11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

పద్య రచన - 1005

కవిమిత్రులారా,
“ఎందుల కిన్ని బాధల సహింతువు.....”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి. 

37 కామెంట్‌లు:


  1. శ్రీగురుభ్యోనమ:

    శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి తిరిగి వెళ్లునపుడు భీష్మ ద్రోణ కృప విదురాదులు శ్రీకృష్ణపరమాత్మునితో చెప్పినట్లుగా ఊహించి

    ఎందులకిన్ని బాధలు వహింతువు నీవిట నేమి బంధమో
    నిందలు మోపుచుండినను నేరములెంచక ప్రేమమూర్తివై
    పొందిక గూర్చనెంచితివి పోరును బాపగ నో మహాత్మ నీ
    సుందర దివ్యరూపమును చూడగ భాగ్యము మాకు కల్గెనే


    రిప్లయితొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సహింతువు’ను ‘వహింతువు’ అన్నారు. అర్థాంతరం రాలేదు లెండి!

    రిప్లయితొలగించండి
  3. ఎందులకిన్ని బాధలు సహింతువు?విద్యను నేర్వబూనియే
    నిందలు బొందుటేలయన?నిత్యసుఖాలను బొందు విందుకే
    అందనివిద్య నేర్చుటనునాశ?నిరాశను వేరుజేయుటే
    పొందిన బాల్యవిద్య మనపోరును మాన్పుచు సౌఖ్య మిచ్చులే.

    రిప్లయితొలగించండి
  4. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఎందులకిన్ని బాధల సహింతువు జానడుపొట్టకై గదా!
    బంధువులెవ్వరైన మరి భార్యయుఁ బుత్రులుఁ దోడువచ్చునే?
    యిందరిఁ బాధఁబెట్టి సిరి యెంతయొ ప్రోగులుఁ జేసి లోభిగాన్
    పొందితివీవుకీర్తి యది పుణ్యపు కార్యము యేదిలేకయున్

    రిప్లయితొలగించండి
  6. వల్లూరు మురళి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘...దోడువత్తురే’ అనండి. అలాగే ‘కార్య మదేది లేకయున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. ఎందులకిన్ని బాధల సహింతువు జానడుపొట్టకై గదా!
    బంధువులెవ్వరైన మరి భార్యయుఁ బుత్రులుఁ దోడువచ్చునే?
    యిందరిఁ బాధఁబెట్టి సిరి యెంతయొ ప్రోగులుఁ జేసి లోభిగాన్
    పొందితివీవుకీర్తి నది పుణ్యపు కార్యము నేదిలేకయున్

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    1 వ పాదంలో
    "ఎందులకిన్ని బాధలు సహింతువు". అని సవరిస్తున్నాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. ఎందుల కిన్ని బాధల సహింతువు చావక యంచు నిన్ను నీ
    వెందుకు తిట్టుకొందువుర యీ యిల బుట్టిన యెవ్వరేనియున్
    పొందక నుందురే వెతల? ముందుకు సాగుము సాహసమ్ముతో
    సుందరమైస జీవితము చూతువు తప్పక యోర్పు గల్గినన్

    రిప్లయితొలగించండి
  10. ఎందులకిన్ని బాధల సహింతువు జానడుపొట్టకై గదా!
    బంధువులెవ్వరైన మరి భార్యయుఁ బుత్రులుఁ దోడువత్తురే?
    యిందరిఁ బాధఁబెట్టి సిరి యెంతయొ ప్రోగులుఁ జేసి లోభిగాన్
    పొందితివీవుకీర్తి నది పుణ్యపు కార్యమదేదియులేకయున్

    రిప్లయితొలగించండి
  11. ఎందులకిన్ని బాధల సహింతువు జానడుపొట్టకై గదా!
    బంధువులెవ్వరైన మరి భార్యయుఁ బుత్రులుఁ దోడువత్తురే?
    యిందరిఁ బాధఁబెట్టి సిరి యెంతయొ ప్రోగులుఁ జేసి లోభిగాన్
    పొందితివీవుకీర్తి నది పుణ్యపు కార్యమదేదియులేకయున్

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతి శాస్త్రి గారి పద్యం చదవడానికి హాయిగా ఉండి చాలా నచ్చింది, అభినందనలు. ఇక్కడ వారికి వారి నైమిత్తికముగా ఇతర కవి బృందానికి ఒక సూచన, ఇది కేవలం పద్య శిల్పానికి , శయ్యకు సంబంధించినది కనుక అనుసరించడం ఐచ్చికం. పద్యం చదవగానే చాలా మట్టుకు ఎవరు ఎవరితో అన్నారో 'సాధ్యమైనంత వరకు ' సూటిగా తెలియడం , తెలియజేయడం శిల్పం లో ఒక భాగం కనుక వారి మూడవ పాదాన్ని ' పొందికఁ గూర్పనెంచితివి పోరును బాపఁగ నో ముకుంద ( మహాత్మ బదులుగా) అంటే బావుంటుంది పయిగా బిందు పూర్వక ద కార ప్రాస , ముకుంద వెన్నంటి వచ్చే ' సుందర ' శబ్దం చెవులకింపుగా ఉంటాయి .
    ఇంతా చెప్పిన తరువాత కూడా వారి పద్యంలోని భావ గాఢతను మరో మారు అభినందించడం విధ్యుక్తం . అస్తు !

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    (నీ సత్యము వదలిపెట్టి విశ్వామిత్రు నెదురించమని నక్షత్రకుడు హరిశ్చంద్రునికి సలహా ఇచ్చుట)

    ఎందులకిన్ని బాధల సహింతువు ? సంయమి యైన గాధిరాట్
    నందను చెంత కొంటివె ధనమ్మును ? సత్యము సత్యమంచు ని
    ట్లుం దపియించనేటికి-కడున్ ? ఋణమిచ్చెనె నీకు ? పోని, లే
    వెందును పత్రసాక్ష్యములు + ఇకేమొకొ ! నీవెదురించవచ్చుగా !

    రిప్లయితొలగించండి
  14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    మురళి గారూ,
    పద్యం చివర ‘కార్య మదేది లేకయున్’ అనండి. లేకుంటే గణదోషం.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    సహృదయంతో స్పందించి చక్కని సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. మీ సహకారం ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఎందుల కిన్ని బాధల సహింతువు మార్గములెన్నిలేవుజా
    గెందులకయ్యజూడుజగతెంతగ వర్ధిలుచున్నదిప్డు నీ
    ముందట నున్నవేయిపుడు ముచ్చట గొల్పెడి పారితోషము
    ల్నందగ జేయు సంస్థలికయందొకటింపుగ నెంచుకోవయా

    రిప్లయితొలగించండి
  16. ఎందులకిన్ని బాధలఁ సహింతువు చూడఁగ జీవితాననా
    నందము లేశమాత్రములనర్థము జీవితమిట్లునింక గో
    విందుని చింతనామృతము వీడక గ్రోలెదనంచు నెమ్మదిన్
    నందను నందనున్ గొలుతు నమ్మిక తోడఁ ప్రశాంతచిత్తుఁడై.

    రిప్లయితొలగించండి
  17. ఎందులకిన్ని బాధల సహింతువు; శాశ్వితమేదిగాదు;యా
    నందమునందుకోగలవు; నందునినందను వేడుకొమ్ము; నీ
    కెందును బాధలేదు; భవబంధములూడ్చును మేలుకొమ్ము; నీ
    వందరు మెచ్చుజీవితమునందెదవెందుకు సందియమ్మికన్.

    రిప్లయితొలగించండి
  18. ఎందుల కిన్ని బాధలు సహింతువు వద్దను కొన్న వారు దా
    నిందలు మోపగా మరిని బందుగు లౌటను సైచుటొ ప్పుగా
    డెందము నందలం చియిక మందుడు వోలెను నుంట గా దగ
    న్నందరి సౌఖ్యము ల్నరసి యుంటకు నేమని జెప్పగా వలెన్

    రిప్లయితొలగించండి
  19. ఎందుల కిన్నిబాధలు సహింతువు కంజ దళాయతాక్షి నీ
    యందము, కూర్మియున్, మరియు హార్దము, గోత్రపు వెన్నెలాయెగా
    పొందుము శీఘ్రమే ముగితి మూర్ఖపు నాథుని నుండి, కొమ్మ! నీ
    రందియె నామనస్సునను రంజిలు చున్నది రమ్ము చెంతకున్

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. ఎందుల కిన్నిబాధల సహింతువె యాడది యాడదంటు ని
      న్నందరు గేలిచేయు పురుషాధములున్న సమాజమందు నీ
      యందము విందుగా తలచు యల్పుల యంతముఁ జూడ కాళివై
      ముందుకు దూకమంటి సతి విముక్తిని గోరిరణమ్ము జేయగన్

      తొలగించండి
    2. ఎందుల కిన్నిబాధల సహింతువె యాడది యాడదంటు ని
      న్నందరు గేలిచేయు పురుషాధములున్న సమాజమందు నీ
      యందము విందుగా తలచు యల్పుల యంతముఁ జూడ కాళివై
      ముందుకు దూకమంటి సతి విముక్తిని గోరిరణమ్ము జేయగన్

      తొలగించండి
  21. శ్రీగురుభ్యోనమః
    శ్రీ విష్ణునందన్ గారికి నమస్సులు. శోభాయమానుడైన ముకుందుని చూపించినందులకు మిక్కిలి ధన్యవాదములు.
    సవరించిన పద్యము

    ఎందులకిన్ని బాధలు సహింతువు నీవిట నేమి బంధమో
    నిందలు మోపుచుండినను నేరములెంచక ప్రేమమూర్తివై
    పొందిక గూర్చనెంచితివి పోరును బాపగ నో ముకుంద నీ
    సుందర దివ్యరూపమును చూడగ భాగ్యము మాకు కల్గెనే

    రిప్లయితొలగించండి
  22. కపటసన్యాసి తపమాచరించే పార్వతితో..

    “ఎందుల కిన్ని బాధల సహింతువు పర్వతరాజపుత్రివై
    కందెను చూడు నీ తనువు కన్నుల కాంతులు తగ్గిపొయె నీ
    కెందుల కీ తపమ్ము లిక నిందునిభానన చాలుజాలు నా
    మందుడు కోపి నగ్నుడు నుమా సరిబోలునె నీకు నెందునన్.

    రిప్లయితొలగించండి
  23. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘జగతి+ఎంతగ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘జగ మెంతగ’ అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నందను నందను’ అన్నదాన్ని ‘నందుని నందను’ అనండి.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సహింతువు+ఆడది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సహింతువె యాడడి యాడదంచు’ అనండి.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    ఆశ్చర్యం! ప్రతిరోజు సమస్యాపూరణలు ఎక్కువగా, పద్యరచనలో పద్యాలు తక్కువగా ఉండేవి. ఈరోజు పద్యరచనకే ఎక్కువ వచ్చాయి. ఈ క్రొత్త ప్రక్రియ అందరికీ ఆసక్తికరంగా ఉన్నట్టుంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  24. ఎందుల కిన్ని బాధల సహింతువు ?నీ పతి యేగుదెంచునా?
    సుందర మైన మోమిటుల సూర్యుని వేడికి మ్లాననిత్తువే
    విందుగ రావణాసురుని పెండిలి యాడిన గాసి తప్పి నీ
    ముందర నిల్చు సౌఖ్యములు మొండితనమ్మును మాను మానినీ!!!

    రిప్లయితొలగించండి

  25. పద్యరచన
    ఎందుల కిన్ని బాధలు సహింతువు?జానకి!నేవెరు౦గవా
    పందల వోలె రాజ్యమును బాసి వనమ్ముల సంచరించుచున్
    కొందల బెట్టు రాముడను కూలుడు గాడిక ని౦ద్ర భోగముల్
    పొందెద వీవు నాకు తనివోని సుఖమ్ముల న౦ద జేయుమా

    రిప్లయితొలగించండి
  26. ఎందుల కిన్నిబాధలుసహింతువుయేలన?నాడపుట్టుకే|
    కుందుచు కాలధర్మమును కూర్పుల నేర్పున జీవితాంతమున్
    అందని సౌఖ్య సంపదల నాదరణంబున భార్య రూపమున్
    పొందితి|లక్ష్య సాధనల పోరుననిల్చితి శక్తిరూపమున్|

    రిప్లయితొలగించండి
  27. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు కృతజ్నతలు.

    ఎందుల కిన్ని బాధల సహింతువు మార్గములెన్నిలేవుజా
    గెందులకయ్యజూడుజగమెంతగ వర్ధిలుచున్నదిప్డు నీ
    ముందట నున్నవేయిపుడు ముచ్చట గొల్పెడి పారితోషము
    ల్నందగ జేయు సంస్థలికయందొకటింపుగ నెంచుకోవయా

    రిప్లయితొలగించండి
  28. ఎందులకిన్ని బాధల సహింతువు! మమ్ములఁ గన్నతల్లి! నీ
    సుందర మోమునన్ గినుక చూచెడు మారుతినా నిరాశ నీ
    కెందులకమ్మ? దానవుల నెల్లర గూల్చెద! మద్భుజాసనా
    స్యందన పీఠిపై నొదుగ స్వామిని జేర్చెద జానకీ సతీ!

    రిప్లయితొలగించండి
  29. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సహించెద వేలన’ అనండి. అలాగే ‘జీవితాంత మీ| సౌఖ్యసంపదల...’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందఱకు నమస్సులు!

    (సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)

    "ఎందుల కిన్ని బాధల సహింతువు? మద్రసుతా! యముండ నే!
    నిందునిభాస్య! నీ మగని నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
    సందడిఁ జేయుచుం బరవశమ్మున వెంటఁ బడంగ రాదు! నీ
    కింద, వరమ్ము నిత్తు, నిఁక, నీశుని ప్రాణముఁ దక్క, కోరుమా!"

    రిప్లయితొలగించండి
  31. గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:

    ఎందుల కిన్ని బాధల సహింతువు నీవని జాలి జూపురే!
    మందును కొట్టి వచ్చితివి మౌనము దాల్చుము పార్లమెంటులో
    నందురు వారిజాక్షులును హాయిని జెందుచు వెక్కిరించుచున్
    కొందరు గేలిజేయుచును కొంటెగ రాహులు పప్పువందురే!
    సుందర రూపుడా! మనువు జూపెద రోమున జాగు మానురా!

    రిప్లయితొలగించండి


  33. ఎందుల కిన్ని బాధ లస హింతువు ఛందపు పద్యమేసదా
    డెందము కోరె నంచు మరి ఢీకొను టేలన కో‌జిలేబి నీ
    వందము గాన పల్కులను వాకము లోతెలుపంగ రాదుటే?
    కొందలమంద నేల సఖి కోమల మైనది మాట మంతియే

    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. ఎందుల కిన్ని బాధల సహింతువు మిత్రమ ఖర్గపూరునన్?
    సందులు గొందులున్ తిరిగి సంధ్యయు రాత్రియు జబ్బుజేయగా
    మందులు మాకులున్ గనని మత్స్యపు దేశము వంగభూమినిన్
    తొందర తొంద్రగా విడిచి తోలుము బండిని హైద్రబాదుకున్!

    రిప్లయితొలగించండి