11, సెప్టెంబర్ 2010, శనివారం

చమత్కార పద్యాలు - 20

దశావతార స్తుతి - 4 (నృసింహావతారం)
శా.
డింభద్రోహి వధోత్కటోత్క్రమణ రుష్టిక్లిష్టతా రోమ కూ
పాంభోజప్రభవాండ భాండ దళనోద్యద్ధ్వాన ధీకృత్సభా
స్తంభాంతస్తృటనాస్ఫురత్పట పటధ్వన్యాస్త నిశ్చేష్ట ని
ర్దంభోద్యోగ దిశావశాప నృహరిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది)
భావం -
నృసింహావతారుడవైన ఓ పరమాత్మా! బాలుడైన ప్రహ్లాదునికి ద్రోహి యైన హిరణ్యకశిపుని చంపడానికై నీవు శీఘ్రంగా వెడలగానే తీవ్రమైన రాపిడి చేత సభాస్తంభం బ్రద్దలై పటపట ధ్వని అంతటా వ్యాపించింది. అది వినగానే దిగ్గజాలన్నీ నీ రోమ కూపాలలో ఉన్న బ్రహ్మాండ భాండాలన్నీ బ్రద్దలైనాయని భ్రాంతి చెంది భయంతో నిశ్చేష్టా లైపోయాయి. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

1 కామెంట్‌:

  1. కంది శంకరయ్య గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

    హారం

    రిప్లయితొలగించండి