కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దుర్మతీ! పిన తండ్రి పుత్రులకు పాలు
రిప్లయితొలగించండిపంచక యధికారముదాల్చి పగను పెంచి
చెడు తలపులు పుర్రెన బుట్ట చెల్లనీవు
స్నేహితమును, వంశంబును చేదునమగ
చెడ్డ తలపులు పుక్కిటి జేదు కొనుచు
రిప్లయితొలగించండిమేటి యధికార ముసుగును మేళవించి
దుర్మతీ !పిన తం డ్రిని దుయ్య బట్ట
కాచు కొనుముసు యోధన !నాజి యందు
శ్రీ హరిని నమ్ము గమనించి చేదుకొనును
రిప్లయితొలగించండిసంధి తలపులు పుణ్యంబు సాగనిమ్ము
తీపి కబురు సుయోధన తీరుగాను
పంపు మపకారమెంచక పాండవులకు
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అధికార ముసుగు’ అన్నది దుష్టసమాసం. ‘అధికారజాలిక’ అనండి.
చివరిపాదంలో యతి తప్పింది. ‘ఆజియందు’ అన్నదానిని ‘కదనమందు’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కడుపు తీపియు మమకారముచే దుర్మ
రిప్లయితొలగించండిధాంధ సుతుని సైచి యంధరాజు
తప్పులెక్కువైన తనయుండు చావగ
తన యరుపులు పుడమి తలము నిండె
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు శకరయ్య గారికి వ౦దనములు
రిప్లయితొలగించండిపొలతీ పిట పిటమనునీ
వలపులు పులకలను రేపె వదలను నిన్నున్
పలుక నహంకారమునన్
వలలునిచే దుడుకు సింహ బలుడు గతి౦చెన్
పచ్చని పడతీ పిలచిన పలుకవేల?
రిప్లయితొలగించండికరము మమకారము గలిగె కనగనె నిను
రేయి తలపులు పులకలు రేపె నిజము
యింతి! నా చే దురద తీర్చు మిమ్ముగాను
కె.యెస్. గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిపురుష కారము నాలోన పొంగిపోవ
నీదు సొంపులు పురిగొల్పె నిలువజాల
వలపు తీపిచే దుహినము వలె కరిగెద
కౌగిలించుము సైరంధ్రి జాగదేల
మల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండి1.పులుపు పలుకులపెదతండ్రి పోను ప్రేమ
చేదు నైనట్టి కౌరవ చేష్ట లెల్ల
కారమువలెను బాధింప కనగ నీక
తీపి యెట్లు భరించిరి దీరులగుచు
2.తీపిగాకను రారాజు తెంపరయ్యె
చేదు యయ్యెను కృష్ణుడు జెప్పు మంచి
కారమును జల్లినట్లయ్యె కనగ కృష్ణు
పులుపు పలుకుల న౦ధు౦దు పొలుపు వినియె
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చెడ్డ తలపులు పుక్కిటి జేదు కొనుచు
రిప్లయితొలగించండిమేటి యధికార మును మఱి మేళవించి
దుర్మతీ !పిన తం డ్రిని దుయ్య బట్ట
కాచు కొనుముసు యోధన !కదన మందు
కనగ వచ్చును దృత రాష్ట్రు కడుపు తీపి
రిప్లయితొలగించండిభీమ ఆకారమునుబట్టి పిప్పి జేయ
నృపులు పులకించి పోయిరి నృపతి జూచి
చిత్త మందున నిలచెను చేదు ఘటన
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కె ఈశ్వరప గారి పూరణలు
రిప్లయితొలగించండిమందు చూపుంచు మమకార ముసుగు లోన
తండ్రి ధృతరాష్ట్రు తీపియే దండనమయె
చేదునిజమని గ్రహియింప వాదు రాదు
కృష్ణు మాటల పులుపున తృష్ణ జరుగు
కుంతీ!పితరుల కొరకే
సంతానపు చింత పులుపు సాగిన రీతిన్
సంతులనచేదు నిజమవ
వింతగు మమకారములుగ విజ్ఞులు జూడన్
యుద్ధ రంగమున శ్రీ కృష్ణుడు అర్జునునితో. .
రిప్లయితొలగించండిసుమతీ! పిరికివి గాకుము
మమకారము వీడు, కర్మ మార్గము మేలౌ!
సమరమున పులుపుఁ జూపుము
సమన్వయముచే దునిమిన జయమౌ మీకున్!
పూజ్యులు గురుదేవులు శకరయ్య గారికి
రిప్లయితొలగించండిమీమెప్పును పొందినందుకు సంతోషము. ధన్యవాదములు
మిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండి(ఉపపాండవులనుం జంపిన యశ్వత్థామనుఁ జంపెదనని యర్జునుఁడు శపథముఁ జేయు సందర్భము)
"ౘంపి తీ పిల్లలను నీవు సంతసమునఁ;
గోరి యుపపాండవుల కపకారము నిడి
నట్టి పాపులు పుడమి నుండంగఁ ౙనదు!
త్రుటిని నిను నాదు శరముచేఁ దునిమివైతు!!"
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భీము నాకారమును...’ అనండి.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మమకార ముసుగు’ అనడం దోషమే!
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కడుపు తీపిని యరి కట్ట, బాలుని వీడ
రిప్లయితొలగించండికుంతిమాతయు తాను కుమిలెనెంతొ!
మమకారములవియు మాసిపోవుట కల్ల
లేనాటికైనను హృదయమందు,
పొత్తిళ్ళ బిడ్డ చూపులు, పువ్వు నవ్వులున్
చెమరించు కనులకు చేదుగుర్తు,
రగులునీ గతి బాధ రాతి మదినిఁ గూడ
పచ్చిపుండు పగిది ప్రతి దినమ్ము
తనువు విడిచి పోవుదనుక మరపురాదు
తల్లి పాలవెల్లి తథ్యమిదియె
కష్టమిట్టిదొకటి కలుగరాదెవరికి
జగతియందు తరుణి జాతినెల్ల.
లక్ష్మీదేవి గారూ ,
రిప్లయితొలగించండిసీసపద్యంలో మీ పూరణ వివరణాత్మకంగా చాలా బాగుంది. అభినందనలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిచాలా సంతోషమండి. ధన్యవాదాలు.