2, అక్టోబర్ 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 99


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
చం.      కడు(వగ గూడ భూసురుని గాటపు శాపముచేతనైన యా
రడిఁ దన తే)జ మాఱిన సురామనుఁ గాచెను, బొంది రావణుం
డడ(రు గడంకఁ గ్రుంగ, నరికచ్చుగఁ జావు మరుద్వరాత్మజుం
డిడె; లలిఁగాన్) రిపుం డటుల నీల్గగ దెచ్చెను ద్రోణశైలమున్. (౧౧౪)

భారతము-
కం.       వగ గూడ భూసురుని గా
టగు శాపముచేతనైన యారడిఁ దన తే
రు గడంకఁ గ్రుంగ, నరి
కచ్చుగఁ జావు మరుద్వరాత్మజుం డిడె లలిఁగాన్. (౧౧౪)
టీక- సురామను = (రా) ధాన్యమాలిని, (రా) మరుత్ = వాయువునకు, వర = శ్రేష్ఠుఁడగు, ఆత్మజుఁడు = కుమారుఁడు (హనుమంతుఁడు); (భా) మరుత్ = దేవతలకు, వర = ప్రభుని (ఇంద్రుని), ఆత్మజుండు = కుమారుఁడు (అర్జునుఁడు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి