27, సెప్టెంబర్ 2010, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - 10

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
( దీనిని చంద్ర శేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు )
లంగానెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై.

11 కామెంట్‌లు:

 1. ఆర్యా, చక్కటి సమస్య నిచ్చారు. దీన్ని చూస్తుంటే ఆశావాది ప్రకాశరావు గారు పూరించిన ఒక పూరణ గుర్తుకొస్తోంది. దాని లింకు ఇదిగో

  రిప్లయితొలగించండి
 2. మహిని రక్షింప మహిషుని నుండి
  ఎల్లలోకములు వేడె లోకమాత పార్వతిని అభయ
  మనచు ఆయుధములు కోమలంగా
  నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై

  రిప్లయితొలగించండి
 3. మహిని రక్షింప మహిషుని నుండి
  ఎల్లలోకులు వేడె లోకమాత పార్వతిని అభయ
  మనచు ఆయుధములు కోమలంగా
  నెత్తి లతాంగి చెంగుమనుచున్ లంఘించె దైత్యేంద్రుపై

  రిప్లయితొలగించండి
 4. శంకరయ్య గారూ నమస్కారము. నా పూరణ :

  చెంగావంచుల చేలమందు మెఱుగుల్ చిందింప రాగమ్ములన్
  జెంగల్వమ్ములు పాణిపద్మములపై చిట్టాడ భృంగమ్ములున్
  రంగాయించుచు కోపమందుఁ గనులున్ రాజిల్ల, వాలమ్ము వా
  లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై.

  మఱి ఆ లతాంగి సత్యభామా ? లేక కాళికామాతా ? ఎలాగైనా అన్వయించుకోవచ్చును.

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్య గారూ నమస్కారము. మరో పూరణండీ:
  మహిషాసురుడుపై కాళీ మాత,:

  చెంగావంచుల చేలమందు మెఱుగుల్ చిందింప రక్తమ్ములన్
  జెంగల్వమ్ములు పాణిపద్మములపై చిట్టాడ రాగమ్ములున్
  శృంగమ్ముల్ గొని శీర్షమెత్తి తునుమన్ శీఘ్రమ్ము వాలమ్ము వా
  లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై .

  రిప్లయితొలగించండి
 6. శంకరయ్యగారూ నమస్కారము. కోపముతో వస్తున్న సత్యభామను వర్ణించే నా పూరణ..

  అంగారాంబులు వెల్లువాయె కనులన్; కంపించె నాసాగ్రమున్;
  అంగాంగమ్ములు పట్టుదప్పెఁ అతిక్రోధమ్మావహించెన్గదా!
  శృంగారాకృతిమాయమయ్యె; ధనువున్, చేదండముత్యాలు రా
  లంగా నెత్తి, లతాంగి చెంగు మనుచున్ లంఘించే దైత్యేంద్రుపై

  రిప్లయితొలగించండి
 7. శంకరయ్యగారూ నమస్కారం. ఈ వారాంతపు సమస్యకు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారినో పూరణ అడగండి. ఆయన పద్యాన్ని అందంగా మలచగలరు. కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 8. శృంగార౦బుగ లోకమాత వెలసెన్ శ్రీదుర్గ రోషాకృతి
  న్నంగారాయుత నేత్రయై చనియె నానాలోక రక్షాకరం
  బు౦గా నమ్మహిషున్ హరింప త్రిశులంబున్విస్ఫులింగాలు రా
  లంగానెత్తిలతాంగిచెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై!
  విన్నపము: శృ౦గారము = అలంకారము అనే అర్థము.

  రిప్లయితొలగించండి
 9. పొంగెన్ క్రోధము భర్త దుస్థితికి యుప్పొంగెన్ శౌర్య మా సత్యలో
  కొంగున్ చుట్టెను మధ్యకున్ నరకునిన్ కూల్చంగ తా వింటికై
  వంగెన్ కాంచన హార దీధితులు నల్వంకల్ విరాజిల్ల లీ
  లంగా నెత్తి లతాంగి చెంగుమనుచున్ లంఘించె దైత్యేంద్రుపై!

  రిప్లయితొలగించండి
 10. శృంగార జ్వర రోగ పీడితు లిలన్ చూడంగ నున్నారు వై
  భోగంబే తన యోగ్య మార్గమని సన్మోహించి , మత్తెక్కి , దై
  త్యాంగన్ తా చరబట్ట లేచి మద పైత్యంబెక్కి , పైపైన , వా
  లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించే దైత్యేంద్రు పై ..

  రిప్లయితొలగించండి
 11. కంగారెత్తగ హిందులందరిని భల్ కవ్వించు కార్యంబునన్
  దొంగల్ దూరుట గాంచి రాష్ట్రమున తా దుఃఖించి పోలీస్లతో
  బంగాలమ్మరొ మోడి రాక్షసుల తా బంధించి, హస్తమ్మునన్
  లంగానెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై

  రిప్లయితొలగించండి