జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘లంకాపతి’ సరియైన రూపం. ‘జంకక దైత్యుండు...’ అనండి. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, ‘నావల్ల అవుతుందా?’ అంటూనే ఎవరివల్లా కాని విధంగా ‘రామ రావణ యోర్యుద్ధం - రామ రావణ యోరివః’ అన్నదాన్ని ‘సీతాపతి లంకజియ్య - జిద్దే జిద్దౌ’ అంటూ చక్కని పూరణ నందించారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మూడు పద్యాలతో చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కానీ రెండింటిలోను నియమోల్లంఘన చేశారు. మొదటి పూరణలో ‘సంహరించె’ అన్నచోట.. ‘సీతాపతి మట్టుపెట్టె...’ అనండి. రెండవ పూరణలో ‘బెదరక’ అన్నచోట ‘పదపడి’ అనండి. * శైలజ గారూ, మీ రెండు పద్యాల పూరణ బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ రెండు పద్యాల పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ ఐదు పద్యాల పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పూరణ మొదటి పాదంలో గణదోషం. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, చక్కని పదసంపదతో మీ పూరణ అలరించింది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు. చాలాసేపు బ్లాగులో వ్యాఖ్యలు పెట్టడానికి వీలుకాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఎర్రర్ వచ్చింది. ఈ సమస్య నాకే కాక కొందరు మిత్రులకు కూడా వచ్చిందట. ఇప్పుడు సరిచేయబడినట్టుంది. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ప్రాణము’నకు వికృతి ‘పానము’ అనుకున్నట్టున్నారు. అక్కడ ‘వదలె నసువులన్’ అనండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండుచింతల వారన్నట్టు యశము - జశము కాదు. సూచించడానికి నాకు సవరణ తట్టడం లేదు. * కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. గుండు వారి వ్యాఖ్యను గమనించండి. ‘బ్రహ్మను’ అన్నచోట ‘వైరిని’ అనండి. * గుండు మధుసూదన్ గారూ, ఈనాటి పూరణలలో మీది నిస్సందేహంగా తలమానికం. ఒక ప్రౌఢకవి వ్రాసిన పద్యంలా ఉంది. (ప్రతిపదార్థాలు ఇస్తే బాగుంటుందేమో!) అభినందనలు. మిత్రుల పూరణల గుణదోషాలను తెలిపినందుకు ధన్యవాదాలు. * వసంత కిశోర్ గారూ, నిజమే! నేను గమనించలేదు. ధన్యవాదాలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యశము విషయములో సందేహము తీర్చిన మూర్తి గారికి, మాస్టరుగారికి ధన్యవాదములు. యముడు ని జముడు, యశ్వంత్ ని జశ్వంత్ అని వింటూఉంటాము కదా ..అందుకని సందేహము కలిగినది. సవివరముగా తెపినందులకు ధన్యవాదములు.. నా పూరణను మారుస్తాను.
గురువు గారికి పాదాభి వందనములు గుండు మధుసూదన్ గారికి నమస్కారములు మీరు చెప్పిన సూచనలు చాలా బాగున్నవి రామరావణ యుద్ధం లో రావణాసురుని తలలు అనేకం తెగుతున్న కొద్ది మాయచేత సృష్టించ బడతాయని విన్నాను కాకున్నా కాల్పనిక పూరణ విశేషంగా వున్నా తప్పు లేదని భావిస్తాను ఇక్కడ పూరణ
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ వివరణ సబబైనదే. మీ సవరణలోను దోషాలున్నాయి. ‘సాన్నిధ్య/ మ్మూత మ్మాదిత్యహృదయ ముపదేశంబున్’ అనండి. ‘సాన్నిధ్యము + ఊతము + ఆదిత్య’ అని విసంధిగా వ్రాయకూడదు కదా... అలాగే ‘హృదయ + ఉపదేశంబు’ అన్నప్పుడు గుణసంధివల్ల ‘హృదయోపదేశము’ అవుతుంది. యడాగమం రాదు.
జలధులు మిన్నంటినటుల
రిప్లయితొలగించండికులశైలములు భువిలోన కూలిన పగిదిన్
విలయమిదియనెడి యుద్ధము
చెలగెను లంకేశు తోడ సీతాపతికిన్!!
సుబ్బారావు గారు,
రిప్లయితొలగించండినాలుగవ పాదములో ప్రాస సరిపోలేదు
దశ కంఠుని దును మాడగ
రిప్లయితొలగించండినిశితంబగు బా ణ మూని నెవ్వగ నతడున్
దశదిశలు బిక్క టిల్లగ
కశిపుల్లేకుండ జే సెకా కుత్సు డిలన్
satyanarayana gariki namaskaramulu.
రిప్లయితొలగించండిnalgava padamu savarinchanu .
krutajnatalu
లంకేసునితో వీకన్
రిప్లయితొలగించండిపంకజనయనుండు తాక పటలముతోడన్
పంకజనయనను విడువక
జంకక లంకపతి భీష్మ జన్యము(జగడము) సలిపెన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిశ్రీ సీతారామాభ్యాం నమ:
నిశితంబగు బాణముచే
దశకంఠుని గూల్చివేసె దాపము తొలగన్
శశివదనుండినతేజుడు
వశిష్ఠ శిష్యుడు జనకజపతి విజయుండై
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గగనం గగనాకారం - సాగరం సాగరోపమః
రామ రావణ యోర్యుద్ధం - రామ రావణ యోరివః
***** మహర్షి వాల్మీకి *****
శంకరార్యా ! మీకిది తగునా ?
వాల్మీకిమహర్షి వలననే కానిది
నా వల్లవుతుందా ?
పైగా -ర- కార నిషిద్ధముతో- కందపద్యమా ????????
సరే !- నేనుకూడా ఆదికవి బాటలోనే :
01)
_______________________________
మాతాదస్యుని జెండగ
సీతాపతి జేసి నట్టి - చివ్విని బొగడ
న్నే తుల్యత లే దప్పటి
సీతాపతి లంకజియ్య - జిద్దే జిద్దౌ!
_______________________________
దస్యుడు = దొంగ
చివ్వి = యుద్ధము
తుల్యత = పోలిక
అప్పటి = ఆనాఁటి
జిద్దు = యుద్ధము
జియ్య = ప్రభువు
కాంతను వంచనఁ గొని చను
రిప్లయితొలగించండిపంతముఁ బట్టిన దనుజుని పై కినుకనుఁ దా
నంతముఁ జేసెదనంచును
శాంతము వీడెనినకులుడు జలధిని దాటెన్.
పలువిధముల బాణములను
విలుకాడాతడు పదునుగ వేయుచు దివిలో
నిలనున్ చూడని యుద్ధము
సలిపెన్ విభుడంచు పొగడ సాయకవహుడై
కోతుల సైన్యముఁ జేకొని
మాతను విడిపింపనెంచి మానవుడయ్యున్
పాతకు దానవుని గెలిచె
చేతులు మోడ్చెదమతనికి సీతాపతికిన్.
లంకాపతి బంధించగ
రిప్లయితొలగించండిపంకజముఖి సీత యెన్నొ బాధలు పడగా
నంకములో సీతాపతి
లంకేశుని సంహరించె లక్ష్యముతోడన్!
సీతమ్మ ను గావ దలచి
రిప్లయితొలగించండిసీతాపతి లంక కేగె సేతువు మీదన్
పాతకుడౌ లంకేశు ని,
నాతిని బట్టిన దనుజుని నాశముజేసెన్!
కట్టెను సేతువు సత్యుడు
గొట్టెను లంకాధిపతిని కుజనే తెచ్చెన్
బిట్టుగ నయోధ్య జనితా
పట్టమ్మును గట్టుకొనెను పావనితోడన్!
మొదటి పాదమును
తొలగించండి"లంకాపతి బంధనమున" అని చదువ వలసినదిగా మనవి.
లంకా పతి భీష్ముండై
రిప్లయితొలగించండిగొంకక పలు బాణములను కొట్టగ నని నే
నింకను నుపేక్ష జేయుట
జంకని సీతేశు డతని జంపెను తృటిలో.
సీతేశుడు జటిలంబగు
వాతానలవాసవాది బాణ తతులచే
భీతిన్ బొందని లంకకు
నేతను నలువమ్ము జేత నీల్గగ జేసెన్.
కదనములో సీతాపతి
రిప్లయితొలగించండిపదములు వెనుదీయకుండ బాణములెల్లన్
బెదరక వేయుచు కసిగా
పది తలలుగలిగిన వాని వధ్యము జేసెన్
కపి సేన తోడ లంకను
రిప్లయితొలగించండివిపులంబగు దానవులను, వేగమ చంపెన్
అపుడా జానకి నాధుడు
కుపితుడునై పది తలలనుఁ గొట్టెను బలిమిన్
లంకను దానవ సేనల
బింకముగా కపి నిచయము పెద్దగ తాకెన్
పొంకపు సంజీవని తో
నంకితుడై బ్రతుక వెసను నా లక్ష్మణుడే
తాఁదగ, సుతుల, పదితల
లా దనుజునకును మడియగ, నని కపిసేనన్
వే, దా కోసల భూపుడు
తా, దశ కంఠుని బలమును తడయక కూల్చెన్
పదితలల పాపి, లంకను
పద పడియును దాచ సీత, బల్లిద విభుడా
పదనౌ కోతుల సేనయె
ముదమున సాయము పడగను, మొత్తము కూల్చెన్
కపులే సాయము పడగను
విపులంబగునా దనుజులు, వీగగ బలమే
అపహృత సీతను కావగ
ను, పదితలల లంక పతిని నొప్పుగఁ గొట్టెన్
ఆకసమున బాణాగ్నులు
రిప్లయితొలగించండిచీకటులను వెడలగొట్టి చిచ్చే లేపెన్
మూకలుగా కపి సైన్యము
దూకగ దానవుల దండు తుదముట్టెనుగా!
విలవిలలాడె జగంబుల
రిప్లయితొలగించండితులితమహాతీక్ష్ణసహితదుస్సాహససం
కలితాంబకముల ధాటికి
నిలదశకంఠున్ వధించెనినకులవిభుడే.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లంకాపతి’ సరియైన రూపం. ‘జంకక దైత్యుండు...’ అనండి.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
‘నావల్ల అవుతుందా?’ అంటూనే ఎవరివల్లా కాని విధంగా ‘రామ రావణ యోర్యుద్ధం - రామ రావణ యోరివః’ అన్నదాన్ని ‘సీతాపతి లంకజియ్య - జిద్దే జిద్దౌ’ అంటూ చక్కని పూరణ నందించారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మూడు పద్యాలతో చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కానీ రెండింటిలోను నియమోల్లంఘన చేశారు. మొదటి పూరణలో ‘సంహరించె’ అన్నచోట.. ‘సీతాపతి మట్టుపెట్టె...’ అనండి. రెండవ పూరణలో ‘బెదరక’ అన్నచోట ‘పదపడి’ అనండి.
*
శైలజ గారూ,
మీ రెండు పద్యాల పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ రెండు పద్యాల పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పద్యాల పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పూరణ మొదటి పాదంలో గణదోషం.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కని పదసంపదతో మీ పూరణ అలరించింది. అభినందనలు.
భూసుత మగడిటు జంకక
రిప్లయితొలగించండివిసుగును మది జెందకుండ వింతగు గతిలో
వెసతా బాణము లేయగ
పసగోల్పడి లంకవిభుడు పానము వీడెన్
దశకంఠుని యుద్ధములో
రిప్లయితొలగించండిమశకము వలె దల్చి గూల్చి మహనీయుండే
కుశలముగా జానకితో
జశమును తాబొంది వెడలె జన్మస్థలికిన్.
( జశము = యశము ...అనవచ్చాండీ...)
మాతలి ఘన సాన్నిధ్యము
రిప్లయితొలగించండియూ తము యాదిత్య హృదయ యుపదేశంబున్,
వే తలలు నేల గూలగ
భాతిగ బాణముల చేత బ్రహ్మను గూల్చెన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండిసీతాపతిహస్తతృణత
శాతపృషత్కోద్విఘాతసంహతిశక్తిన్
దైతేయపతియె హతుఁడయె
సీతాస్తేయాత్యయకృతశిక్షితుఁడగుచున్!!
శంకరార్యా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
మల్లెలవారి రెండవ పూరణలోనున్న "బ్రతుక"
అనే పదము నిషిద్ధనియమానికి అనుగుణమేనా ?
అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
దిక్కులు పిక్కటిలగనట
రిప్లయితొలగించండిగక్కుచు శోణితమును దశకంఠుండొదిగెన్
నిక్కముగా విజయుండై
నక్కాకుత్సుండు సీతనక్కున గొనియెన్
గోలి వారి సందేహం ప్రకారం యశము(ప్ర)జశము(వి)కాదు, యశము(ప్ర) అసము(వి) అవుతుంది, దీనికి ఆధారం ఇదే సైటు లో ఉన్న "తెలుగు నిఘంటువు"
రిప్లయితొలగించండిమిత్రులు శంకరయ్యగారికి,
రిప్లయితొలగించండికవిమిత్రులు కొరుప్రోలు రాధా కృష్ణ రావుగారి పూరణమున రాఁగూడనిచోటులందున యడాగమము వచ్చుట, "బ్ర"హ్మను...అనుచోట నధోsక్షరముగ ’ర’కారావృత్తి సవరింపవలసియున్నవి. అటులనే... వేతలలు=పదితలలా?...బ్రహ్మ=రావణబ్రహ్మయా యని సందేహములు కలుగుచున్నవి. పరిశీలించఁగలరు.
అటులనే...మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యము బాగున్నది. కాని "నక్కాకుత్సుడు"..."యక్కాకుత్స్థుఁడు"కావలసియున్నది.
స్వస్తి.
గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారి వ్యాఖ్య....
రిప్లయితొలగించండిశ్రీ మధుసూదన్ గారికి,
నమస్కారములు.
సంస్కృతపద్యము చదువుతున్న భావన కలిగిందండీ మీ పద్యము చదువుతుంటే. అద్భుతం.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిచాలాసేపు బ్లాగులో వ్యాఖ్యలు పెట్టడానికి వీలుకాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఎర్రర్ వచ్చింది. ఈ సమస్య నాకే కాక కొందరు మిత్రులకు కూడా వచ్చిందట. ఇప్పుడు సరిచేయబడినట్టుంది.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రాణము’నకు వికృతి ‘పానము’ అనుకున్నట్టున్నారు. అక్కడ ‘వదలె నసువులన్’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండుచింతల వారన్నట్టు యశము - జశము కాదు. సూచించడానికి నాకు సవరణ తట్టడం లేదు.
*
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండు వారి వ్యాఖ్యను గమనించండి. ‘బ్రహ్మను’ అన్నచోట ‘వైరిని’ అనండి.
*
గుండు మధుసూదన్ గారూ,
ఈనాటి పూరణలలో మీది నిస్సందేహంగా తలమానికం. ఒక ప్రౌఢకవి వ్రాసిన పద్యంలా ఉంది. (ప్రతిపదార్థాలు ఇస్తే బాగుంటుందేమో!) అభినందనలు.
మిత్రుల పూరణల గుణదోషాలను తెలిపినందుకు ధన్యవాదాలు.
*
వసంత కిశోర్ గారూ,
నిజమే! నేను గమనించలేదు. ధన్యవాదాలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొరపాటు నిజమే గురువు గారు , సవరణకు ధన్యవాదములు,
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికొరుప్రోలు రాధా కృష్ణ రావుగారి పూరణమున “వే తలలు నేల గూలగ”
అంటే "వేగముగ తలలు నేలకూలగ" అనే అర్థాన్ని తీసికో గూడదా? దయతో తెలియ జేయండి.
అన్నపరెడ్డి వారూ,
రిప్లయితొలగించండినిజమే!వేగముగా అనే అర్థాన్నే స్వీకరించాలి. రాత్రి నేను ఆ అర్థాన్నే వివరించాలనుకొని మరిచిపోయాను. ధన్యవాదాలు.
యశము విషయములో సందేహము తీర్చిన మూర్తి గారికి, మాస్టరుగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండియముడు ని జముడు, యశ్వంత్ ని జశ్వంత్ అని వింటూఉంటాము కదా ..అందుకని సందేహము కలిగినది. సవివరముగా తెపినందులకు ధన్యవాదములు.. నా పూరణను మారుస్తాను.
దశకంఠుని యుద్ధములో
రిప్లయితొలగించండిమశకము వలె దల్చి గూల్చి మహనీయుండే
కుశలముగా జానకితో
యశమును తాబొంది వెడలె నాకాశగతిన్.
గురువు గారికి పాదాభి వందనములు
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారికి నమస్కారములు
మీరు చెప్పిన సూచనలు చాలా బాగున్నవి
రామరావణ యుద్ధం లో రావణాసురుని తలలు అనేకం తెగుతున్న కొద్ది మాయచేత సృష్టించ బడతాయని
విన్నాను కాకున్నా కాల్పనిక పూరణ విశేషంగా వున్నా తప్పు లేదని భావిస్తాను
ఇక్కడ పూరణ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ వివరణ సబబైనదే.
మీ సవరణలోను దోషాలున్నాయి. ‘సాన్నిధ్య/ మ్మూత మ్మాదిత్యహృదయ ముపదేశంబున్’ అనండి.
‘సాన్నిధ్యము + ఊతము + ఆదిత్య’ అని విసంధిగా వ్రాయకూడదు కదా... అలాగే ‘హృదయ + ఉపదేశంబు’ అన్నప్పుడు గుణసంధివల్ల ‘హృదయోపదేశము’ అవుతుంది. యడాగమం రాదు.
మాతలి ఘన సాన్నిధ్య
రిప్లయితొలగించండిమ్మూ త మ్మా దిత్యహృదయ ముపదేశంబున్
వే తలలు నేల గూలగ
భాతిగ బాణముల చేత వైరిని గూల్చెన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు 14/10/14
గురువు గారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండి