21, సెప్టెంబర్ 2015, సోమవారం

పద్య రచన - 1013

కవిమిత్రులారా,
“మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

29 కామెంట్‌లు:


  1. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ మోద మందుచున్
    కనుగొనె గోపకాంతల టగాంచ గవెన్నుని రాసక్రీ డలన్
    పెనగొని చారు భంగిమల వీవరి యందున నూయ లూగుచున్
    తనరుచు పాడు చుండిరవి తన్మయ మందున వేణు గానముల్

    రిప్లయితొలగించండి
  2. క్షమించాలి
    చిరి పాదంలో " పాడు చుండిరతి తన్మయ మందున "
    అని ఉంటే బాగుంటుందేమో అని

    రిప్లయితొలగించండి
  3. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ తల్లడిల్లి బం
    ధనమున జిక్కి జీవితము నాశనమొందెను మోక్షకామ్య చిం
    తన మొక సుంతఁ జేయక వృధాయయె కాల, ముపేక్ష వీడి మా
    హనుమకు భక్తిఁ మ్రొక్కెదనహర్నిశమున్ విడివోని దీక్షచే.

    రిప్లయితొలగించండి

  4. మనసి జ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ సంత సంబున
    న్దనరుచు గోపకాంతలు మదిన్బుల కాం కితు లౌచు వారలు
    న్దనువు దలిర్ప యప్పుడు మదిన్దల చంగ దృ గంచిత బుధ్ధి దా
    నెనరగ గృ ష్ణు డ య్యెడ మునెన్నడు లేని విధంబు గన్పడె న్

    రిప్లయితొలగించండి
  5. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ నుగ్రమూర్తియై
    త్రినయనుడగ్నినేత్రమును దిగ్గున దెర్వగ కాలిపోయినన్
    దనపతి దైవకార్యమునఁ తప్పులు చూడక బ్రోవుమంచుఁ దా
    వినయము జూపగన్ రతికి ప్రీతిని గూర్చు వరమ్మొసంగడే!

    రిప్లయితొలగించండి
  6. మనసిజ పుష్పభాణములు మాటికి గ్రుచ్చగ కీచకుండు తా
    కనెను ముదమ్ముతోడుతను కన్నులకింపొనరించు మాలినిన్
    తనువునఁబ్రేమ చిప్పిలగ తన్విని పొందుచు కాంతశోభతో
    తనసహజన్ గనుంగొనిచు తన్విని గూర్చి వచించ కోరెడిన్

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అన్నులమిన్న’ను ‘కన్నులమిన్న’ అన్నారు. మీ పద్యానికి నా సవరణ....
    మనసిజ పుష్పభాణములు మాటికి గ్రుచ్చగ కీచకుండు తా
    కనెను ముదమ్ముతోడుతను కన్నులు మెచ్చు మిటారి మాలినిన్
    తనువునఁ బ్రేమ చిప్పిలగ తన్విని పొందగ గోరి మోహియై
    తన సహజన్ గనుంగొనుచు తన్విని గూర్చి వచించెఁ బంపగా.
    మీ సవరించిన పూరణను ఇప్పుడే చూచాను. బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    రెండు, మూడవ పాదాలలో యతి తప్పింది. మూడవపాదంలో గణదోషం. ‘మున్నెన్నడు’ను ‘మునెన్నడు’ అన్నారు.
    పద్యాన్ని సవరించండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శృంగారము:
    మనసిజ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ నొక్క మీనలో
    చన చనుకట్టుఁ జందమున చందన మల్ది, విశాలనేత్రముల్
    అనువుగ తీర్చి, కేతకిని యల్లికఁ గూరిచి కేశపాశమున్,
    చనువగువాని రూపు మది ఝల్లన, వేచెను మాపటేళలోన్.
    రౌద్రము:
    మనసిజ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ భగ్నదీక్షుఁడై
    తొణుకగ భవ్యదేహమున ధూమము, దిగ్గున లేచి యంతటన్
    కినుక వహించి రోషమున కెందొగ చిచ్చర కంట నిప్పులున్
    కణకణ వ్రేల్చి యంగజుని కాయముఁ గాల్చె మహేశ్వరుండటన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమః

    మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ మానసమ్మునన్
    కనికరమింత లేక ననగార్చుచు కాముని బూది జేతువా
    నను కరుణించవేల కరుణామయ నాట్యకళావిశారదా
    యనుచు వియోగ దుఃఖమున యా రతి వేడె ననుంగునొందగన్

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చగ నిగ్రహంబుతో
      మనగల ధీరుడెవ్వడు? సుమాంగన చూపుల బాణముల్ ఎదు
      ర్కొనగల వాడు లేడు, సుమకోమలి నవ్విన పాదదాసుడౌ
      కనినను ఇంతి నేత్రములు కాముని వాసమనంగ నొప్పదే.

      తొలగించండి
  11. రవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపద్యంలో ‘మాపటివేళ’ను ‘మాపటేళ’ అన్నారు. అక్కడ ‘రాత్రివేళలన్’ అనండి.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దుఃఖమున నా రతి వేడె మనమ్ము కుందగన్’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గురువు గారు,

    ధన్యవాదాలండి. మారుస్తున్నాను.

    మనసిజ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ నొక్క మీనలో
    చన చనుకట్టుఁ జందమున చందన మల్ది, విశాలనేత్రముల్
    అనువుగ తీర్చి, కేతకిని యల్లికఁ గూరిచి కేశపాశమున్,
    చనువగువాని రూపు మది ఝల్లన, వేచెను రాత్రివేళలన్.

    రిప్లయితొలగించండి
  13. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చగ రాగమాలికల్
    తనువునువెచ్చ జేయగ మిటారి వరూధిని మాటిమాటికిన్
    వనరుహలోచనున్ ప్రవరువంకన మైకపుచూపు నిల్పుచున్
    కనులను కంచెగామలచి కానివి లేనివి యేమికోరెనో !!!

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పీతాంబర్ గారూ
    రెండవపాదంలో "ట" కు "త" తో యతి కట్టేరు. అది సమ్మతమేనా??

    రిప్లయితొలగించండి
  16. మనసిజ పుష్పబాణము లుమాటికి గ్రుచ్చఁగ వెచ్చనూర్చుచున్
    వనరుహ నేత్రుఁ గృష్ణు మధువైరి తలంపుల బాధలోర్వకన్
    ఘనవిపి నాంతరమ్ముల నఘారి నగోచర దర్శ నార్తులున్
    చనిచని వేడుకొంటి రట జాడ నొసంగ లతా నగమ్ములన్

    రిప్లయితొలగించండి
  17. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ జేరె కశ్యపున్
    తనసతి నాథ! నాతనువు తాపము దీర్పు మటన్న నో దితీ!
    యినుడపరాద్రి గ్రుంకుతరి నిట్టి మనోరధమా త్రిలోచనుం
    డనుపమరీతి నర్తనము నాడెడి వేళ శుభమ్ము కాదనెన్.

    రిప్లయితొలగించండి

  18. మనసి జ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ సంత సంబున
    న్దనరగ గోపకాంతలు నెద న్బుల కాం కితు లౌచు వారలు
    న్దనువు గగుర్పొడం గను నెద న్గ ల చంగ దృ గంచిత బుధ్ధి దా
    నెనరగ గృ ష్ణు డప్పుడట యెన్నడు లేని విధంబు గన్పడె న్

    రిప్లయితొలగించండి
  19. మనసిజ పుష్పబాణము లుమాటికి గ్రుచ్చఁగ వెచ్చనూర్చుచున్
    వనరుహ నేత్రుఁ గృష్ణు మధువైరి తలంపుల బాధలోర్వకన్
    ఘనవిపి నాంతరమ్ముల నఘారి నగోచర దర్శ నార్తులున్
    చనిసని వేడుకొంటి రట జాడ నొసంగ లతా నగమ్ములన్

    రిప్లయితొలగించండి
  20. గురువుగారికి నమస్సులు. తన్వి మూడునాలుగు పాదములలో అన్యార్థములతో వాడాను.
    తన్విని పొందుచుః తనివిని పొంధుచు
    తన్విని గూర్చిః తనుమద్యను గూర్చి

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ మన్మథార్తయై
    తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
    చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
    ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళిలోన్!

    రిప్లయితొలగించండి
  22. మనసిజ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ దేహమందు కా
    మన దహియి౦ఛి వైవ నభిమానము ,లజ్జయు లేక జీవుల౦
    దున మతి కోలు పోవగను దుష్కృతముల్ యొనరి౦త్రు ప్రాజ్ఞులున్
    గనరిక నుచ్చ నీచలను కామినులన్ రమియింప జూతురన్

    రిప్లయితొలగించండి
  23. శ్రీ ఆదిభట్ల గారు నమస్కారము . పొరపాటును సవరించాను. ధన్యవాదములు


    మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చగ రాగమాలికల్
    తనువునుచుట్ట తాళకను తన్వి వరూధిని మాటిమాటికిన్
    వనరుహ లోచనున్ ప్రవరు వంకన మైకపు చూపు నిల్పుచున్
    కనులను కంచె గామలచి కానివి లేనివి యేమి కోరెనో !!!

    రిప్లయితొలగించండి
  24. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    ‘నఘారి నగోచర...’?
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘బాణముల్ ఎదుర్కొన్, కనినను ఇంతి’ అన్నచోట్ల విసంధిగా వ్రాసారు. అది దోషమే.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీరు మొదట ప్రకటించిన పద్యాన్ని తొలగించారు. అందులో నాకు ఏ దోషాలు కనిపించాయో, ఎందుకు సవరణ సూచించానో ఇప్పుడు గుర్తు లేదు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దుష్కృతముల్+ఒనరించు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఉచ్చనీచముల’ అనండి. ‘జూతురన్’...?

    రిప్లయితొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:

    మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ మందుగొట్టుచున్
    వినకయె మంచిమాటలను వీనుల విందగు పార్వతమ్మవౌ
    చనువుగ చేరదీసినది చంద్రముఖమ్మను వీడిపోయెడిన్...
    కనుముర దేవదాసుడను కష్టము మీరగ మల్టిప్లెక్సునన్

    రిప్లయితొలగించండి
  26. మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ నాదు హృత్తునన్
    కనగను వంగ భామినుల గారబు చేష్టలు ఖర్గపూరునన్
    వినుచును వారి తియ్యనవి ప్రేమపు మాటలు తల్లడిల్లుచున్,
    తినుటను గాంచి మత్స్యముల, తీవ్రపు బాధను పారివచ్చితిన్

    రిప్లయితొలగించండి