28, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 108

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
బైబులుతో పాటు చదివె భగవద్గీతన్.

12 కామెంట్‌లు:

  1. మా బాపూ గాంధీగా
    రాబాల్యము భక్తిఁ గలిగి యద్భుత ఫణితిన్
    శోభిల ఖురాను; మరియును
    బైబులుతో పాటు చదివె భగవద్గీతన్.

    రిప్లయితొలగించండి
  2. ఒక విద్వాంసుడు,

    కాబోలు వాడె వీడే
    మా బోటులఁ నెఱుగ దరమె మత సూక్ష్మములన్
    మా బడికి దైవమొకటని
    బైబులుతో పాటు చదివె భగవద్గీతన్ .

    రిప్లయితొలగించండి
  3. రాబోవు కాల మందున
    మాబోటులు వేచి గనిన మంత్రించి నటుల్
    బాబా బలరామేసులు
    బైబిలు తో పాటు చదివె భగవద్గీతన్

    రిప్లయితొలగించండి
  4. రాబోవు కాల మందున
    మాబోటులు వేచి గనిన మంత్రించి నటుల్
    బాబా బలరామేసులు
    బైబులు తో పాటు చదివె భగవద్గీతన్

    క్షమించాలి " బైబులు " వ్రాయడానికి " బైబిలు " వ్రాసి నందుకు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గారిగి నమస్కారం,
    శ్రీ చంద్రశేఖర్ గారిచ్చిన సమస్యలకు నేను చేసిన పూరణలలో నే ననుకున్న భావనలుఇవి
    1 ) సిగలో నెలవంక ,జటాజూటంలో గంగ ,తన దేహ సగంలో పార్వతి,లయకారకుడై, ఈ లోకానికే
    నాథుడైన ఆ విలక్షణ రూపంలో ఈ కారు, డాలర్ల రూప్యము లందులో గోప్య మయ్యెగదా అని .
    2 )చేతిలోని ఉన్న డబ్బులు చాలక ,సిరిలున్నవారి కుటుంబంలో పుట్టక,చింతా మణి గా
    . మారి విటులకు యౌవనాన్నిఎర వేసి తన ఇబ్బందులనేకరవుపెట్టి, వారి కంపు డబ్బులతో
    తన కష్టాలను తీర్సుకొన్నదని భావించాను ఏది ఏమైనా నేను తిక మక పడి భావం కరెక్ట్ గా
    communicate చేయక పోయి ఉండవచ్చును
    మీ సవరణలు, సూచనలు మాకు నిత్య పాఠాలు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. వైభవ ఏసు చరిత్రను
    యీ భువ జనములకు తెలిపి యిడుములు దీర్పన్
    రాబర్టు దీక్ష తోడను
    బైబులు తో పాటు చదివె భగవద్గీతన్.

    రిప్లయితొలగించండి
  7. బాబా అవతార మెత్తగ
    రాబడి కనిపెట్టినట్టి లౌక్యుడు నేర్చెన్
    బాబా విద్యను, ఖురాను
    బైబిలు తో పాటు చదివె భగవద్గీతన్

    రిప్లయితొలగించండి
  8. బాబా వేషము దాల్చగ
    రాబడి బాగా తెలిసిన లౌక్యుడొకండే
    బాబా విద్యను నేర్వగ
    బైబిలు తో పాటు చదివె భగవద్గీతన్ !!

    ముందటి పూరణలో దోషాలున్నాయి, దీనిని అప్రూవ్ చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారు,
    మీ వారాంతపు పూరణ సమస్య కలిగించిన ప్రేరణతో చిన్న కథను అల్లి పొద్దువారికి పంపాను.
    ఇక్కడ చూడగలరు, http://poddu.net/?q=node/749

    గిరి

    రిప్లయితొలగించండి
  10. కేబులు రాకన్ , సాయికి
    సైబరు కేఫుకు జనుటకు సైకిలు లేకన్,
    టేబులు పైనన్ బెట్టిన
    బైబులు తో పాటు చదివె భగవద్గీతన్ .

    (సాయి యశ్వంత్ మనుమని పేరు )

    రిప్లయితొలగించండి
  11. చింతా రామకృష్ణారావు గారూ,
    ఉత్తమమైన పూరణతో నా బ్లాగును అలంకరించారు. ధన్యవాదాలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం నిర్దోషంగా, పూరణ అందంగా ఉంది. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    అన్నట్టు నాకో ధర్మ సందేహం. బైబుల్ అనాలా, బైబిల్ అనాలా? ఉచ్చారణలో ఏది కరెక్టు?

    పీతాంబర్ గారూ,
    సందేహ నివృత్తి చేస్తూ మీరిచ్చిన వివరణకు ధన్యవాదాలు.
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "ఈ భువ జనములకు" అని కాకుండా "ఈ భువి జనములకు" అంటే బాగుంటుంది.

    నచికేత్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    గిరి గారూ,
    పొద్దులో మీ లఘు కథాకావ్యాన్ని పైపైన చూసాను. బాగుంది. మరో సారి మనసుపెట్టి చదివి వివరంగా వ్యాఖ్యానిస్తాను. నా బ్లాగు వలన ప్రేరణ పొందినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ఓబులు రెడ్డయ్య జనుచు
    కాబూలుకు సైన్యమందు కప్తానుగభల్
    గాబర నొంది కొరానును
    బైబులుతో పాటు చదివె భగవద్గీతన్

    రిప్లయితొలగించండి