటకును
  మూలమాయెమహాత్ముని లీల వలన
  యతని స్మరియింప వలెను ప్రత్యహము మనము

  రిప్లయితొలగించండి
 32. గురువు గారూ!మూడవపాదంలో గణదోషానికి మీ సూచన సరియైనదే!హడావుడి లో అలా రాశాను మన్నించండి

  రిప్లయితొలగించండి
 33. సరళ మయినట్టి పథమున సత్య వాణ్య
  హింస లేయూత చేసి వైరి పై పోరు
  సలిపినట్టి యా మహాత్ముస్మరణ సేయ
  రమ్ము యిలలోన శాంతి వెలయుటకునై

  రిప్లయితొలగించండి
 34. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. "ప్రజ"ల "తేజ"స్సును తగ్గించి సవరించిన పద్యమును మరల పంపుచున్నాను.

  కరము శక్తి మ్లేఛ్చులనెల్ల తఱిమి వైచి
  తెచ్చె స్వాతంత్ర్యము మనకు మెచ్చ సఖులు
  విశ్వ విఖ్యాతి కలయట్టి విశ్వ నేత
  చాటి లేరు వారి కెవరు చరిత లోన

  రిప్లయితొలగించండి