12, సెప్టెంబర్ 2015, శనివారం

పద్య రచన - 1006

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    సకల భువనమ్ములను మోయు సర్వసాక్షి
    యాదిశేషుని పైనను నత్తమిల్ల;
    దేవ! నేనేమి తక్కువ తింటిననుచు,
    నదివొ! శునకమ్ము మహిషిపై నత్తమిల్లె!!


    రిప్లయితొలగించండి
  2. ఎనుపశువు పైన శయనించె శునకమచట
    గృహములందున వశియించు మృగములన్ని
    సఖ్యత కలిగి మెలగును సంతతమ్ము
    గ్రామముల నిట్టి దృశ్యముల్ గాంచ వచ్చు

    రిప్లయితొలగించండి
  3. సకల జీవులు సృష్టిలొ చక్కగాను
    కలసి జీవించు తలచక కల్మషములు
    మనుజు లందరు కలవరు మత్సరమున
    దేశ మేగతి కేగునొ దేవ దేవ!

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. కనకపు సింహా సనమున
      శునకము కూర్చుండఫలము శూన్యం బనితా
      ఎనుమును పానుపు జేసుక
      శునకము నిద్రించు చుండె చోద్యము గనరే

      తొలగించండి
  5. గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఎనుముపై నెక్కి శయనించె...’ అంటే బాగుంటుందేమో?
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    మీ పద్యం బాగున్న్దది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అనుచున్+ఎనుమును’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘శూన్యం బని తా| నెనుమును...’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. మూగ జీవులందు ముప్పిరి గొన్నట్టి
    సఖ్యమునుగనంగ సంతసమ్ము
    గలుగు;మనుజు లందు గానమీ బంధమె
    చ్చటఁ నరయ వింత గాదె జంతు ప్రేమ.
    ;

    రిప్లయితొలగించండి
  7. డా. బల్లూరు ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    ఆంజనేయులు శర్మ గారూ,
    ‘తా నెనుమును’ అని నేను సూచించాను. అయిన మీరు విసంధిగానే పోస్ట్ చేశారు.

    రిప్లయితొలగించండి

  8. శునక మొక్కటి నిదురించె సుఖము గాను
    మహిషి మీదను జక్కగా మాననీయ !
    జంతు ప్రేమను జూచియు జనులు మనము
    నేర్చు కొనవల యును వాటి నెనరు ప్రేమ

    రిప్లయితొలగించండి
  9. నిద్దుర సుఖమే గాదుర
    గ్రద్దన భయమన నెరుగదు గదనట శునకం
    బద్దిర యతిముదముగ ని
    స్సద్దుగ నామహిషివీపు జక్కగ నెక్కెన్

    రిప్లయితొలగించండి
  10. ఎనుమెక్కి నిద్రఁ బోయెడు
    శునకమ్మును గాంచ గలము క్షోణితలమ్మున్!
    కనిరే యెక్కగ నావును?
    తనువుఁ దమోగుణమలిమిన దైవాఱు నిటుల్!

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులందరకు నమస్కారములు.
    ఉమాదేవిగారూ..మూదవ పాదమును బంధమ్ము తోముగించుచు, వింతగాదెనరయ జంతుప్రేమ అంటూనాల్గవపాదము పూర్తిచేసినబాగుండును. దయచేసి గమనించండి.







    రిప్లయితొలగించండి
  12. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నిస్సద్దుగ’ ప్రయోగం దోషం. అక్కడ ‘అద్దిర ముదమున మహిషిని| స ద్దింతయు జేయకుండ జక్కగ నెక్కెన్’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘క్షోణితలమునన్’ అనండి.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    ఉమాదేవి గారి పద్యంలోని గణదోషాన్ని నేను గమనించలేదు. మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు.
    మీ సవరణలోను ‘వింతగాదె యరయ’ అని యడాగమం వస్తుంది. నుగాగమం రాదు.

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

    ఎనుమెక్కి నిద్రఁ బోయెడు
    శునకమ్మును గాంచ గలము క్షోణితలమునన్!
    కనిరే యెక్కగ నావును?
    తనువుఁ దమోగుణమలిమిన దైవాఱు నిటుల్!

    రిప్లయితొలగించండి
  14. భైరవు౦డు కాశి పట్నము నకురక్ష
    గ్రామ సింహ మరయ గాచు పశుల
    పల్లెలందు. గాన పవళించే గీదేపై
    చక్కగాను తనదు హక్కటంచు
    2ఎద్దుఎక్కిరి౦త ఈశ్వరుడై యు౦డె
    తొలియుగమ్ములందు, కలిని నేడు
    భైరవు౦డు యగుచు బఱ్ఱెపై శయనించె
    నేలినాటి శనికి పాల బడుచు
    3.పాలనిచ్చు గేదేపై పవళించెను
    శునకమొకటి,తరచి జూడ మనకు
    సస్యమిచ్చు రైతు చాకిరి చేయంగ
    కునుకు చున్న దొరలు గుర్తు రారె



    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదాలండీ భూసారపు నర్సయ్యగారూ..శంకరయ్య మాస్టారుగారూ.సవరిస్తానండీ.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ బాగుంది. కృతజ్నతలు.
    నిస్సత్తువ లాగా నిస్సద్దుగ కూడా వాడ వచ్చను కున్నాను.
    నిద్దుర సుఖమే గాదుర
    గ్రద్దన భయమన నెరుగదు గదనట శునకం
    బద్దిర ముదమున మహి షిని
    సద్దింతయు జేయకుండ జక్కగ నెక్కెన్

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    టైపాట్లు రాకుండా జాగ్రత్త వహించండి.
    ‘భైరవుండు+అగుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘భైరవుడయి తాను బఱ్ఱెపై...’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. పసువువా యనిదిట్టు పామరుడనువాడు
    ----పరులమేలొనగూర్చ పాటుబడున?
    కుక్కలా మెక్కుచు కుక్కవా నీవన్న
    -----విశ్వాసమున్నదా?విజ్ఞు డయిన
    పచ్చి గడ్డిని మేసి –నచ్చిన పాలివ్వ
    -----గేదవా ననునట్టి గేలియేల
    జంతువు లైనను కొంతలో కొంతైన
    -----విశ్వాస మందున బెరుగు చుండ
    చదువు సంస్కార మున్నను చవటలయ్యు
    హితముగూర్చని బలహీన వెతలచేత
    సాగు|వారికి పాలిచ్చి సాకుచుండ
    ఎనుము కుక్కలు ననువారి మనుట గనుమ?

    రిప్లయితొలగించండి
  19. కాల భైరవా! లెమ్మిక చాలు నిదుర
    వేళ మించెను విధులకు వెడలవలయు
    మాయ జగతిది దేవరా! మప్టినున్న
    మనల నెరుగక మోదురు మనుజ జాతి!!!

    మప్టి= మారువేషము

    రిప్లయితొలగించండి
  20. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
    ‘గేదెవా యనునట్టి’ అనండి. ‘బలహీన వెతలు’ అని సమాసం చేయరాదు. ‘హిత మిడని బలహీనపు వెతల...’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మోదురు’ అన్న ప్రయోగం లేనట్టుంది. అక్కడ ‘మనల నెరుగక మోదును/బాధించు మనుజజాతి’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. గురువు గారికి మీ సూచన మేరకు సవరించిన పద్యముల

    భైరవు౦డు కాశి పట్నము నకురక్ష
    గ్రామ సింహ మరయ గాచు పశుల
    పల్లెలందు గాన పవళించె గేదె పై
    చక్కగాను తనదు హక్కటంచు
    2ఎద్దుఎక్కిరి౦త ఈశ్వరుడై యు౦డె
    తొలియుగమ్ములందు, కలిని నేడు
    భైరవుడయి తాను బఱ్ఱెపై శయనించె
    నేలినాటి శనికి పాల బడుచు
    3.పాలనిచ్చు గేదెపై పవళించెను
    శునకమొకటి, తరచి జూడ మనకు
    సస్యమిచ్చు రైతు చాకిరి చేయంగ
    కునుకు చున్న దొరలు గుర్తు రారె

    రిప్లయితొలగించండి