కవిమిత్రులకు నమస్కృతులు. మా అబ్బాయికి శస్త్రచికిత్స నిన్న మిర్యాలగూడలో జరిగింది. ఇంతకుముందే ఇల్లు చేరాను. రెండురోజులు బ్లాగుకు అందుబాటులో లేను. ఈ రెండు రోజుల సమస్యలకు చక్కని పూరణలను పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. వీలైతే రేపు సమీక్షిస్తాను.
మినుకు మినుకు మంచు మిలమిల మెరయుచు
రిప్లయితొలగించండిచుక్క రేని గరము జుట్టి యుండి
నీలి గగన మందు నిలచిన రీతి జి-
తరువున వెలుగొందె దారలెల్ల.
గగన మందు మ్రోగె గంభీర నాదమ్ము
రిప్లయితొలగించండిమేరిమాత కనులు మెరిసి మురిసె
క్రీస్తు జనన మొందె క్రిస్టమస్పర్వాన
తరువున వెలుగొందెఁ దార లెల్ల.
మినుకు మినుకు మంచు మిలమిల మెరయుచు
రిప్లయితొలగించండిచుక్క రేని గరము జుట్టి యుండి
నీలి గగన మందు నిలచిన రీతి జి-
త్తరువున వెలుగొందె దారలెల్ల.
పరవశమ్ము గొలుపు పచ్చని శోభతో
రిప్లయితొలగించండిమరల వచ్చెనిపుడు మండునెలయె
విరులు భముల వోలె వికసించి మెరియంగ
తరువున వెలుగొందె తార లెల్ల !!!
మేఘ మాల లందు దోగాడు మామతో
రిప్లయితొలగించండిరాస లీల లాడు రాత్రిజములు
చిత్రముగను వేసె చిత్రకారుండు జి
త్తరువున వెలుగొందె తారలెల్ల!!!
చూడ ముచ్చ టయ్యె చూ త ఫ లమ్ములు
రిప్లయితొలగించండితరువున, వెలుగొందె దార లెల్ల ,
నాక సంబు మీద యంతట మిలమిల
లాడు చుమఱి కాంతి తోడ నార్య !
శిశిరమందు యున్న సిగ్గునువిడనాడి
రిప్లయితొలగించండిఈవసంత సంత నిష్టపడగ|
పూల పరిమళములు పుట్టినకాయలు
తరువున వెలుగొందె|దారలెల్ల|
నవ్వుపువ్వులన్ని-నవ్యమన్మథునండ
జయము దెచ్చు ననుచు భయములేక
చైత్రమాసమందు జైత్రయాత్రకు రాగ
తరువున వెలుగొందె దారలెల్ల
పెద్ద రైతు నింట పెండిలి జరుగగ
రిప్లయితొలగించండివివిధ దీపములట వెలుగులీనె
పాదపమును చూసి పలికిరి జనులంత
తరువున వెలుగొందె తారలెన్నొ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్సుమాంజలులతో...
రిప్లయితొలగించండిజయము హనుమ! నీవు సంజీవనౌషధుల్
దెచ్చునపుడు నవియు దివ్యముగను
మెఱసిపోఁతఁ జూడ, మెండైన తచ్ఛైల
తరువున వెలుఁగొందెఁ దార లెల్ల!!
నేత్ర పర్వమాయె నింబ వృక్షము క్రింద
రిప్లయితొలగించండిసాయి విగ్రహమ్ము రేయి నిల్ప
పేర్చ మినుకు మనెడు విద్యుత్తు దీపాలు
తరువున వెలుగొందెఁ దార లెల్ల!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెండి తెరను నిలచి నిండైన కీర్తితో
రిప్లయితొలగించండిమిల మిలలను వెలుగు మెరుపుతోడ
పత్రపుష్ప రహిత చిత్రసీమ యనెడు
తరువున వెలుగొందె తారలెల్ల
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా అబ్బాయికి శస్త్రచికిత్స నిన్న మిర్యాలగూడలో జరిగింది. ఇంతకుముందే ఇల్లు చేరాను. రెండురోజులు బ్లాగుకు అందుబాటులో లేను.
ఈ రెండు రోజుల సమస్యలకు చక్కని పూరణలను పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
వీలైతే రేపు సమీక్షిస్తాను.