14, సెప్టెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 95

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
సిగపువ్వే వాడిపోదు చిత్రము కాదే!

8 కామెంట్‌లు:

 1. పగలే వెన్నెల కాయును
  సిగ పువ్వే వాడిపోదు చిత్రముగాదే?
  నిగనిగలాడును లోకము
  తగ మా యంత్రంబునుగొని తగిలించుకొనన్!

  రిప్లయితొలగించండి
 2. ఖగరాట్పతి విరులఁ గొను.
  నగసుతపతి మేనిఁ బూది నలదును.ఐనా
  నగుమోము దేవు నగయౌ
  సిగపువ్వే వాడిపోదు చిత్రము కాదే!

  రిప్లయితొలగించండి
 3. శంకరయ్య గారూ నమస్కారములు.మీ పేరే నా పద్యానికి స్ఫూర్తి

  పగవారును దితి తనుజులు
  సెగలూదుచు కొండ ద్రిప్ప సిరి తమ్ముడుడై
  తెగ వెలుగుచు శివునెక్కెను
  సిగ పువ్వే వాడిపోదు చిత్రము గాదే

  నరసింహ మూర్తి.

  రిప్లయితొలగించండి
 4. మరో పూరణండీ ,

  మగధీరుడు శ్రీకృష్ణుడు
  బిగువమ్మున సత్య యుండ పేర్మిని యిచ్చెన్
  పెగలించి పారిజాతము
  సిగ పువ్వే వాడిపోదు చిత్రము గాదే!

  రిప్లయితొలగించండి
 5. నారాయణ గారూ,
  వ్యాపార ప్రకటనగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. మీ రెండు పద్యాలూ బాగున్నాయి. చంద్రుణ్ణీ, పారిజాతాన్నీ విషయంగా చేయడం ఉత్తమోత్తమం. అభినందనలు.
  మొదటి పద్యం రెండవ పాదంలో "సిరి తమ్ముడుడై" అన్న చోట "సిరి తమ్ముండై" అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 6. నిన్న మా బంధువు (వరసకు అన్నయ్య) చనిపోవడంతో మీ పూరణలకు వెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 7. అగణితముగ భక్తు లొసం
  గిన కానుకలందు గలదు కనక సుమమ్మే
  జగదంబ కలంకరణము
  సిగపువ్వే వాడిపోదు చిత్రము గాదే!

  రిప్లయితొలగించండి
 8. వగలాడీ! తురిమితి నీ
  సిగలో ప్లాస్టికు గులాబి శ్రీకరముగ నేన్
  పగలును రాత్రియునిక నీ
  సిగపువ్వే వాడిపోదు చిత్రము కాదే!

  రిప్లయితొలగించండి